చిత్రం : రౌడీ బాయ్స్ (2022)
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
సంగీతం : దేవీశ్రీప్రసాద్
గానం : మంగ్లీ
బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న రాధని చూసాడే
చూసాడే రాధని చూసాడే
ఫ్లూట్ లేని గోపాలుడే
సూట్ వేసే భూపాలుడే
మీసమొచ్చినా బాలుడే
మాట వింటే పడిపోవుడే
కటిక చీకటిలోన కన్ను కొడతడే
వెన్న ముద్దలని వెంట పడతడే
గోల చేస్తాడా గాలమేస్తాడే
మాయలోడు వీడే
హోయి
బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
అరెరే
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే
అః ఆ .. ఆ .. ఆ …
రోమియోలా రోమియోలా
క్యాప్ పెట్టి క్యాప్ పెట్టి
రోజు వచ్చి రోడ్డు మీద
ఫోజు కొడతాడే
కాస్త సందు కాస్త సందు
ఇచ్చామంటే ఇచ్చామంటే
సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే
రంగు రంగుల ఠింగురంగడే
బొంగరమోలే తిరుగుతుంటడే
వొర చూపుల గాలి పోరడే
పగటి దొంగ వీడే
హోయి
బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే
ఏ తిక్కలోడ్ని తిట్టాలంటూ తిట్టాలంటూ
ముద్దు పెదవికి ముచ్చటేసి మూడు వస్తుందే
అయ్యబాబోయ్ అయ్యబాబోయ్
అంతలోనే అంతలోనే
వద్దుపోని అంటూ మనసే
అడ్డు పడుతుందే
అనగనగా మొదలైన ఈ కథ
వంచ దాటి ఏ కంచె వెళ్తదో
ఏమౌతుందో ఎం చేస్తాడో
జాదుగాడు వీడే ….
ఆమ్మో
బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
హ .. ఆ.. ఆ ..
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి