11, జనవరి 2022, మంగళవారం

కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ పాట లిరిక్స్ - Kopam Vasthe Mandutenda Manasu Maatram Vendikonda Song Lyrics in Telugu - Taarakaramudu (1997) Telugu Songs Lyrics









చిత్రం : తారకరాముడు (1997)

సంగీతం : కోటి

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 

 


కోపం వస్తే మండుటెండ

మనసు మాత్రం వెండికొండ

 

కోపం వస్తే మండుటెండ

మనసు మాత్రం వెండికొండ

వానమబ్బు లాంటి వాటం నీదయా

 

నాకు తెలుసా మంచి చెడ్డ

నువ్వు చెబితే నేర్చుకుంటా

నిన్ను నమ్మినాను అంతా నీదయా

 

నీ అల్లర్లు అందం

నీ అలకల్లు అందం

నన్ను కవ్వించి నవ్వించె

నీ నేస్తమె మంచి గంధం 

 

కోపం వస్తే మండుటెండ

మనసు మాత్రం వెండికొండ

వానమబ్బు లాంటి వాటం నీదయా

 

చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా

గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట.

మురికిని కడిగినా మనసుని కడిగినా

రెండు రాళ్ళు చెసెదొకటే పేర్లే వేరట

అవునో కాదో తెలియదు కానీ

నువు చెబుతుంటే అవునంటా

మరి అంతలోనె 

బుంగమూతి సంగతేంటటా

 

నాకు తెలుసా మంచి చెడ్డ

నువు చెబితె నెర్చుకుంటా

నిన్ను నమ్మినాను అంతా నీదయా.. ఆ..

 

నిండు కుండ కాదు కనుక తొణుకుతుందది.

అంత వింత అందులోన ఏమిటున్నది

నాలో తెలివికి దీన్లో నీటికి

పోలికె గుళుకు గుళుకు పలుకుతున్నది.

అమృతం లాంటి హృదయం నీది

అంతకన్న వేరే వరమేది?

అది తెలిసి కూడ కసురుతుంటె

నేరమెవరిది?

 

కోపం వస్తే మండుటెండ

మనసు మాత్రం వెండికొండ

వానమబ్బు లాంటి వాటం నీదయా

 

ఏంటో

నాకు తెలుసా మంచి చెడ్డ

నువు చెబితె నేర్చుకుంటా

నిన్ను నమ్మినాను అంతా నీదయా

 

నీ అల్లర్లు అందం

నీ అలకల్లు అందం

నన్ను కవ్వించి నవ్వించె

నీ నేస్తమె మంచి గంధం

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి