చిత్రం : అరణ్య (2021)
సంగీతం : శంతను మొయిత్రా
సాహిత్యం : వనమాలి
గానం : హరిచరణ్
చిటికేసే ఆ చిరుగాలి
చిందేసి ఆడే నెమలి
కిలకిలమని కోకిల వాలి
పాడెనులె హాయిగ లాలి
అడివంతా ఒకటై
ఆహ్వానమే పలికనీ
ఆడనీ! పాడనీ!
చిందులే వెయ్యనీ
ఆడనీ! పాడనీ!
చిందులే వెయ్యనీ
చిటికేసే ఆ చిరుగాలి
చిందేసి ఆడే నెమలి
అడివంతా ఒకటై
ఆహ్వానమే పలికనీ
ఆడనీ! పాడనీ!
చిందులే వెయ్యనీ
ఆడనీ! పాడనీ!
చిందులే వెయ్యనీ
చుక్కలేడి కూనల్లారా
అడివమ్మ పాపల్లారా
అందమైన లోకం ఇదీ
అందుకో మరి అంటున్నదీ
హోయ్
కొమ్మల్లో పూచే పూలూ
కురిపించెను అక్షింతల్లూ
అల్లరి చేసే తెమ్మెరలు
పూసెనులే సుమగంధాలు
సాగే నీ దారుల్లో
హరివిల్లునే దించనీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి