రంజిత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రంజిత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

హేయ్ నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా పాట లిరిక్స్ - Hey Ninne Pelladukuni Raajaipotha Song Lyrics in Telugu - Ready (2008) Telugu Songs Lyrics



















చిత్రం : రెడీ (2008)
సంగీతం : దేవీశ్రీప్రసాద్  
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రంజిత్, కల్పనా 









హేయ్ నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా.. 
అరే నువ్వే నా రాణివని ఫిక్సైపోతా.. 
నువ్వే నా సైన్యమని నీతో వస్తా.. 
మరి దైర్యం ఇంకెందుకనీ ఫీలైపోతా.. 

ఓ జాబిలి కోరె వెన్నల అవుతా.. 
బరువును దించె బంటునవుతా.. 
కౌగిలి కోట నువ్వె నంటా.. 
విడుదల కోరని హయిలొ బందీనైపోతా.. 

కోయి కోయి మిల్గయి మాము.. 
కుచ్ కుచ్ హో గయ మాము.. 
చేయ్ చేయ్ కలిపేద్దాము.. 
దిల్ వాలె దుల్హనియా 
లేజాయెంగె అందామూ..

గంటకోసారి ముద్దివ్వమంట.. 
హద్దు దాటేసి హగ్గివ్వమంటా.. 
సారీ ఈ ఒక్కసారి ఇంకొకసారి అంటు చుట్టు కుంటా.. 
పూటకోమారు పువ్విచ్చుకుంట 
కొంటెగా నిన్ను కవ్విచ్చుకుంట.. 
పూట కోసారి నీకు కోరింది ఇస్తూ వెంట తిప్పుకుంట.. 

ఏందబ్బ ఏందబ్బ ఏందబ్బ గలభా 
పెళ్ళికి ముందరె పిల్లని గిల్లకయ్యా,, 
ఏదోలె పిల్లలు పోనిలె పెద్దయ్య.. 
ఆ వయసింతే చూసి చూడక ఊరుకోవయ్య.. 

కోయి కోయి మిల్గయి మాము.. 
కుచ్ కుచ్ హో గయ మాము.. 
చేయ్ చేయ్ కలిపేద్దాము.. 
దిల్ వాలె దుల్హనియా 
లేజాయెంగె అందామూ..

హేయ్ నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా.. 
అరే నువ్వే నా రాణివని ఫిక్సైపోతా.. 
నువ్వే నా సైన్యమని నీతో వస్తా.. 
మరి దైర్యం ఇంకెందుకనీ ఫీలైపోతా.. 

కంట్లొ ఉత్తుత్తి నలకున్నదంటు 
నీతొ ఉఫ్ అని ఊదించుకుంట.. 
దగ్గరవుతున్న నీకు గమ్మత్తుగా 
ఓ దొంగ ముద్దు పెడతా.. 
ఊరికె నేను పొలమారి పోత 
నువ్వు చూసేట్టు కంగారు పడతా.. 
నీ నాజుకు చెయ్యి నన్నంటుతుంటె 
చిన్న తప్పు చేస్తా.. 

ఏ పిల్ల ఏ పిల్ల తుంటరి గుబులా.. 
దాగుడు మూతల దొంగాట ఎందుకిలా.. 
గారడి కన్నుల కన్నయ లీలా .. 
మెళ్ళో మాలగ మారే దాక ఆగనే లేవా.. 

కోయి కోయి మిల్గయి మాము.. 
కుచ్ కుచ్ హో గయ మాము.. 
చేయ్ చేయ్ కలిపేద్దాము.. 
దిల్ వాలె దుల్హనియా 
లేజాయెంగె అందామూ..

హేయ్ నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా.. 
అరే నువ్వే నా రాణివని ఫిక్సైపోతా.. 
నువ్వే నా సైన్యమని నీతో వస్తా.. 
మరి దైర్యం ఇంకెందుకనీ ఫీలైపోతా.. 




2, ఫిబ్రవరి 2022, బుధవారం

బంగారు కోడిపెట్ట వచ్చెనండి పాట లిరిక్స్ - Bangaaru Kodipetta Vacchenandi Song Lyrics in Telugu - Maghadheera (2009) Telugu Songs Lyrics


















చిత్రం : మగధీర (2009)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : భువనచంద్ర 
గానం : రంజిత్, శివాని




పాపా హ్యాండ్సప్
పాపా హ్యాండ్సప్... హ హ...
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీ లక్
దిక్ దిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్
షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప

ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు
అంతంత ఉన్న ఎత్తులు బోలొ బోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో
పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో

సిగ్గులేని రైక టెక్కు చూస్తా
గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో
కొంగుపట్టి కొల్లగొట్టకు

హే హే అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీలక్ దిక్ దిక్ డోలక్కుతో
రైటో జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో


బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప

ఏంటమ్మా ఏంటమ్మా అందుల్లో
అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో
నా ఈడు నక్కింది బావయ్యో
చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో

చేత చిక్కినావే గిన్నెకోడి
దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా
కాక మీద వున్న దాన్నిరయ్యో
దాక మీద కోపమెందుకు

హే హే అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీ లక్ దిక్ దిక్ డోలక్కుతో
ఓకే జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో


బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీ లక్
దిక్ దిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప 



3, జనవరి 2022, సోమవారం

One way One way జీవితానికి పాట లిరిక్స్ - One way One way Jeevithaaniki Song Lyrics in Telugu - Gamyam (2008) Telugu Songs Lyrics









చిత్రం : గమ్యం (2008)

సంగీతం : ఇ.ఎస్.మూర్తి

సాహిత్యం : ఇ.ఎస్.మూర్తి

గానం : నోయల్, రంజిత్

 


Getup baby getup getup getup get up

baby getup getup getup getup getup

Go go go go Gamyam Go go go go Gamyam

U never know how to love the game

U never know how to worship the game

Until you know to love yourself

Love your soul you'll love yourself common

 

One way One way జీవితానికి

ఎక్కడ ఉందో గమ్యమన్నది

తెలియదు అన్నా ఆగదేమరి

సాగిపొయే ప్రయాణం

 

runway లాంటిది కాదుగా ఇది

ఎన్నో ఎన్నో మలుపులున్నది

ఎగుడు దిగుడు చూసుకోదిది

పరుగు తీసే ప్రవాహం

 

నీ దారిలోన నవ్వు

చిలకరించే మల్లెపువ్వులెన్నో

తీయతీయగానే నిన్ను

గాయపరిచే తేనెటీగలెన్నో

ఎంత వింతని తెలుసుకో ప్రపంచం

అంతుతేలని సృష్టి లో రహస్యం

 

ఎంత వింతని తెలుసుకో ప్రపంచం

It's a wonderful world you got to feel the joy

అంతుతేలని సృష్టి లో రహస్యం

Don't be a fool don't be money's toy

 

One way One way జీవితానికి

ఎక్కడ ఉందో గమ్యమన్నది

తెలియదు అన్నా ఆగదేమరి

సాగిపొయే ప్రయాణం

Freak it..

 

జగమే ఒక మాయ బ్రతుకే ఒక మాయ

అని అన్నది ఎవరో అది విన్నది ఎవరో

మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా

ఒక్క చూపుకై బ్రతికే ఆ మాయలో హాయి లేదా

ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీకి

బదులు ఎవ్వరు చెప్పలేరుగా

అందుకే నేటి రోజే నీది

 

ఎంత చిన్నదో తెలుసుకో జీవితం

అంతకన్న అతి చిన్నది యవ్వనం

ఎంత చిన్నదో తెలుసుకో జీవితం

అంతకన్న అతి చిన్నది యవ్వనం

 

తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు

తను వెళ్ళే చొటే తెలుసా మరి తనకు

నిన్న అన్నదిక రాదు

గతమంటె ఎందుకా మోజు

రేపు అన్న ఆ రోజు

కలలాంటిదే కదా మనకు

ఎన్ని వేల చిరు వేషాలో

కలిపి మనిషి అవతారం

కళ్ళు మూసి తెరిచేలోగా

మారిపోతుంది నాటకరంగం

 

ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం

తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం

తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

 

One way One way జీవితానికి

ఎక్కడ ఉందో గమ్యమన్నది

తెలియదు అన్నా ఆగదేమరి

సాగిపొయే ప్రయాణం

 

నీ దారిలోన నవ్వు చిలకరించే

మల్లెపువ్వులెన్నో

తీయతీయగానే నిన్ను

గాయపరిచే తేనెటీగలెన్నో

 

ఎంత వింతని తెలుసుకో ప్రపంచం

అంతుతేలని సృష్టి లో రహస్యం

ఎంత వింతని తెలుసుకో ప్రపంచం

అంతుతేలని సృష్టి లో రహస్యం

 


మై లవ్ ఈజ్ గాన్ పాట లిరిక్స్ - My Love Is Gone Song Lyrics in Telugu - Arya-2 (2009) Telugu Songs Lyrics










చిత్రం : ఆర్య 2 (2009)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : చంద్రబోస్ 

గానం : రంజిత్ 

 


మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

 

పోయే పోయే లవ్వే పోయే

పోతే పోయిందే

ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

 

పోయే పోయే లడికీ పోయే

పోతే పోయిందే

ఇట్స్ గాన్ ఇట్స్ గాన్

ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

 

వెలుగంతా ఆరిపోయే

కథ మారిపోయే

ఇక చీకటెంత బాగుందే

గెలుపంతా జారిపోయే

నన్ను వీడిపోయే

ఇక ఓటమెంత బాగుందే

 

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

 

ఏ గలాసు పగిలిపోతుందే

గొలుస్సు విరిగిపోతుందే

గులాబి రాలిపోతుందే

లవ్ పోతే పోయిందే

సరస్సు ఎండిపోతుందే

సొగస్సు కరిగిపోతుందే

మనిషి లైఫే పోతుందే

లవ్ పోతే పోయిందే

 

తలనొప్పి పారిపోయే

శ్రమ తీరిపోయే ఇక

శూన్యమెంత బాగుందే

మది నొప్పి ఆరిపోయే

పెదవాగిపోయే ఇక

మౌనమెంత బాగుందే

 

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

 

హానెస్టుగుండే పనిలేదే

ది బెస్టుగుండే పనిలేదే

హాబిట్సు మార్చే పనిలేదే

ఏం మార్చే పనిలేదే

 

కెమిస్ట్రి కలిసే పనిలేదే

కెరియరు మరిచే పనిలేదే

కెరాఫ్ తెలిపే పనిలేదే

కేరింగ్తో పనిలేదే 

ప్రేమించి గెలిచినోళ్ళు

షాది జరిగినోళ్ళు

ఇళ్ళల్లోన మిగులుతారే

లవ్ చేసి ఓడినోడు

లోకాన్నేలుతాడు

హిస్టరీలోన వెలుగుతాడే

 

మై లవ్ ఈజ్ గాన్.

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

మై లవ్ ఈజ్ గాన్

 

 


 

6, ఆగస్టు 2021, శుక్రవారం

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు పాట లిరిక్స్ - Enthavaraku Endukoraku Intha Parugu Ani Adakku Telugu Song Lyrics - Gamyam (2008) Telugu Songs Lyrics





చిత్రం : గమ్యం (2008)

సంగీతం : ఇ.ఎస్.మూర్తి, అనీల్.ఆర్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : రంజిత్


 

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు

ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు

 

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

 

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు

అడగరే ఒక్కొక్క అల పేరు

మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు

పలకరే మనిషి అంటే ఎవరూ

సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది

చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది

నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా

మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా

 

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

 

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై

నీడలు నిజాల సాక్ష్యాలే

శతృవులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే

ఋతువులు నీ భావ చిత్రాలే

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం

మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం

పుట్టక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ

జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ

 

తారరరరే తారరరరే తారరరరే తారారరే

తారరరరే తారరరరే తారరేరా రారరరరే

తారరరరే తారరరరే తారరేరా రారరరరే



 

31, జులై 2021, శనివారం

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా పాట లిరిక్స్ - Chalore Chalore Chal Telugu Song Lyrics - Jalsa (2008) Telugu Songs Lyrics




చిత్రం : జల్సా (2008)

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 

సంగీతం : దేవీశ్రీప్రసాద్

గానం : రంజిత్ 



ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్

ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే ఛల్

ఛలోరే ఛలోరే ఛల్ ఛల్


నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా


ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్

ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే ఛల్

ఛలోరే ఛలోరే ఛల్ ఛల్


చంపనిదే బతకవని బతికేందుకు చంపమని 

నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటని 


ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్

ఛలోరే ఛలోరే ఛల్ ఛల్


సంహారం సహజమని సహవాసం స్వప్నమని

తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవని


ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే ఛల్

ఛలోరే ఛలోరే ఛల్ ఛల్


నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా


ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే

వీరులకి చోరులకి కంటతడి ఒక్కటే


ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే ఛల్

ఛలోరే ఛలోరే ఛల్ ఛల్


అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం

యుగయుగాలుగా యే మృగాల కన్నా 

ఎక్కువ ఏం ఎదిగాం


ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే


రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం

రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం


ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే

 

తారలనే తెంచగలం తలుచుకుంటే మనం

రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం


ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే ఛల్

ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్

చలోరే చలోరే చల్ చల్