గీతా మాధురి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గీతా మాధురి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జనవరి 2022, సోమవారం

సానా కష్టం సానా కష్టం పాట లిరిక్స్ - Saana Kashtam Saana Kashtam Vacchindhe Song Lyrics in Telugu - Aacharya (2022) Telugu Songs Lyrics







చిత్రం : ఆచార్య (2022)

సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్ 

సంగీతం : మణిశర్మ 

గానం : రేవంత్, గీతా మాధురి 



కల్లోలం కల్లోలం ఊరూవాడా 

కల్లోలం నేనొస్తే అల్లకల్లోలం 


కల్లోలం కల్లోలం కిందా మీదా 

కల్లోలం నా అందం అల్లకల్లోలం 


నా జడగంటలు ఊగేకొద్దీ 

ఓ అరగంటలో పెరిగే రద్దీ 


ధగధగల వయ్యారాన్ని దాచిపెట్టేదెట్టాగా 

సానా కష్టం సానా కష్టం 


సానా కష్టం వచ్చిందే మందాకినీ

చూసేవాళ్ల కళ్ళు కాకులెత్తుకుపోని  


సానా కష్టం వచ్చిందే మందాకినీ

నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ 


నా కొలతే చూడాలని

ప్రతోడు టైలర్ లా అయిపోతాడే 


ఓ నిజంగా భలే బాగున్నాదే 

నీ మూలంగా ఒక పనిదొరికిందే 


యాడేడో నిమరోచ్చని 

కుర్రాళ్లే ఆర్ఎంపీలవుతున్నారే  

ఏ ఇదేదో కొంచెం తేడాగుందే 

నీ అబద్ధం కూడ అందంగుందే 


ఇల్లు దాటితే ఇబ్బందే ఒంపుసొంపుల్తో 


సానా కష్టం పాపం సానా కష్టం 

సానా కష్టం వచ్చిందే మందాకినీ

అంటించకే అందాల అగరొత్తిని 


సానా కష్టం వచ్చిందే మందాకినీ

నానమ్మతో తీయించేయ్ నరదిష్టినీ 


నా పైట పిన్నీసుని అదేంటో విలన్ లా 

చూస్తుంటారే 


ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే 

మా చెవుల్లో పూలెడుతున్నావే 

డాబాలే ఎక్కేస్తారే పెరట్లో 

మాయమ్మే నలుగెడుతుంటే 

నీ కహాని మాకెందుకు చెప్పు 

మేం వింటున్నాం అని కొట్టకే డప్పు 


గంపగుత్తుగా సోకుల్తో ఎట్టా వేగాలో 


సానా కష్టం అరెరే సానా కష్టం 

సానా కష్టం వచ్చిందే మందాకినీ

పంచాయితీలెట్టొద్దే వద్దొద్దనీ  


సానా కష్టం వచ్చిందే మందాకినీ

అచ్చుబొమ్మ ఆటాడించు యావత్తునీ 

 

26, జూన్ 2020, శుక్రవారం

పుడుతూనే ఉయ్యాల నువ్ పోతే మొయ్యాల పాట లిరిక్స్ - Puduthune Uyyala Telugu Song Lyrics - Neninthe (2008) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి








చిత్రం : నేనింతే (2008)
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : చక్రి
గానం : గీతా మాధురి


పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల
పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల...

ఈలోపే ఏదో చెయ్యాల
ఏలాల ఏలాల... దునియానే ఏలాల...
చకచకచక చెడుగుడు ఆడాల

తూగుంటే వస్తయా
మాపంటే వుంటయా

కొండంత ఆశయా
కూసింత లైఫ్ అయా

ఇరగేసేయ్ తిరగేసేయ్
దున్నేసేయ్ దులిపేసేయ్
అందంగా ఆనందంగా
ఇష్టంగా బతికేసేయ్

ఇరగేసేయ్ తిరగేసేయ్
దున్నేసేయ్ దులిపేసేయ్
అందంగా ఆనందంగా
ఇష్టంగా బతికేసేయ్

పుడుతూనే ఉయ్యాల... ఈలోపే ఏదో చెయ్యాల

అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడొద్దే
ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే

చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే
నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా

నీకై మిగిలివుంది ఇక ఈరోజే
టర్నే లేని దారులూ ట్విస్టే లేని గాథలూ
రిస్కే లేని లైఫులూ బోరు బోరే

నువ్వెంతో ఎత్తుకు ఎదిగినా 
బోల్డంత సంపాదించినా
ఒరే నాన్నా పొంగిపోకురా

గెలుపెవ్వడి సొత్తు కాదురా 
అది నీతో మొదలవ లేదురా
అది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సురా

పుడుతూనే ఉయ్యాల... 
నువ్ పోతే మొయ్యాల... 
ఈలోపే ఏదో చెయ్యాల

నిలుచుంటే బస్ స్టేషన్లో బస్ వస్తాది ఎక్కొచ్చే
పడిపోతే ఫ్రస్టేషన్లో ఏముంటాది ఎక్కేకే

ఇన్నేళ్లూ చేసిన పొరపాట్లూ సక్సెస్‌తో సర్దేయొచ్చులే

పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం
దాన్నే మరచిపోవడం వింతేగా

ఏది ఎంత అవసరం, ఇట్టే తెలుసుకోవటం 
అంతే మోసుకెల్లడం హ్యాపీ గా

నిన్ను బయపెట్టే పనులేమిటో 
అవి చేసేయ్ రోజుకొక్కటి, 
ఇక ఆపై జడుపే రాదు రా

నీ కోరే ఫుల్లై పోయినా, 
కర్మంతా కాలి పోయినా, 
ప్రేమిస్తేనే పని చెయ్యరా

పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల...
ఈలోపే ఏదో చెయ్యాల

ఏలాల ఏలాల... దునియానే ఏలాల...
చకచకచక చెడుగుడు ఆడాల