చిత్రం : శ్యామ్ సింగ రాయ్ (2021)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : అనురాగ్ కులకర్ణి
ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి
కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి
ధీంతానా ధీంధీంతాన జతులతో
ప్రాణమే నాట్యంచేసే గతులతో
నామశతమ్ముల నతులతో
నాపైన నీ చూపు ఆపేలా…
శరణంటినే జనని నాదవినోదిని భువనపాలినివే
అనాథరక్షణ నీ విధి కాదటే మొర విని చేరవటే
నా ఆలోచనే
నిరంతరం నీకు నివాళినివ్వాలనీ
నాలో ఆవేదనే
నువ్వాదరించేలా నివేదనవ్వాలనీ
దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా
జీవముతో భావముతో సేవలు చేసా
ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా
సతతము నీ స్మరణే…నే
ధీంతానా ధీంధీంతానా జతులతో
ప్రాణమే నాట్యంచేసే గతులతో
నామశతమ్ముల నతులతో
నాపైన నీ చూపు ఆపేలా…
శరణంటినే జనని
నాదవినోదిని భువనపాలినివే
అనాథరక్షణ నీ విధి కాదటే
మొర విని చేరవటే…
ధింతాన ధింతాన తోం
ధింతాన ధింతాన తోం
ధింతాన ధింతాన తోం…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి