చిత్రం : కొండవీటిసింహం (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్య, పి.సుశీల
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా
ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం
అ గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలొ ఉదయరాగ సిందూరం
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా
సమశ్రుతిలో జతకలిసి
ప్రియలయలొ అదమరచి
అనురాగాలు పలికించు వేళ
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా
అందమైన మన యిల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు
తెలవారిన సంజెలలొ తేనెనీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలొ కరుగుతున్న కన్నీళ్ళు
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
మమతలనే మధువొలికే
శుభయోగాలు తిలకించు వేళ
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి