చిత్రం : ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం : శ్రీజో
గానం : అర్మాన్ మాలిక్, రమ్య బెహరా
హే మనసెందుకిలా
నిలిచిన చోటిక నిలవదుగా
నీ కనులకి బహుశా ఏమైందో తెలుసా
ఆ పెదవులు చేసే మాయకి
మాటలు చాలవిక
నా నడకలు నన్నే చేరక మానవుగా
అరక్షణము ఉండదు తిన్నగా ప్రాణము
అలజడి పడి నిను విడదే
అది విని గుండెలనాపిన దూరం
మెలమెల్లగా కరిగినదే
ఊ ఊఊ ఊ ఊఊ…
ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ
దగ్గరైన కొద్దీ దొరక్క జారకు
నీలి కళ్ళ తోటి కొరక్క మానకు
ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు
నిజము కదా
ఊపిరాడకుంటే ఈ కౌగిలేందుకు
ఎంత కోరికంటే ఓ గుండె చాలదు
ప్రేమ పొంగుతూనే పెదాలు దాచకు
జతపడవా
ఎంతగానో నన్ను నేను ఆపుకున్న
చెంత చేరమంటూ సైగ చేస్తావే
ఆటలాడుతూనే ఒక్కటై కలిసే
మనసులివే
ఊ ఊఊ ఊ ఊఊ…
ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ
హా చెంప గిల్లుతుంటే నీ చూపు చల్లగా
గుండె అందుకుందే కేరింత కొత్తగా
ఊరుకోమనంటే ఆగేది కాదుగా
మది సరదా
చెప్పలేక నీతో మనస్సు దాచగా
రెక్కలొచ్చినట్టు వయస్సు గోలగా
ఒక్కమాటతోనే తీసింది సూటిగా
ప్రతి పరదా
ఎందుకని ఉండనీవు నన్ను ఊరికే
మాటలాడి మాయలోకి తోస్తావే
ఎంత ముద్దుగుంది దగ్గరవుతుంటే
మన జగమే
ఊ ఊఊ ఊ ఊఊ…
ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి