17, జనవరి 2022, సోమవారం

మందార పువ్వల్లె పాట లిరిక్స్ - Mandara Puvvalle Navvuthunte Song Lyrics in Telugu - Bhaari Taaraganam (2021) Telugu Songs Lyrics









చిత్రం : భారీ తారాగణం (2021)

సంగీతం : సుక్కు 

సాహిత్యం : సుక్కు 

గానం : యాజిన్ నిజార్ 


 

మందార పువ్వల్లె 

నవ్వుతుంటే నువ్వు ఆగలేకపోతున్నా

మనసు మబ్బుల్లో తేలి 

ఊగితే ఉయ్యాల ఆపలేకపోతున్నా

వయసు నడిచే నదిలా పడినది నీ వెనక

వలపు కురిసే జడిలా మారినదీ గనుక

ఊ అంటే పిల్లా రాసిస్తా మళ్ళా 

వందేళ్ల నీ కానుక

 

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో

 

ఓ..! ఆకలంటూ లేదుకానీ 

అంతులేని ఆరాటమే ఉంది

నిద్దురంటూ రాదు కాని 

కళ్ళ నిండా నీ కలే ఉంది

ఆకలంటూ లేదు కానీ 

అంతులేని ఆరాటమే ఉంది

నిద్దురంటూ రాదుకాని 

కళ్ళ నిండా నీ కలే ఉంది

యేమారిపోయాను 

నే మారిపోయాను 

నీ కొంటె ఊహల్లో పడి

చేజారి పోయాను 

నే పారిపోయాను 

నీ వైపే నా నుంచి వలువడి

నీ పైన నా ప్రేమ బలపడి

 

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో

 

ఉన్నట్టుండి ఉప్పెనలా 

గుండె ఏంటి ఊపందుకుంది

నిన్ను చూసి చూడగానే 

ఆశ కొత్త రంగేసుకుంది

ఉన్నట్టుండి ఉప్పెనలా 

గుండె ఏంటి ఊపందుకుంది

నిన్ను చూసి చూడగానే 

ఆశ కొత్త రంగేసుకుంది

తెల్లారి చల్లేటి కళ్ళాపిలాగ 

నవ్వుతుంటే నువ్వు అలజడి

సందేళ సూర్యున్ని జాబిల్లిలాగ 

కలిసినావే నువ్వు అమ్మడి

ఏ జన్మలోనో రుణపడి

 

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి