23, జనవరి 2022, ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు పాట లిరిక్స్ - Dorukunaa Ituvanti Seva Nee Padha Song Lyrics in Telugu - Sankarabharanam (1980) Telugu Songs Lyrics












చిత్రం : శంకరాభరణం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్   

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం

 


దొరకునా.. దొరకునా.. 

దొరకునా.. ఆఆ.ఆఅ...

దొరకునా ఇటువంటి సేవ

దొరకునా ఇటువంటి సేవ

నీ పద రాజీవముల చేరు 

నిర్వాణ సోపాన మధిరోహణము 

సేయు త్రోవ

 

దొరకునా ఇటువంటి సేవ 

నీ పద రాజీవముల చేరు 

నిర్వాణ సోపాన మధిరోహణము 

సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ 

 

రాగాలనంతాలు నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

రాగాలనంతాలు నీ వేయి రూపాలు

భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

 

నాదాత్మకుడవై నాలోన చెలగి

నా ప్రాణదీపమై నాలోన వెలిగే

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

నాదాత్మకుడవై నాలోన చెలగి

నా ప్రాణదీపమై నాలోన వెలిగే

నిన్ను కొల్చు వేళ దేవాదిదేవా

దేవాదిదేవా.. ఆ.. 

 

దొరకునా ఇటువంటి సేవ 

నీ పద రాజీవముల చేరు 

నిర్వాణ సోపాన మధిరోహణము 

సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ 

 

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు

స్పందించు నవనాడులే వీణాగానాలు

నడలూ ఎదలోని సడులే మృదంగాలు

 

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు

స్పందించు నవనాడులే వీణాగానాలు

నడలూ ఎదలోని సడులే మృదంగాలు

 

నాలోని జీవమై నాకున్న దైవమై

వెలుగొందువేళ మహానుభావా

మహానుభావా... 

 

దొరకునా... సేవ...

నీ పద రాజీవముల చేరు 

నిర్వాణ సోపాన మధిరోహణము 

సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ 

దొరకునా ఇటువంటి సేవ

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి