8, జనవరి 2022, శనివారం

ఏమిటో ఇది వివరించలేనిది పాట లిరిక్స్ - Emito Idhi Vivarinchalenidhi Song Lyrics in Telugu - Rang De (2021) Telugu Songs Lyrics








చిత్రం : రంగ్ దే (2021)

సంగీతం : దేవీశ్రీప్రసాద్ 

సాహిత్యం : శ్రీమణి  

గానం : కపిల్ కపిలన్, హరిప్రియ


 

ఏమిటో ఇది

వివరించలేనిది

మది ఆగమన్నది

తనువాగనన్నది

భాష లేని ఊసులాట సాగుతున్నది

అందుకే ఈ మౌనమే భాష అయినది

కోరుకోని కోరికేదో తీరుతున్నది

 

ఏమిటో ఇది

వివరించలేనిది

మది ఆగమన్నది

తనువాగనన్నది

 

అలలా నా మనసు తేలుతుందే

వలలా నువు నన్ను అల్లుతుంటే

కలలా చేజారిపోకముందే

శిలలా సమయాన్ని నిలపమందే

నడక మరిచి నీ అడుగు ఒడిన 

నా అడుగు ఆగుతుందే

నడక నేర్చి నీ పెదవి పైన 

నా పెదవి కదులుతుందే

ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ

 

ఏమిటో ఇది

వివరించలేనిది

మది ఆగమన్నది

తనువాగనన్నది

 

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో

కలిపే ఒక కొత్త నిన్ను నాతో

నేనే ఉన్నంత వరకు నీతో

నిన్నే చిరునవ్వు విడువదనుకో

చినుకు పిలుపు విని 

నెమలి పింఛమున రంగులెగసినట్టు

వలపు పిలుపు విని 

చిన్ని మనసు చిందేసే ఆగనంటూ

కోరుకున్న కాలమేదో చేరుతున్నది

 

ఏమిటో ఇది

వివరించలేనిది

మది ఆగమన్నది

తనువాగనన్నది

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి