23, జనవరి 2022, ఆదివారం

యమహా నగరి కలకత్తా పురి పాట లిరిక్స్ - Yamaha Nagari Kalakatta Puri Song Lyrics in Telugu - Choodalani Undi (1998) Telugu Songs Lyrics











చిత్రం : చూడాలని ఉంది (1998)

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

సంగీతం : మణిశర్మ

గానం : హరిహరన్ 




సరిమామగారి సససనిదపసా

సరిమామగారి సససనిదపసా 

రిమదానిదాప సానిదప మదపమరి 


యమహా నగరి కలకత్తా పురి

యమహా నగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి

యమహా నగరి కలకత్తా పురి


చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది


యమహా నగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి


నేతాజీ పుట్టిన చోట 

గీతాంజలి పూసిన చోట…  పాడనా తెలుగులో

ఆ హంస పాడిన పాటే 

ఆనందుడు చూపిన బాట… సాగనా


పదుగురు పరుగు తీసింది పట్నం

బ్రతుకు తో వెయ్యి పందెం 

కడకు చేరాలి గమ్యం కదలి పోరా


ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు

దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల

గజిబిజి ఉరుకుల పరుకులలో



యమహా నగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి


చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

యమహా నగరి కలకత్తా పురి



బెంగాలీ కోకిల బాల

తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ

రోజంతా సూర్యుడి కింద 

రాంత్రంతా రజనీ గంథ సాగనీ


పద గురూ ప్రేమలే లేని లోకం 

దేవతా మార్కు మైకం

శరన్నవలాభిషేకం తెలుసుకోరా


కథలకు నెలవట కళలకు కొలువట

తిథులకు సెలవట అతిథుల గొడవట

కలకట నగరపు కిటకిటలో


యమహా నగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి


చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

యమహా నగరి కలకత్తా పురి



వందే మాతరమే అన్న 

వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా

మాతంగి కాళీ నిలయా 

చౌరంఘీ రంగుల దునియా నీదిరా


విను గురూ, సత్య జిత్ రే సితారా

ఎస్ డి బర్మన్ కీ థారా

థెరిసా కీ కుమారా కదలి రారా


జనగణమనముల స్వరపద వనముల 

హృదయపు లయలను శృతిపరచిన 

ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులలో


యమహా నగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి

యమహా నగరి కలకత్తా పురి


చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

యమహా నగరి కలకత్తా పురి

నమహో హుగిలీ హౌరా వారధి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి