18, జనవరి 2022, మంగళవారం

రారా స్వామి రారా యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా పాట లిరిక్స్ - Rara Swami Rara Yadhuvamsa Sudhambudhi Chandra Song Lyrics in Telugu - Siri Siri Muvva (1978) Telugu Songs Lyrics












చిత్రం : సిరి సిరి మువ్వ (1978)

సంగీతం :  కె.వి.మహదేవన్

సాహిత్యం :  వేటూరి సుందరరామమూర్తి

గానం :  యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

 


 

రారా స్వామి రారా

యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా

శతకోటి మన్మధాకారా

స్వరరాగ సుధారస వీరా స్వామి రారా

నా పాలి దిక్కు నీవేరా

నీ పదములంటి మ్రొక్కేరా

నీ దానరా రావేలరా నన్నేలరా

భరత శాస్త్ర సంభరిత పదద్వయ

చరిత నిరత సమధుర మంగళ గళ రారా స్వామీ రారా!!

 

రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో

అనురాగ మూలకలే వేయాలని

నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో

రేపటి కోసం చీకటి రెప్పల తెర తీయాలని....

 

పిలిచాను ఎదుట నిలిచాను

కోరి కోరి నిన్నే వలచాను...

పిలిచాను ఎదుట నిలిచాను

కోరి కోరి నిన్నే వలచాను 

 

 

గంగ కదిలి వస్తే కడలి ఎలా పొంగిందో

యమున సాగివస్తే ఆ గంగ ఏమి పాడిందో

ఆమని వచ్చిన వేళ అవని ఎంత మురిసిందో

మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో...

 

ఊగింది తనువు అలాగే... పొంగింది మనసు నీలాగే..

ఊగింది తనువు అలాగే... పొంగింది మనసు నీలాగే..  

 

 

శృతి కలిపిందెన్నడో సిరిసిరిమువ్వల సవ్వడిలో

జత కలిసిందిప్పుడే ఆ గుడిలో నీ ఒడిలో

శృతి కలిపిందెన్నడో సిరిసిరిమువ్వల సవ్వడిలో

జత కలిసిందిప్పుడే ఆ గుడిలోన నీ ఒడిలో

 

మువ్వనై పుట్టాలని అనుకున్నా నొకనాడు

మువ్వనై పుట్టాలని అనుకున్నా నొకనాడు

దివ్వెనై నీ వెలుగులు రువ్వనీ యీ నాడు

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి