చిత్రం : అశోకవనంలో అర్జున కళ్యాణం (2022)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : జయ్ కృష్ణ
గానం : రామ్ మిర్యాల
మాటరాని మాయవా
మాయజేయు మాటవా
మాటులోని మల్లెవా
మల్లెమాటు ముల్లువా
వయ్యారివా కయ్యారివా సింగారివా
సింగానివా రాయంచవా రాకాసివా
లే మంచులో లావా నీవా
ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
కనుల పులిమావా..?
చిట్టి చిట్టీ చెక్కిళ్ళలో నునుపుని
నుదుటికియలేవా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
ఆ ఆఆ ఆఆ ఆ
పది మంది చూస్తు ఉంటే
అడ్డడ్డే అమాయకంగా
ఒక్కరైనా లేకపోతే
అయ్యయ్యో మరో రకంగా
ఉంటూ నా ఎదనే తింటూ
ఈ కధనే సందేహంలో పడదోయకే
ఏంటో నీ ఇబ్బంది చెప్పెయ్ ఏమౌతుంది
ఎట్టా అట్టా వెళ్ళిపోకే
తిక్కో టెక్కో… చిక్కో చుక్కో
అసలేదో ఒలిచి చెబుతావా
పట్టో బెట్టో… గుట్టో కట్టో
నిజమేదో చెవిన పడనీయ్ వా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నీతోటి స్నేహం సచ్చేటి సావా
బతిమాలడానికైనా ఇదిగో తయారుగున్నా
బదులియ్యి నేటికైనా
బతికియ్ ఏదో విధాన
తాకే ఆ తెరపై దూకే ఓ మెరుపై
నాకై నవ్వే విసిరావే
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే
తప్పో ఒప్పో… గొప్పో ముప్పో
తెలుపక, లొసుగులెడతావా..?
మంచో చెడ్డో… కచ్చో పిచ్చో
తెలియక, నసిగి నడిచేవా..?
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
సంద్రాలనైన ముంచేటి నావా..!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి