చిత్రం : టక్ జగదీష్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కళ్యాణ్ చక్రవర్తి
గానం : రంజని
నీటి నీటి సుక్కా నీలాల సుక్కా
నిలబాడి కురవాలి నీరెండయేలా
వరినారు గుత్తంగా గొంతెత్తి కూసే
పూటుగా పండితే పుటమేసి సేను
పెదకాపు ఇచ్చేను సరిపుట్ల ఒడ్లు
కొరకొంచి సూసేటి కొత్త అలివేలు
మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే
గరిగోళ్ళ పిలగాడే ఘనమైన వాడే
కిట్టయ్య కనికట్టు ఓ గొల్లభామా
ఎగదన్ని నిలుసున్నా నిలువెత్తు కంకీ
నడుము వంచి వేసేటి నారు వల్లంకీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి