3, జనవరి 2022, సోమవారం

మల్లీశ్వరివే మధురాశల మంజరివే పాట లిరిక్స్ - Malliswarive Madhuraasala Manjarive Song Lyrics in Telugu - Yuvasena (2004) Telugu Songs Lyrics










చిత్రం : యువసేన (2004)

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : జాస్సీ గిఫ్ట్

గానం : జాస్సీ గిఫ్ట్

 



Watch on watch on watch on

Watch this dup dup dup dup style

I’m gonna dip dip dip it in to your smile

Hold me baby just hold my hand forever and ever

Everytime i want to see you my girl


అ … అ .. అ  … అ  …. 


మల్లీశ్వరివే మధురాశల మంజరివే

మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే

తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా

వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా


చక్కనైన మల్లికవా చిక్కులు పెట్టే అల్లికవా 

పోలికలో పసిబాలికవే చురకత్తుల చూపులున్నా


మల్లీశ్వరివే మధురాశల మంజరివే

మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే


నీ కళ్ళ నింగిలో పున్నాల పొంగులో

వేవేల తారకలే జలకమాడుతున్నవో

నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో


సింగారి చెంపలో కెంజాయి సొంపులో

వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో


నిదరలో ఉదయం ఎదురయే సమయం

ఎదకు ఇంద్రజాలమేదో

చూపుతోందె సోయగమా


Babe don’t ever think i’m ur dhanarajaa 

Come on anytime u’re my dilruba

I can never stop this feel in dhanaraja

Yeah…..yeah….yeah….yeah …yeah


మల్లీశ్వరివే మధురాశల మంజరివే

మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే .. హో 


Baby run your body with this freaky thin

And i won’t let u go and i won’t let u down

Through the fire through the limit

To the wall to just to be with u i’ll gladly risk it all

Ha let me do it one more time do it one more time

Ha baby come on and lets get it into the party


కొల్లేటి సరస్సులో తుళ్ళేటి చేపలై

రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే

నా కొంగ జపము చూసి ఉలికి పడుతు ఉన్నవే


ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా 

ఏ వైపు చూపు తిప్పనీక చంపుతున్నవే

వదలదే హృదయం కదలదే నిమిషం


చిగురు పెదవి చిలిపి స్వరము 

తెలపవె సౌందర్యమా


మల్లీశ్వరివే మధురాశల మంజరివే

మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే

తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా

వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా


చక్కనైన మల్లికవా చిక్కులు పెట్టే అల్లికవా 

పోలికలో పసిబాలికవే చురకత్తుల చూపులున్నా


మల్లీశ్వరివే మధురాశల మంజరివే

మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే .. హో

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి