2, ఏప్రిల్ 2021, శుక్రవారం

సరదాగ కాసేపైనా సరిజోడై పాట లిరిక్స్ - Saradaga Kaasepaina Sarijodai Song Lyrics In Telugu - Paagal (2021) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాట చూడండి





చిత్రం : పాగల్ (2021)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : రాథన్
గానం : కార్తీక్,పూర్ణిమ




ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే
ఇవ్వాల ఎవ్వరు పంపారే

ఇన్నేళ్ల చీకటి గుండెల్లో
వర్ణాల వెన్నెల నింపారే

దారిలో పువ్వులై వేచెనే ఆశలు
దండగా చేర్చేనే నేడు నీ చేతులు

గాలిలో దూదులై ఊగెనే ఊహలు
దిండుగా మార్చెనే ఈడ నీ మాటలు

కొత్తగా కొత్తగా పుట్టిన ఇంకోలా
కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా

సరదాగ కాసేపైనా సరిజోడై నీతో ఉన్నా
సరిపోదా నాకీ జన్మకీ

చిరునవ్వై ఓసారైన
చిగురించా లోకంలోన

ఇది చాల్లే ఇపుడి కొమ్మకీ


చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యాన

చిందులేసే సంబరాన్ని ఈరోజునా
కొంచెము దాచుకోక పంచేయాన

కలలోనే సంతోషం కలిగించే ఊపిరి
ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈపరి

తల నిమిరే వేళ్ల కోసం వెర్రోడినై
వానలకై నేలలాగ వేచా మరి

వందేళ్ల జీవితానికి అందాల కానుక
అందించినావు హాయిగా వారలలోనే

చుక్కానిలా నువ్వీక్షణం ముందుండి లాగగా

సంద్రాన్ని దాటినానుగా తీరాలలోనే

చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే
ఆకాశం అంచునే తాకానే నించునే


సరదాగ కాసేపైనా సరిజోడై నీతో ఉన్నా
సరిపోదా నాకీ జన్మకీ

చిరునవ్వై ఓసారైన
చిగురించా లోకంలోన

ఇది చాల్లే ఇపుడి కొమ్మకీ


చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యాన

చిందులేసే సంబరాన్ని ఈరోజునా
కొంచెము దాచుకోక పంచేయాన