18, జనవరి 2022, మంగళవారం

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది పాట లిరిక్స్ - Ye Kulamu Needhante Gokulam Navvindhi Song Lyrics in Telugu - Sapthapadhi (1981) Telugu Songs Lyrics













చిత్రం : సప్తపది (1981)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి


 



ఏ కులము నీదంటే

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు

మా కులమే లెమ్మంది

 

ఓఓఓఓఓఓ... 

ఆఆఆఆఆఆ...

 

ఏ కులము నీదంటే

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు

మా కులమే లెమ్మంది

 

ఏడు వర్ణాలు కలిసి

ఇంద్రధనస్సవుతాది

అన్నీ వర్ణాలకు ఒకటే

ఇహము పరముంటాది

 

ఏడు వర్ణాలు కలిసి

ఇంద్రధనస్సవుతాది

అన్నీ వర్ణాలకు ఒకటే

ఇహము పరముంటాది

 

ఏ కులము నీదంటే

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు

మా కులమే లెమ్మంది

 

ఆది నుంచి ఆకాశం మూగది

అనాదిగా తల్లి ధరణి మూగది

ఆది నుంచి ఆకాశం మూగది

అనాదిగా తల్లి ధరణి మూగది

 

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు

ఈ నడమంత్రపు మనుషులకే మాటలు

ఇన్ని మాటలు..

 

ఆఆఅ ఏ కులము నీదంటే

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు

మా కులమే లెమ్మంది

 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి