టిప్పు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టిప్పు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, అక్టోబర్ 2021, మంగళవారం

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ పాట లిరిక్స్ - Nanne Nanne Choosthu Naa Gundello Gucchesthu Song Lyrics in Telugu - Gharshana (2004) Telugu Songs Lyrics
















చిత్రం : ఘర్షణ (2004)

సంగీతం : హ్యారీస్ జయరాజ్

సాహిత్యం : కులశేఖర్

గానం : టిప్పు, షాలిని సింగ్









 

చెలిమను పరిమళం మనసుకి తొలివరం

బతుకున అతిశయం వలపను చినుకులే

ఇరువురి పరిచయం తెలియని పరవశం

తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

 

నన్నే నన్నే చూస్తూ, నా గుండెల్లో గుచ్చేస్తూ

నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే

సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ

ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

 

నీకో నిజమే చెప్పనా....

నీకో నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా

ఎదలో ఏదో తుంటరి థిల్లానా

నాలో ఎదో  అల్లరి, అది నిన్న మొన్న లేనిది

మరి ప్రేమో ఎమో ఒకటే హైరానా... ఆ...హా

వాహువహా.. వాహువహా.. ఏమిటంటారో ఈ మాయనీ

వాహువహా.. వాహువహా.. ఎవరినడగాలో ప్రేమేనా అని

 

నన్నే నన్నే చూస్తూ, నా గుండెల్లో గుచ్చేస్తూ

నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే

సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ

ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

 

ఇదివరకెరగని స్వరములు పలికెను

పగడపు జిలుగుల పెదాల వీణ

బిడియములెరగని గడసరి సొగసుకు

తమకము లెగసెను, నరాలలోన.. హా లోనా..

 

ఏమైందో ఏమిటో, ప్రేమైందో ఏమిటో

నా వాటం మొత్తం ఎంతో మారిందీ...

ఈ మైకం ఏమిటో, ఈ తాపం ఏమిటో

నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ..

ఓఓ...ఓఒ ఓఓ ...

 

నన్నే నన్నే మార్చి, నీ మాటల్తో ఏమార్చి

ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్...

కన్ను కన్ను చేర్చి, నా కల్లోకే నువ్వొచ్చి

ఏకంగా బరిలోకే దించావోయ్...

 

చెలిమను పరిమళం మనసుకి తొలివరం

బతుకున అతిశయం వలపను చినుకులే

ఇరువురి పరిచయం తెలియని పరవశం

తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

 

మనసున అలజడి వలపని తెలిపిన

జిలిబిలి పలుకుల చలాకి మైనా

కలలను నిజముగ ఎదురుగ నిలిపిన

వరముగ దొరికిన వయారి జాణా.. ఆ జాణా

ఈ లోకం కొత్తగా, ఉందయ్యో బొత్తిగా

భూగోళం కూడా నేడే పుట్టిందీ..

నీ వల్లే ఇంతగా, మారాలే వింతగా

నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ..

లాలల్లా లాలల్లాల లాల లాల లాలల్లాల

 

నన్నే నన్నే చూస్తూ, నా గుండెల్లో గుచ్చేస్తూ

నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే

tell me now tell me now, my dear

సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ

ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

 

నీకో నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా

ఎదలో ఏదో తుంటరి థిల్లానా

నాలో ఎదో  అల్లరి, అది నిన్న మొన్న లేనిది

మరి ప్రేమో ఎమో ఒకటే హైరానా... ఆ...హా

వాహువహా... వాహువహా... ఏమిటంటారో ఈ మాయనీ

వాహువహా... వాహువహా... ఎవరినడగాలో ప్రేమేనా అనీ

ప్రేమేనా అనీ... ప్రేమేనా అ... నీ...

ప్రేమేనా అ..నీ...

 


 

29, జులై 2021, గురువారం

సుందరీ జంటతోకల సుందరీ పాట లిరిక్స్ - Sundari Janta Thokala Sundari Song Lyrics in Telugu - Amrutha (2002) Telugu Songs Lyrics





చిత్రం : అమృత (2002)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : సుజాత, శ్రీనివాస మూర్తి,టిప్పు, కార్తీక్, మధుమతి


 

ఆకసాన మేఘమాల ఉరుకు మానునా

అమృతం గూటిలోన అణిగి ఉండునా..

సుందరీ... జంటతోకల సుందరీ..

సుందరీ... జంటతోకల సుందరీ..

హే .. వదరకే పసిదానా... హే

హే అలజడి అలల సుందరీ..

హే హే హే హే

సుందరీ... జంటతోకల సుందరీ..

సుందరీ... జంటతోకల సుందరీ..

హే.. హే.. నల్లనారి నువ్వేనమ్మా..

పంచదార చిలకవమ్మ..

 

ఆకసాన మేఘమాల ఉరుకు మానునా

అమృతం గూటిలోన అణిగి ఉండునా..

 

చిన్న చిన్న తప్పులేమో దినము దినము దొర్లుతాయి

పొంగి వచ్చె కోపాన్ని పూత నవ్వె తుడిచెనమ్మ..

కలత తీర్చే సొట్ట బుగ్గ.. జడలలో మేఘాలే ఊగే

ఆనందపు అంచు ఆమె .. తొలిచేసే బాధ ఆమె

చలిముళ్ళ తెమ్మెర ఆమేలే

అలలు పట్టి తాట చుట్టి కట్టుట సాధ్యమైన పనియా

ఈమెగారి ఆప మనకు ఇక తరమా.. ఆఆఆఅ

 

సుందరీ... జంటతోకల సుందరీ..

హే .. వదరకే పసిదానా... హే

హే అలజడి అలల సుందరీ..

హే హే హే హే ఏహే..

 

పాలపళ్ళ పాలపిట్ట చెక్కిట్లో చిటిక్కున

పాయసాల ముద్దులిస్తే పసిడి కానుకే

చిట్టితల్లి అమ్మలకు కన్నతల్లి ఈమెకాద

మల్లెలాంటి కూతురైన మారుతల్లి ఈమెకాద

బడికి వెళితే విలన్ తెలుసా ..?

మార్కులో హీరోయిన్ తెలుసా.. ?

అడిగేను ప్రశ్నలు వేయి..

తనకు పెద్ద తెలుసు బడాయి

టీచర్ కి ఇంటిలోన పంతులమ్మ..

ఎవడు దీన్ని మనువాడి ఎన్ని పాట్లు పడునో

ఇది చేసుకున్న వాడు రేపు చెంపలేసుకుంటాడు

హో..హో..హో..హో..హో..

 

సుందరీ... జంటతోకల సుందరీ..

సుందరీ... జంటతోకల సుందరీ..

హే .. వదరకే పసిదానా... హే

హే అలజడి అలల సుందరీ..

హే హే హే హే

సుందరీ... జంటతోకల సుందరీ..

సుందరీ... జంటతోకల సుందరీ..

హే.. హే.. నల్లనారి నువ్వేనమ్మా..

పంచదార చిలకవమ్మ..

 


 

19, జులై 2021, సోమవారం

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ పాట లిరిక్స్ - Naakoka Girlfriend Kaavaliraa Song Lyrics in Telugu - Boys (2003) Telugu Songs Lyrics














చిత్రం : బోయ్స్ (2003)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్

గానం : కార్తీక్, డిమ్మి, టిప్పు







 

నేడే నేడే నేడే నేడే కావాలీ..

నేడే కావాలీ..


పదహారు ప్రాయంలో

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

నేటి సరికొత్త జాజి పువ్వల్లె

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

 

వెబ్సైటు కెళ్ళి లవ్ ఫైలు తెరచి

ఇ-మెయిల్ హసుకే కొట్టాలీ

చెమట పడితే వానలో తడిస్తే

ముఖము ముఖముతో తుడవాలి

 

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

గర్ల్ ఫ్రెండ్స్ అంటే బొయ్స్ కి బూస్టే కదా

గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫె వేస్టే కదా

 

గర్ల్ ఫ్రెండ్ కావాలీ

పదహారు ప్రాయంలో

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

నేటి సరికొత్త జాజి పువ్వల్లె

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

 

ఫ్రెండ్ యొక్క కవితను తెచ్చి

నాయొక్క కవిత అని చెప్పి

హౄదయంలో చోటే పట్టంగా

ఫ్లాపైన సినిమాకు వెళ్ళి

కార్నర్ లొ సీటొకటి పట్టి

బబుల్గం చిరుపెదవుల మార్చంగా

సెల్ఫొను బిల్ల్ పెరగ జోకులతో చెవి కొరక

ఎస్ ఎం ఎస్ పంప కావలె గర్ల్ ఫ్రెండు లే..

 

నాతోటి నడిచేటి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

కాలం మరిచేటి కబురులాడేటి

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి

చంద్రుని చెణుకై గదిలో చినుకై

సంపంగి మొలకై ఉండాలీ

ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై

ఇరవై వేళ్ళై ఉండాలి

 

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

గర్ల్ ఫ్రెండ్స్ అంటే బొయ్స్ కి బూస్టే కదా

గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫె వేస్టే కదా

గర్ల్ ఫ్రెండ్ కావలె..

 

బైకెక్కి ఊరంత తిరగ

ఆః అంటే ట్రీట్ ఇచ్చు కొనగ

ఊః అంటే గ్రీటింగ్ కార్డ్ ఇవ్వంగ

హాచ్చ్ అంటే కర్చీఫు ఇచ్చి

ఊం అంటె కుడిబుగ్గ చూపి

టక్ అంటే తలమీద కొట్టంగ

చూస్తే బుల్బ్ వెలగ బార్బిడాల్ వంటి

పోనీ టెయిల్ తోటి కావాలె గర్ల్ ఫ్రెండ్ లే

 

గర్ల్ ఫ్రెండ్స్ అంటే బొయ్స్ కి బూస్టే కదా

గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫె వేస్టే కదా

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

 






24, మే 2021, సోమవారం

పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే పాట లిరిక్స్ - Pacchani Kanulara Okka Pallavi Padarate Song Lyrics in Telugu - Samurai (2004) Telugu Songs Lyrics










చిత్రం : సమురాయ్ (2004)
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : హ్యరీస్ జయరాజ్
గానం : టిప్పు






పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే

పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే

నేలతల్లి ఓడిలో పుట్టి
బతుకు బడిలో హృదయం మరచి

విసిగిపోయిన మనుషుల మనసే
నింగికెగసే గువ్వయి పోతే

మజాలే మజాలే మజాలే ......

పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే

చిత్తడి చినుకుల్లో పూచిన ఎర్రని తామరలా
వేళ్లు మలినమైన పువ్వుల వాసన తరగదులే

ఊడలు దిగుతున్నా మర్రికి నీడలు తరగవులే
నేలన పడివున్నా పువ్వుల అందం తరగదులే

తామరపువ్వుగా మారాలి జల సాఫల్యాన్ని పొందాలి
మానుగానైనా మారలి ప్రతివారికి నీడను ఇవ్వాలి

పువ్వై, కాయయి, ఫలమై
పదిమందికి నే బ్రతుకును పంచాలి

పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
చక్కని నదులార చల్లని జలములనియ్యరటే

ఉప్పు సముద్రంలో మేఘం పుట్టుకువస్తున్నా
ఉప్పుని ఏమాత్రం మేఘం జల్లనే జల్లదుగా

పడమటి కొండల్లో సూర్యుడు మరుగున పడుతున్నా
పున్నమి చంద్రుడికి తానే వెన్నెలనిస్తాడే

మేఘంలాగ మారాలి తీయ తియ్యని నీరే ఇవ్వాలి
సూర్యునిలాగ మారాలి మన వెలుగులు జగతిలో నింపాలి

జననం మరణం అన్నీ మరచి
నే ఓ శిశువుని అవ్వాలి

పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే
(పచ్చని కనులార ఒక్క పల్లవి పాడరటే)

చక్కని నదులార చల్లని జలములనియ్యరటే

నేలతల్లి ఓడిలో పుట్టి
బతుకు బడిలో హృదయం మరచి

విసిగిపోయిన మనుషుల మనసే
నింగికెగసే గువ్వయి పోతే

మజాలే మజాలే