30, జనవరి 2022, ఆదివారం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట పాట లిరిక్స్ - Konthakaalam Kindhata Brahma Devuni Mungita Song Lyrics in Telugu - Nee Sneham (2002) Telugu Songs Lyrics













చిత్రం : నీస్నేహం (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్  
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఆర్.పి.పట్నాయక్, రాజేశ్




కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం

కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్ను నన్నూ చూడగానే నమ్మితీరాలి

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

బొమ్మా బొరుసులేని నాణానికి విలువుంటుందా 
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలీ నీ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలీ ఈ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట 
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం

కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్ను నన్నూ చూడగానే నమ్మితీరాలి 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి