షాషా తిరుపతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
షాషా తిరుపతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2022, సోమవారం

మనసు మరీ మత్తుగా పాట లిరిక్స్ - Manasu Mari Matthugaa Song Lyrics in Telugu - V (2020) Telugu Songs Lyrics









చిత్రం : వి (2020)

సంగీతం : అమిత్ త్రివేది

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : అమిత్ త్రివేది, షాషా తిరుపతి

 


మనసు మరీ మత్తుగా 

తూగిపోతున్నదే ఏమో ఈ వేళా

వయసు మరీ వింతగా 

విస్తుబోతున్నదే నీదే ఈ లీలా

అంతగా కవ్వింస్తావేం గిల్లి

అందుకే బందించేయ్ నన్నల్లి

కిలాడి కోమలీ… గులేబకావళీ

సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ

 

మనసు మరీ మత్తుగా 

తూగిపోతున్నదే ఏమో ఈ వేళా

వయసు మరీ వింతగా 

విస్తుబోతున్నదే నీదే ఈ లీలా

 

ఓ అడుగులో అడుగువై 

ఇలా రా నాతో నిత్యం వరాననా

హ.. బతుకులో బతుకునై 

నివేదిస్తా నా సర్వం జహాపనా

పూలనావ.. గాలితోవ.. హైలో హైలెస్సో

ఓ.. చేరనీవా చేయనీవా.. సేవలేవేవో

 

ఓ… మనసు మరీ మత్తుగా 

తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…

ఓ.. వయసు మరీ వింతగా 

విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…

 

మనసులో అలలయే 

రహస్యాలేవో చెప్పే క్షణం ఇదీ..

మనువుతో మొదలయే 

మరో జన్మాన్నై పుట్టే వరమిదీ..

నీలో ఉంచా నాప్రాణాన్ని 

చూసి పోల్చుకో

ఓ.. నాలో పెంచా నీ కలలన్నీ.. 

ఊగనీ ఊయల్లో

 

మనసు మరీ మత్తుగా 

తూగిపోతున్నదే ఏమో ఈ వేళా

ఓ.. వయసు మరీ వింతగా 

విస్తుబోతున్నదే నీదే ఈ లీలా

అంతగా కవ్విస్తావేం గిల్లి..

అందుకే బందించేయ్ నన్నల్లి..

కిలాడి కోమలీ… గులేబకావళీ…

సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…

 


 

25, జులై 2021, ఆదివారం

శివంగివే శివంగివే పాట లిరిక్స్ - Sivangivey Sivangivey Telugu Song Lyrics - Whistle (2019) Telugu Songs Lyrics





చిత్రం : విజిల్ (2019)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : రాకేందు మౌళి

గానం : ఎ.ఆర్.రెహ్మాన్, శరత్ సంతోష్

షాషా తిరుపతి


 

మానినీ... మానినీ..

అడుగులే ఝుళిపించు పిడుగులై

ఒళ్ళు విరుచుకో

విను వీధి దారిన మెరుపుల

భూమినే బంతాడు కాలమే

మీదే ఇక పై లోకం వీక్షించేనిక

మగువల వీరంగం

 

ఓఓ..ఓ.ఓ..

శివంగివే శివంగివే

తలవంచే మగ జాతి నీకే

నీ త్యాగమే గుర్తించగా

సాహో అంటూ మోకరిల్లదా

రారా రాణీ కానీ కానీ

నీ హాసం లాసం వేషం రోషం

గర్వించేలా దేశమే

ఏరై పారే తీరై

ఏరి పారెయ్ తీరాలన్నీ

వల్ల కాదన్న వాళ్ళ

నోళ్ళే మూయించాలిక

కోరే భవితకి బాట వేయి

జారే జారే ధారే కంట

మారి స్వేదం అయ్యేనంట

అబలంటే ఊరుకోక శక్తి నీవని

చాటి భయముకి బదులునీయి

 

శివంగివే శివంగివే

తలవంచే మగ జాతి నీకే

నీ త్యాగమే గుర్తించగా

సాహో అంటూ మోకరిల్లదా

ఏరై పారే తీరై

ఏరి పారెయ్ తీరాలన్నీ

వల్ల కాదన్న వాళ్ళ

నోళ్ళే మూయించాలిక

కోరే భవితకి బాట వేయి

జారే జారే ధారే కంట

మారి స్వేదం అయ్యేనంట

అబలంటే ఊరుకోక శక్తి నీవని

చాటి భయముకి బదులునీయి

 

నువ్వీపని చేయ్యాలంటూ

నిర్దేశిస్తే నమ్మద్దు

నీ పైన జాలే చూపే గుంపే

నీకు అసలొద్దు

ఊరే నిను వేరె చేసి

వెలివేస్తున్నా ఆగద్దు

నీలోనీ విద్వత్తెంతో

చూపియ్యాలి యావత్తు

లోకం నిను వేధించి

బాధిస్తున్నా పోనీవే

ప్రసవాన్ని ఛేదించి

సాధించే అగ్గిమొగ్గవే

కదిలి రా భువిని ఏలగా

ఎగసి రా..

అగ్గిమొగ్గవే

కదిలి రా నీ సరదా

కలల్ని కందాం రా

ఏ పరదాలైనా తీద్దం రా

ఏరై పారే తీరై 

 ఏరి పారెయ్ తీరాలన్నీ

వల్ల కాదన్న వాళ్ళ

నోళ్ళే మూయించాలిక

కోరే భవితకి బాట వేయి

జారే జారే ధారే కంట

మారి స్వేదం అయ్యేనంట

అబలంటే ఊరుకోక శక్తి నీవని

చాటి భయముకి బదులునీయి

 

ఎదే గాయాలు దాటే సమయం ఇదే

నీ బాధే మారె గాధలా

నీ భారం నీవే మోయాలమ్మా

విజయాల ఆశయమే

తరుణోదయమై కాంతి నిండగా

తరుణోదయమై కాంతి నిండగా

 

శివంగివే శివంగివే

తలవంచే మగ జాతి నీకే

నీ త్యాగమే గుర్తించగా

సాహో అంటూ మోకరిల్లదా

రారా రాణీ కానీ కానీ

నీ హాసం లాసం వేషం రోషం

గర్వించేలా దేశమే

ఏరై పారే తీరై

ఏరి పారెయ్ తీరాలన్నీ

వల్ల కాదన్న వాళ్ళ

నోళ్ళే మూయించాలిక

కోరే భవితకి బాట వేయి

జారే జారే ధారే కంట

మారి స్వేదం అయ్యేనంట

అబలంటే ఊరుకోక శక్తి నీవని

నీ భయముకి నీ భయముకి

బదులునీయి