చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.శైలజ
ఓం..ఓం..ఓం..
ఓం నమఃశివాయా!
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా
ఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
సా..గా..మ..ద.. ని.. స..
దగమద..ని సా గ మ
గ గ గా..స స స ని గా మదసని స మ గ
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా.. ఆ..ఆ
నీ మౌనమే ..
దశోపనిషత్తులై ఇల వెలయా
త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు
ప్రాకారములైత్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు
ప్రాకారములైగజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై
అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా
ఓం.. ఓం
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి