చిత్రం : కుటుంబ గౌరవం (1957)
సంగీతం : విశ్వనాథన్, రామ్మూర్తి
సాహిత్యం : అనిశెట్టి సుబ్బారావు
గానం : ఘంటసాల
ఛల్ ఛల్ ఛల్ ఛల్ చలో చలో
ఛల్ ఛల్ ఛల్ ఛల్ చలో చలో
పదరా పద పద రాముడు
పరుగు తీయరా భీముడు
పదరా పద పద రాముడు
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్
పందానికీ భలే హుషార్
పల్లెల మీదా మన సవాల్
పందానికీ భలే హుషార్
పదరా పద పద రాముడు
పరుగు తీయరా భీముడు
రాముడూ పెద్ద మొనగాడు
భీముడూ పెద్ద మోతుబరి
ముట్టిన కొట్టిన సహించరూ
మోరలెత్తి పైకెగబడుతారూ
కష్టం వేస్తే పెద్ద పులులవే
ఇష్టం వేస్తే పసిపాపలవే
పదరా పద పద రాముడు
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్
పందానికీ భలే హుషార్
తొలకరి జల్లే చిలకరించినా
పొంగి నేలయే పులకరించినా
పరవశమై దూకేస్తారూ
పొలాల చిటెకలో దున్నేస్తారూ
మా రైతులకే సాయంజేసీ
మహరాజులుగా మార్చేస్తారూ
ఏమంటావ్ రాముడూ
ఏమంటావ్ భీముడూ
ఏమంటావ్ రాముడూ
ఏమంటావ్ భీముడూ
అన్నా.. ఓ గోపన్నా..
నీకన్నా మాకు తోడు ఎవరున్నారన్నా
నీవంటే మాకిష్టం నీస్నేహం అదృష్టం
ఒహొహో ఒహొహో
అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా
అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా
మనసే విప్పి పలికారా మానవులైనారా
మనసే విప్పి పలికారా మానవులైనారా
అమ్మతోటి మీ చల్లని మాటలు చెపుతాలే రండి
అమ్మతోటి మీ చల్లని మాటలు చెపుతాలే రండి
అందరి చేతా ఘన సన్మానం చేయిస్తాలే రండి
పదరా పద పద రాముడు
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్
పందానికీ భలే హుషార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి