6, జనవరి 2022, గురువారం

భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా పాట లిరిక్స్ - Bhaga Bhaga Mande Aa Suryudu Nelaku Song Lyrics in Telugu - Munna (2007) Telugu Songs Lyrics









చిత్రం : మున్నా (2007) 

సాహిత్యం : కందికొండ

సంగీతం : హ్యారీస్ జయరాజ్ 

గానం : శంకర్ మహదేవన్



భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా 

అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా 

చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా 

మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా 


హే... ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే 

నేడే పిడికిల్లో సర్వం బంధిచేసేస్తాడే 

హే... సమరానికి కూడా వీడే...సై సయ్యన్నాడే 

నేడే ఎదురెళ్లి తాడోపేడో తేల్చేస్తాడే 


భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా 

అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా 

చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా 

మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా



వీడే వీడే హోరుగాలై వీచే... 

లేచే లేచే లేచి ఉప్పెనల్లే మారే 

ఉంటే ఉంటే తప్పు ఉండే ఉంటే 

ఎత్తిచూపి సరిచేసి తీరుతాడే 


బాధల్లోనే అండై ఉండి 

ఆశే నింపి సాగిస్తాడే 

ఓడావంటే ధైర్యానిచ్చి 

దారే నీకే చూపిస్తాడే 


భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా 

అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా 

చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా 

మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా హే…. 


లేదే లేదే హద్దు లేనే లేదే... 

చూడే తానే ఒక్క యోధుడల్లే మారే 

దూసే దూసే చురకత్తే దూసే 

దమ్మే చూపి ఇక దుమ్ము లేపుతాడే 


కష్టాలుంటే తోడుంటాడే కన్నీరొస్తే తుడిచేస్తాడే 

ప్రేమే పంచి ప్రేమిస్తాడే నీడై తానే లాలిస్తాడే 


భగభగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా 

అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా 

చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా 

మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా 


హే... ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే 

నేడే పిడికిల్లో సర్వం బంధిచేసేస్తాడే 

హే... సమరానికి కూడా వీడే...సై సయ్యన్నాడే 

నేడే ఎదురెళ్లి తాడోపేడో తేల్చేస్తాడే 

ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి