చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా... చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా... చెలరేగింది ఒక రాసలీలా
ఎదలోని సొదలా... ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా.. కలల వరదలా
ఎదలోని సొదలా.. ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా.. కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా... సిరిసిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా... చెలరేగింది ఒక రాసలీలా
నటరాజ ప్రేయసి... నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి... నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం... కైలాశమే వంగే నీ కోసం
ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం
మెరుపుంది నాలో... అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో... అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో... కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు... ఈ పొంగులే ఏడు రంగులుగా
ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా... చెలరేగింది ఒక రాసలీలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి