చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : కొసరాజు
గానం : మాధవపెద్ది సత్యం
ఓ..ఓ..ఓహో..
ఓ..ఓ..ఓ..ఓ....ఓ..ఓ..
ఏయ్...భళా భళి నా బండీ...
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ... బ్రహ్మకు నోరూరునండి
భళా భళి నా బండీ...
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
ఎహెహెహె... ఎహెహెహె..
తిండి లేనిదే కండ లేదురా...
కండ లేనిదే గుండె రాదురా...
హే తమ్ముడూ
తిండి లేనిదే కండ లేదురా...
కండ లేనిదే గుండె రాదురా
గుండె దిటవుగా నున్నచో...
బ్రహ్మాండములోనే ఎదురు లేదురా...
ఆ.. ఆ.. ఆ..
కరకర ఆకలి మండుతువుంటే...
కమ్మని భోజన మెదురుగవుంటే
కరకర ఆకలి మండుతువుంటే...
కమ్మని భోజన మెదురుగవుంటే
గుటకలు మ్రింగుచు కూర్చొనువాడు...
ఉంటే వాడు వెర్రివాడు
భళా భళి నా బండీ...
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
డ్ర్రు ఊ... ఎహెహెహె..
అట్టురా మినపట్టురా...
దీన్నొదిలి పెట్టేదెట్టురా
తీపి తీపి బొబ్బట్టురా...
అహ తింటే ఆకలి కట్టురా
పప్పుతోటి ఒక ముద్ద కలిపి...
పచ్చడితో అనుపానమేసి..ఓహో..
పప్పుతోటి ఒక ముద్ద కలిపి...
పచ్చడితో అనుపానమేసి
బక్క పేగులకు పట్టిస్తుంటే...
చెప్ప శక్యమా దీని రుచి
భళా భళి నా బండీ...
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
డ్ర్రు ఊ... ఎహెహెహె..
సాటిలేని జగజెట్టి భీముని
చేతుల తీట తీరునులే...
అరి చేతుల తీట తీరునులే
ఏక చక్ర పురావాసుల బెడద
నేటి తోనే పరిమారునులే
తల్లి ఋణమ్మును తీర్చెద
నా ధర్మమ్మును నెరవేర్చెద..
ఓ ఆత్మబంధూ...
ఓ ఆత్మబంధూ...
నీ అండ ఉంటే
ఎవరడ్డమైన పరిమార్చెద
భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ... మాయమైనదండి
భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి