సత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, మార్చి 2022, బుధవారం

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ పాట లిరిక్స్ - Sannjaajiki Gunnamaaviki Pelli Kudirindi Song Lyrics in Telugu - Muthyala Pallaki (1976) Telugu Songs Lyrics























చిత్రం: ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యంపి.సుశీల






సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటా మంతీ లేని వేణువు పాట పాడిందీ.. 
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటా మంతీ లేని వేణువు పాట పాడిందీ.. 
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. 
గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. 
హాహహా ఆ ఆ...ఓహో.హోహ్హో...

పూచే వసంతాలు మా కళ్ళలో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో..
పూచే వసంతాలు మా కళ్ళలో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో..
విరికొమ్మా.. చిరు రెమ్మా..
విరికొమ్మ చిరు రెమ్మ
పేరంటానికి రారమ్మా

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటా మంతీ లేని వేణువు పాట పాడిందీ.. 
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...

కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
శ్రీరస్తూ...శుభమస్తూ..
శ్రీరస్తు శుభమస్తు
అని మీరూ మీరు దీవించాలి

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ...
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..






20, ఫిబ్రవరి 2022, ఆదివారం

గలగల పారుతున్న గోదారిలా పాట లిరిక్స్ - Galagala Paaruthunna Godaarila Song Lyrics in Telugu - Gouri (1974) Telugu Songs Lyrics

















చిత్రం : గౌరి (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం







గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 

అందాల పందిరి వేసే ఈ తోటలూ 
ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ
నాగలి పట్టే రైతులూ.. 
కడవలు మోసే కన్నెలూ
బంగరు పంటల సీమలూ.. 
చూడరా..  హే..  
          
గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 

దేశానికాయువు పోసే ఈ పల్లెలూ 
చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం నిలుపుటే 
న్యాయం కోసం పోరుటే
పేదల సేవలు చేయుటే 
జీవితం.. హే.. 

గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 





10, జనవరి 2022, సోమవారం

నేను నా దేశం పవిత్ర భారతదేశం పాట లిరిక్స్ - Nenu Naa Desam Pavitra Bhaaratadesam Song Lyrics in Telugu - Nenu Naa Desam (1973) Telugu Songs Lyrics







చిత్రం : నేను నా దేశం (1973)

సంగీతం : సత్యం

సాహిత్యం : అంకిశ్రీ 

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

 


నేను నా దేశం 

పవిత్ర భారతదేశం

సాటి లేనిది..ధీటు రానిది

శాంతికి నిలయం మన దేశం

 

నేను నా దేశం 

పవిత్ర భారతదేశం

 

అశోకుడేలిన ధర్మ ప్రదేశం

బుద్దుడు వెలసిన శాంతి దేశం

బుద్ధం శరణం గచ్చామి

ధర్మం శరణం గచ్చామి

సంఘం శరణం గచ్చామి

అశోకుడేలిన ధర్మ ప్రదేశం

బుద్దుడు వెలసిన శాంతి దేశం

కులమత భేధం మాపిన త్యాగి

అమర బాపుజీ వెలసిన దేశం

వందేమాతరం వందేమాతరం

వందేమాతరం

కులమత భేధం మాపిన త్యాగి

అమర బాపుజీ వెలసిన దేశం

 

నేను నా దేశం 

పవిత్ర భారతదేశం

 

కదం తొక్కిన వీర శివాజీ

వీర శివాజీ

వీర విహారిణి ఝూన్సీ రాణీ

ఝూన్సీ రాణీ

స్వరాజ్య సమరుడు అల నేతాజీ

జై హింద్...జై హింద్..జై హింద్

స్వరాజ్య సమరుడు అల నేతాజీ

కట్ట బ్రహ్మన్న పుట్టిన దేశం

 

నేను నా దేశం 

పవిత్ర భారతదేశం

 

ఆజాదు ఘోఖలె వల్లభ పటేలు, 

లజపతి, తిలక్, నౌరోజిలు

ఆజాదు ఘోఖలె వల్లభ పటేలు, 

లజపతి, తిలక్, నౌరోజిలు

అంబులు కురిపిన మన అల్లూరి

అంబులు కురిపిన మన అల్లూరి

భగత్ రక్తము చిందిన దేశం

హిందుస్థాన్ హమరా హై

హిందుస్థాన్ హమరా హై

హిందుస్థాన్ హమరా హై

 

నేను నా దేశం 

పవిత్ర భారతదేశం

 

గుండ్ల తుపాకి చూపిన దొరలకు 

గుండె చూపే మన ఆంధ్రకేసరి

మన ఆంధ్ర కేసరీ

శాంతి దూత మన జవహర్ నెహ్రు

శాంతీ...శాంతీ...శాంతీ.. 

శాంతి దూత మన జవహర్ నెహ్రు

లాలబహదూర్ జన్మ దేశం

జై జవాన్..జై కిసాన్

జై జవాన్..జై కిసాన్

 

నేను నా దేశం 

పవిత్ర భారతదేశం

 

అదిగో స్వరాజ్య రధాన సారధి

అదిగో స్వరాజ్య రధాన సారధి

స్వరాజ్య రధాన సారధి

ఆదర్శనారి ఇందిరాగాంధీ 

గరీబి హఠావో... గరీబి హఠావో

ఆదర్శనారి ఇందిరాగాంధీ

అడుగు జాడలో పయనిస్తాం

అఖండ విజయం సాధిస్తాం

అడుగు జాడలో పయనిస్తాం

అఖండ విజయం సాధిస్తాం

 

నేను నా దేశం పవిత్ర భారత దేశం

సాటిలేనిది ధీటు రానిది

శాంతికి నిలయం మన దేశం

నేను నా దేశం నేను నా దేశం 

నేను నా దేశం 

 


 

10, జులై 2021, శనివారం

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. పాట లిరిక్స్ - Snehamera Jeevitham Snehamera Saswatham Song Lyrics in Telugu - Nippulaanti Manishi (1974) Telugu Songs Lyrics

















చిత్రం : నిప్పులాంటి మనిషి (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం











ఆ .. ఆ .. ఆ .. ఆ .. అల్లాయే దిగివచ్చి ...
అల్లాయే దిగివచ్చి... అయ్ మియ ఏమి కావాలంటే
మిద్దెలొద్దు.. మేడలొద్దూ.. పెద్దలెక్కే గద్దెలొద్దంటాను
ఉన్ననాడు.. లేనినాడు.. ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను.. ఒక్క నేస్తం కావాలంటాను

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..
స్నేహమేరా నాకున్నదీ.. స్నేహమేరా పెన్నిధీ.. 
స్నేహమే . . హొయ్
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం...
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

గుండెనే పలికించితే.. 
గుండెనే పలికించితే.. 
కోటి పాటలు పలుకుతాయ్
మమత నే పండించితే 
మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ..
బాధలను ప్రేమించు భాయ్.. 
లేదు అంతకు మించి హాయ్
స్నేహమే . . హొయ్ !

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

కత్తిలా పదునైన చురుకైన మా వాడు 
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
కత్తిలా పదునైన చురుకైన మా వాడు 
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఏమిటొ నీ బాధా ఆఆఅ... 
ఏమిటొ నీ బాధా నాకైన చెప్పు భాయ్
ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి 
ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి
నిండుగ నువ్వు నేడు నవ్వాలి 
అందుకు నెనేమి ఇవ్వాలోయ్..
నిండుగ నువ్వు నేడు నవ్వాలి.. 
అందుకు నెనేమి ఇవ్వాలి..
చుక్కలను కోసుకొని తెమ్మంటావా.. 
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా.... 
దింపమంటావా ఆ చంద్రుణ్ణి .. హా.. 
తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ..
ఏమి చెయ్యాలన్న చేస్తాను.. 
కోరితే ప్రాణమైన ఇస్తాను . .
హ ఏమి చెయ్యాలన్న చేస్తాను.. 
కోరితే ప్రాణమైన ఇస్తాను
దోస్తీకి నజరానా.. దోస్తీకి నజరానా..
చిరునవ్వురా నాన్నా.. 
దొస్తీకి నజరానా.. చిరునవ్వురా నాన్నా. .
ఒక్క నవ్వే చాలు ఒద్దులే వరహాలు.. 
హ హ హ హ

నవ్వెరా.. నవ్వెరా.. మావాడు.. 
ఆహా నవ్వెరా నిండుగా
నవ్వెరా.. మావాడు.. 
ఆహా నవ్వెరా నిండుగా
నవ్వెరా నా ముందు.. 
రంజాను పండుగా

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం 







16, జూన్ 2021, బుధవారం

ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Ye Divilo Virisina Paarijaathamo Telugu Song Lyrics - Kanne Vayasu (1973) Telugu Songs Lyrics







చిత్రం : కన్నెవయసు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..
 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
 
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో 

5, జులై 2020, ఆదివారం

దారి చూపిన దేవతా పాట లిరిక్స్ - Daari Choooina Devatha Telugu Song Lyrics - Gruhapravesham (1988) Telugu Song Lyrics





ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : గృహప్రవేశం (1988)
సాహిత్యం : మైలవరపు గోపి 
సంగీతం : సత్యం 
గానం : కె.జె.ఏసుదాసు


దారి చూపిన దేవతా 
ఈ చేయి ఎన్నడు వీడకా 
దారి చూపిన దేవతా 
ఈ చేయి ఎన్నడు వీడకా 

జన్మ జన్మకు తోడుగా 
నా దానివై నువ్వు నడిచిరా 
దారి చూపిన దేవతా 
ఈ చేయి ఎన్నడు వీడకా

మనసులేని శిలను నేను 
నువ్వు చూసిన నిన్నలో 
మమత తెలిసి మనిషినైతి 
చల్లని నీ చేతిలో 

కన్ను తెరిచిన వేళలో 
నీకేమి సేవలు చేతును 

దారి చూపిన దేవతా 
ఈ చేయి ఎన్నడు వీడకా

మరపు రాదు మాసిపోదు 
నేను చేసిన ద్రోహము 
కలన కూడ మరువనమ్మా 
నువ్వు చూపిన త్యాగము 

ప్రేమ నేర్పిన పెన్నిధి 
ఆ ప్రేమ నిను దీవించని 

దారి చూపిన దేవతా 
ఈ చేయి ఎన్నడు వీడకా 
జన్మ జన్మకు తోడుగా 
నా దానివై నువ్వు నడిచిరా 

దారి చూపిన దేవతా 
ఈ చేయి ఎన్నడు వీడకా