చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
కలడందురు దీనుల ఎడ
కలడందురు పరమయోగి గణములపాలన్
కలడందురు అన్ని దిశలను
కలడు కలండను వాడు కలడో? లేడో?
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే
రామ హరే శ్రీరామ హరే
రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే
రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే అని
పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
రామ హరే శ్రీరామ హరే
రామ హరే శ్రీరామ హరే
అలనాటి ఆ సీత ఈనాటి దేవత
శతకోటి సీతల కలబోత ఈ దేవత
రామచంద్రుడా కదలిరా రామాబాణమే వదలరా
ఈ ఘోర కలిని మాపరా ఈ కౄర బలిని ఆపరా
నటరాజ శత సహ్రస రవితేజా
నటగాయక వైతాళిక మునిజన భోజా
నటరాజ శత సహ్రస రవితేజా
నటగాయక వైతాళిక మునిజన భోజా
దీనావన భవ్య కళా దివ్య పదాంభోజా
చెరి సగమై రస జగమై చెలరేగిన నీ చెలి ప్రాణము
బలిపశువై యజ్ఞవాటి వెలి బూడిద అయిన క్షణము...
సతీ వియోగము సహించక
దుర్మతియౌ దక్షుని మదమడంచగ
ఢమ ఢమ ఢమ ఢమ డమరుక ధ్వనుల
నమక చమక యమ గమక లయంకర
సకలలోక జర్జరిత భయంకర
వికట సటత్పద విస్ఫు లింగముల
విలయ తాండవము సలిపిన నీవే
శిలవే అయితే పగిలిపో
శివుడే అయితే రగిలిపో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి