చిత్రం : రంగ్ దే (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : మంగ్లీ
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
జగమంతా వేడుక మనసంతా వేధన
పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు
ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః
ఎవరికీ చెప్పవే ఎవరినీ అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మెచ్చని కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్నా
బాధ రంగే బతుకులో ఒలికిస్తూ
ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
ఎవరితో పయనమో ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు
కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను
ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి