శ్రావణ భార్గవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రావణ భార్గవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, జనవరి 2022, మంగళవారం

సూపర్ మచ్చి.. సూపర్ మచ్చి.. పాట లిరిక్స్ - Super Machi Super Machi Sukka Song Lyrics in Telugu - Son of Sathyamurthy (2021) Telugu Songs Lyrics








చిత్రం : సన్నాఫ్ సత్యమూర్తి (2015)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : దేవీశ్రీప్రసాద్

గానం : దేవీశ్రీప్రసాద్, శ్రావణ భార్గవి

 


వందాచ్చే..వందాచ్చే...

మిన్ సారం పొళా మాపుళపుళ్ల వందాచ్చే

సూపర్ మచ్చి..

తందాచ్చే ...తందాచ్చే...ఎ...

యెంగ వీట తంగచ్చిలై ఉన్ కయ్యిల తందాచ్చి

సూపర్ మచ్చి

 

ఆ...మల్లిగాడి ఇంటి కాడ మల్లెపూలు కొసుకుంటే

చందుగాడి సందు కాడ సందమామ చూసుకుంటే

సుబ్బుగాడి తిప్ప కాడ సన్నజాజులేరుకుంటే

పొటుగాడి తొట కాడ సన్ గ్లాసులెట్టుకుంటే

చాకిరేవు గట్టు కాడ కొత్త సబ్బు రుద్దుకుంటే

సింగపూరు సేంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే

ముత్యమున్న ముక్కుపుడక ముక్కు మీద పెట్టుకుంటే

రోల్డు గోల్డు గాజులేసి చేతులేమో ఘల్లుమంటే

చీరకట్టు నేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే

సింగార్ కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే

అద్దంలొ చూసుకుంటే నాకు నేనె ముద్దుగుంటే

కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి నన్ను గుద్దుకుంటే

 

సూపర్ మచ్చి ...అడ సూపర్ మచ్చి

సూపర్ మచ్చి ...అడ సూపర్ మచ్చి

 

హె...వీరబాబు ఇంటికాడ ఈత కల్లు తాగుతుంటే

బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతొటి లాగుతుంటే

రెండు జళ్ళు ఎసుకున్న శ్రీదేవి లాగ ఉంటే

రేగిపళ్ళు లాంటి కళ్ళు రారా నా మామ అంటే

ఎర్రాని రైక రంగు ఎండకన్న సుర్రుమంటే

పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే

ముంజికాయలాంటి మూతి ముద్దుగానే తిప్పుతుంటే

మైండులొని మాటలన్ని సెప్పకుండ సెప్పుతుంటే

లిప్పు-స్టిక్కు పెదాల్లో ఇంగిలీషు ముద్దులుంటే

హిప్పు లోన ఒంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే

కళ్ళాపి సోకులన్ని వడకబెట్టి ఒంపుతుంటే

కల్లొకి వచ్చి నన్ను ఉడకబేట్టి సంపుతుంటే

 

సూపర్ మచ్చి ...అడ సూపర్ మచ్చి

సూపర్ మచ్చి ...అడ సూపర్ మచ్చి

 

మొన్న ఊరి సివర ఉన్న సిన్న టూరింగ్ టాకీస్ కాడ

మ్యాటినీ ఆట సూసి వేటింగ్ సేసేత్తువుంటే

డుర్రు డుర్రుమంటు నువ్వు బుల్లెట్ ఏసుకొచ్చి

బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే

గతుకులున్న రొడ్డు మీద బెదరకుండ నడుపుతుంటే

సిటికడంత సిట్టీ నడుము అయ్యొ అయ్యొ అదురుతుంటే..ఎ...

హెయ్...మ్యాట్నీ ఆటకంటే నువ్వే మాస్తుగుంటే

ఐటం పాటకంటే నువ్వే కిక్కు గుంటే

టూరింగ్ టాకిసు మొత్తం నిన్ను చూడ వస్తువుంటే

టినేజు తాత కూడ నిన్ను చూసి ఈల వేస్తే

ప్రాణం లేని నా బూల్లెట్టే కన్నుకొడితే

నాలోని ప్రాణమంత గిల గిల కొట్టేసుకుంటే

 

సూపర్ మచ్చి ...అడ సూపర్ మచ్చి

సూపర్ మచ్చి ...అడ సూపర్ మచ్చి

 

మోన్న సండే సంత కాడ మండే ఎండలోన

బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే

గుండేలొపలోక వన్డే మ్యాచ్ జరిగి

తిండే మాని నేను బెండై పొతూ ఉంటే

సూది మందు గుచ్చకుండ సుర్రుమనిపిస్తుంటే

మత్తుమందు పెట్టకుండ మాయలేవొ చేస్తుంటే

డప్పుకొట్టి నట్టు నువ్వు నడుచుకుంటు వచ్చెస్తే

అప్పుదెచ్చినా రాణి అందమంత నీదైతే

నిన్ను కన్న అమ్మకెమో దండమొకటి పెట్టెస్తే

మైడీయర్ మామ కొక్క పూలదండ వెసేస్తే

రారా నా అల్లుడంటు వాళ్ళు నన్ను పట్టెస్తే

నిన్ను ఇంక మొత్తంగా నాకు అంటగట్టెస్తే

 

సూపర్..సూపర్...సూపర్...సూపర్

సు సు సు సు సు సుపర్ మచ్చి అడ సూపర్ మాచ్చి

సూపర్ మచ్చి ...అడ సూపర్ మచ్చి

 


 

28, అక్టోబర్ 2021, గురువారం

హే..మమ్మీ రిటర్న్స్ హో పాట లిరిక్స్ - Hey Mummy Returns Hoo Telugu Song Lyrics - A Aa (2016) Telugu Songs Lyrics










చిత్రం : అ.ఆ..(2016)

సంగీతం : మిక్కీ జె మేయర్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

గానం : శ్రావణ భార్గవి


 

అఆల్లోనే అం ఆః లా ..

అర్ధరాత్రి మోగే అల్లారంలా

ఆరంభంలో ఇంటర్వెల్లా

ఆనందంలో అంతరాయమా

అమ్మంటేనే ఆటంబాంబా

అయ్యో రామా పేలుతోందా పిల్లా

హెయిరుపిన్నే ముల్లయ్యిందా

చిల్లడిందా చిట్టితలా

జెయింట్ వీలు ఏదో గిర గిర గిర గిర

గుండెలోన సుడి తిరిగిందే

ఉన్నపాటుగా నరనరనరనరమున

తౌజండ్ వాట్స్ పవరేదో పాకిందే

 

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్

యో..మమ్మీ రిటర్న్స్.. ఓ గాడ్ వాట్ టు డు..

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్

యో..మమ్మీ రిటర్న్స్.. పద పద పరుగిడు

 

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్

యో..మమ్మీ రిటర్న్స్.. ఓ గాడ్ వాట్ టు డు..

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్

యో..మమ్మీ రిటర్న్స్.. పద పద పరుగిడు

 

కాలమే కదలదే తరిమినా మొండికేస్తోందే

దూరమూ తరగదే పరుగుతో పందెమేస్తోందే

ఇంతలోనె ఎంత తేడా రైజయ్యిందే గుండెదడ

అమ్మ ఆదిశక్తి నీడా ఆఅ.. భయపెడుతోందే

స్పీడో మీటర్ ముల్లు సర సర సర సర

రేంజు దాటి రెచ్చిపోతోందే

టాపులేచే టెన్షన్ రయ్యి రయ్యి రయ్యిమని

యాక్సిలరేటర్ పైనే ఎక్కి కూర్చుందే

 

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్

యో..మమ్మీ రిటర్న్స్.. ఓ గాడ్ వాట్ టు డు..

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్

యో..మమ్మీ రిటర్న్స్.. పద పద పరుగిడు

 

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్

యో..మమ్మీ రిటర్న్స్.. ఓ గాడ్ వాట్ టు డు..

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్

యో..మమ్మీ రిటర్న్స్.. పద పద పరుగిడు



 

24, జూన్ 2020, బుధవారం

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ పాట లిరిక్స్ - Amma Ani Kothaga Telugu Song Lyrics - Life Is Beautiful (2012) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ (2012)
సాహిత్యం : వనమాలి
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : శ్రావణ భార్గవి, శశి కిరణ్

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ

నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ జోల పాటవై

ఆకలని అడగక ముందే నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా

రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

నీకు పసిపాపలమేగ ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మాజతలోనే ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ కొత్త జన్మ నివ్వడా

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా