9, జనవరి 2022, ఆదివారం

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం పాట లిరిక్స్ - Jeevitham Saptasaagara Geetham Velugu Song Lyrics in Telugu - Chinni Krishnudu (1988) Telugu Songs Lyrics







చిత్రం : చిన్ని కృష్ణుడు (1988)

సంగీతం : ఆర్.డి.బర్మన్

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆషా భోంస్లే

 


తర..రా.తరతరా..తరా..తరా..తరతరా...

 

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

కల ఇల కౌగిలించే చోట

 

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

కల ఇల కౌగిలించే చోట

 

ఏది భువనం ఏది గగనం తారా తోరణం

ఈ చికాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ

ఏది సత్యం ఏది స్వప్నం డిస్ని జగతీలో

ఏది నిజమో ఏది మాయో తెలీయనీ లోకమూ

 

హే... బ్రహ్మ మానస గీతం ఆఆ..

మనిషి గీసిన చిత్రం ఓఓఓ

చేతనాత్మాక శిల్పం

మతి కృతి పల్లవించే చోట...

మతి కృతి పల్లవించే చోట

 

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

కల ఇల కౌగిలించే చోట

 

ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులూ

ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ

ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు

ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ..

 

హే... సృష్టికే ఇది అందం.. ఆఆ..

దృష్టికందని దృశ్యం.. ఆఅ..

కవులు రాయని కావ్యం... ఆఆఅ..

కృషి ఖుషి సంగమించే చోట..

కృషి ఖుషి సంగమించే చోట

 

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

కల ఇల కౌగిలించే చోట


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి