30, జనవరి 2022, ఆదివారం

ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా ప్రాణమా పాట లిరిక్స్ - O Prema Hrudaya Veena Neevamma Pranama Song Lyrics in Telugu - Devi Putrudu (2021) Telugu Songs Lyrics
















చిత్రం : దేవీపుత్రుడు (2001)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రసన్న




ఓ ప్రేమ హృదయ వీణ 
నీవమ్మా.. ప్రాణమా
ఓ ప్రేమ నుదుటి మీద 
కావమ్మా.. కుంకుమ 
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా

ఓ ప్రేమ హృదయ వీణ 
నీవమ్మా.. ప్రాణమా

అసలెందుకే ఆ అమృతమే
అనురాగముతో నువు నవ్వితే
రతిసుందరిలా దరిచేరితే
చెలరేగిపోయే యవ్వనమే
మన కోరికతో మాటాడితే
కొసచూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరి నా చెలి... 

ఓ ప్రేమ హృదయ వీణ 
నీవమ్మా.. ప్రాణమా..

శహనాయి మోగే కోవెలలో
శశికాంతులతో నను చేరుకో
గృహదేవతవై ఒడిచేర్చుకో
రతనాలు పండే నీ జతలో
సుఖశాంతులతో శ్రుతి చేసుకో
ప్రియలాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోని
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరి నా చెలి...

ఓ ప్రేమ హృదయ వీణ 
నీవమ్మా.. ప్రాణమా
ఓ ప్రేమ నుదుటి మీద 
కావమ్మా.. కుంకుమ 
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి