ఎస్.పి.చరణ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎస్.పి.చరణ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2022, శనివారం

మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ పాట లిరిక్స్ - Maikam Kaadidi Ninnati Lokam Kaadidi Song Lyrics in Telugu - Yuvakudu (2000) Telugu Songs Lyrics

















చిత్రం : యువకుడు (2000)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఎస్.పి.చరణ్






మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవ్వాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా..హా

తేలుతున్నాను..హే.హే 
నీలి మేఘాలలో..హే.హే
మునుగుతున్నాను 
తొలిప్రేమ భావంలో
మేలుకున్నానో 
కలలోన ఉన్నానో

పాటలా ఉంది..హే.హే 
గాలి ఈలేసినా..హే.హే
ఆటలా ఉంది 
ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది 
ఎటు వైపు చూస్తున్నా

మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవ్వాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా..హా 







2, ఫిబ్రవరి 2022, బుధవారం

ఒక లైలా కోసం తిరిగాను దేశం పాట లిరిక్స్ - Oka Laila Kosam Tirigaanu Desam Song Lyrics in Telugu - Oka Laila Kosam (2014) Telugu Songs Lyrics


















చిత్రం : ఒక లైలా కోసం (2014)
సంగీతం : అనూప్ రూబెన్స్ 
సాహిత్యం : దాసరి నారాయణరావు
గానం : ఎస్.పి.చరణ్, దివ్య 





ఒక లైలా లైలా లైలా 
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ప్రతి రోజు ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం
లైలా లైలా లైలా.. 
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
లైలా లైలా లైలా.. లైలా లైలా లైలా.. 

అకాశానికి నిచ్చెనవేసి 
చుక్కల పట్టుకునడిగాను
లైలా ఏదనీ నా లైలా ఏదనీ
స్వర్గానికి నే దారులు వెతికీ 
ఇంద్రుని పట్టుకునడిగానూ
లైలా ఏదనీ నా లైలా ఏదనీ

అక్కడ ఇక్కడ ఎక్కడనీ 
దిక్కులు వెతుకుతు ఉన్నావూ
లైలా కోసం మజ్నూలా 
ఎందుకు తికమక పడతావూ
ప్రతి చూపూ ప్రతి పిలుపూ
ప్రతి చోటా నీకోసం

ఒక లైలా కోసం తిరిగాను దేశం

పగలూ రేయీ పందెం వేసీ..
సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజ్నూ ఏడనీ.. నా మజ్నూ ఏడనీ
రంభా ఊర్వశి ధైర్యం చేసీ..
స్వర్గం విడిచీ వచ్చారూ
లైలా నేననీ.. ఆ లైలా నేననీ

ఇల్లూ వాకిలి వదిలొస్తే
రంభా ఊర్వశి అంటావూ
నీ కోసం నే పుట్టొస్తే..
ఎవ్వరి వెంటో పడతావూ
ప్రతి రోజు ప్రతి రాత్రీ 
ప్రతి పాటా ఆమెకోసం

ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజు ప్రతి రాత్రీ 
ప్రతి పాటా ఆమెకోసం
లైలా లైలా లైలా.. 
ఒక లైలా లైలా లైలా 
ఒక లైలా లైలా లైలా



అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో పాట లిరిక్స్ - Chamaku Chamaku Chaam Chuttuko Chuttuko Song Lyrics in Telugu - Inttelligent (2018) Telugu Songs Lyrics
















చిత్రం : ఇంటిలిజెంట్ (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్,
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఎస్.పి.చరణ్, హరిణి ఇవటూరి 




చిక్ చిక్ చిక్ చిక్... చిక్ చిక్
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య
ఝణకు ఝణకు చాం పట్టుకో పట్టుకో 

ఝంపె దరువులే వెయ్య 
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం

 
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
హే.. ఝణకు ఝుణకు చాం
పట్టుకో పట్టుకో ఝం
పె దరువులే వెయ్య
 
నాగ స్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
కాగు పొగరుతో రేగిందయ్యా
కోడె పడగ కాటెయ్యా
 
మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో 
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
 
కథ ముదరగ..ఝణకు ఝుణకు చాం
పట్టుకో పట్టుకో 
ఝంపె దరువులే వెయ్య
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య 
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
 
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం

చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
 
అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా 
ఈత ముల్లులా యదలో దిగెరో జాతి వన్నెదీ జాణ
అంతో ఇంతో సాయం చెయ్య చెయ్యందియ్యాలయ్యా
తియ్యని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో 
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో
ఇక రేపోమాపో ఆపే ఊపే హుషారుగా 

పదపదమని..అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
ఝణకు ఝుణకు చాం
పట్టుకో పట్టుకో 
ఝంపె దరువులే వెయ్య
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సాదియ్యా

 
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
హే.. ఝణకు ఝణకు చాం
పట్టుకో పట్టుకో 
ఝంపె దరువులే వెయ్య 



29, జనవరి 2022, శనివారం

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పాట లిరిక్స్ - Egire Mabbulalona Pagale Vennela Vaana Song Lyrics in Telugu - Happy (2006) Telugu Songs Lyrics















చిత్రం : హ్యాపీ (2006)
సంగీతం : యువన్ శంకర్ రాజా 
సాహిత్యం : కులశేఖర్  
గానం : ఎస్.పి.చరణ్ 



ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం
హే...చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం
హో... తెలియకుందే ఆ మాయ
ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

నిదరోయే నీకనులు ఎదలోన ఆ కలలు
ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతొ తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఈన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు
ఇపుడైన ఇకనైన నీ పంతం ఆగేనా
అన్ని మరిచి కోపం విడిచి
నాతో చెలిమి చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కాదా
నీతోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు
నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ
 
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం
హే...చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం
హో... తెలియకుందే ఆ మాయ
ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో




ఏమంటారో నాకు నీకున్న ఇదినీ పాట లిరిక్స్ - Emantaro Naaku Neekunna Idhini Song Lyrics in Telugu - Gudumbaa Shankar (2004) Telugu Songs Lyrics


















చిత్రం : గుడుంబా శంకర్ (2004)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : చంద్రబోస్   
గానం : ఎస్.పి.చరణ్, హరిణి 



ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో.. మారిపోతున్న కథనీ
ఏమంటారో.. జారిపోతున్న మదినీ
చూసె పెదవినీ మాటాడే కనులనీ
నవ్వే నడకనీ కనిపించే శ్వాసనీ
ఇచ్చి పుచ్చుకున్న మనసుని
ఇద అద యద విధ మరి

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపోతున్న కథనీ
ఏమంటారో జారిపోతున్న మదినీ

ఎదురుగ వెలుగుతున్న నీడనీ
బెదురుగ కలుగుతున్న హాయినీ
తనువున తునుకుతున్న చురుకునీ
మనసున ముసురుకున్న చెమటనీ
ఇష్ట కష్టాలని ఏమంటారొ ఇపుడేమంటారో 
ఈ మోహమాటాలని ఏమంటారొ మరి ఎమంటారో 
స్వల్ప భారాలని ఏమంటారో ఇపుడేమంటారో 
సమీప దూరాలని ఏమంటారో అసలేమంటారొ 
జారె నింగిని దొరలాంటీ దొంగనీ 
పాడె కొంగునీ పరిమళించే రంగునీ 
పొంగుతున్న సుధా గంగని 
ఇద అద అదె ఇద మరి 
ఏమంటారో మారిపొతున్న కథనీ 
ఏమంటారో జారిపోతున్న మదినీ 

జాబిలై తలుకుమన్న చుక్కనీ 
బాధ్యతై దొరుకుతున్న హక్కునీ 
హెయ్ హెయ్ 
దేవుడై ఎదుగుతున్న భక్తునీ 
సూత్రమై బిగయనున్న సాక్షినీ 
పాతలొ కొత్తనీ ఇపుడేమంటారో 
పోట్లాటలొ శాంతిని మరి ఏమంటారో 
తప్పులొ ఒప్పునీ ఏమంటారొ ఇపుడేమంటారో 
గత జన్మలొ అప్పుని ఏమంటారొ అసలేమంటారొ 
నాలొ నువ్వుని ఇక నీలొ నేనునీ 
మాకెమేమనీ మన దారె మనదనీ 
రాసుకున్న ఆత్మ చరితనీ
అద ఇద ఇదె అద మరి 

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ 
ఏమంటారో నువు నేనైన అదినీ 
ఏమంటారో మారిపొతున్న కథనీ 
ఏమంటారో జారిపొతున్న మదినీ




19, జులై 2021, సోమవారం

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు పాట లిరిక్స్ - Kailove Chedugudugudu Kanne Udukudu Song Lyrics in Telugu - Sakhi (2000) Telugu Songs Lyrics

















చిత్రం : సఖి (2000)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

రచన : వేటూరి సుందరరామమూర్తి

గానం : నవీన్ , ఎస్.పి.చరణ్

 






కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

 

అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే

నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే

తొలిగా.. పాడే.. ఆ పల్లవి ఔనేలే దరికే వస్తే లేనంటావే

నగిల నగిల నగిల ఓ..ఓ..ఓ బిగువు చాలె నగిలా

ఓహో నగిల నగిల నగిల ఓ..ఓ..ఓ బిగువు చాలె నగిలా

ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడే పెంచే

పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే

 

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

 

నీళ్లోసే ఆటల్లో అమ్మల్లె ఉంటుందోయ్

వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డె అంటుందోయ్

నేనొచ్చి తాకానో ముల్లల్లె పోడిచేనోయ్

తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్


కన్నీరే పన్నీరై ఉందామే రావేమే

నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే

నీ అందం నీ చందం నీకన్నా ఎవరులే

 

నగిల నగిల నగిల ఓ..ఓ..ఓ బిగువు చాలె నగిలా

ఓహో నగిల నగిల నగిల ఓ..ఓ..ఓ బిగువు చాలె నగిలా

ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడే పెంచే

పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే

 

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

 

ఉద్దేశ్యం తెలిశాక ఆయుష్షె పోలేదు

సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు

నా గాధ ఏదైనా ఊరించె నీ తోడు

ఎంతైనా నా మోహం నీరమ్మ ఏనాడు

కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే

చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే

నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా

 

నగిల నగిల నగిల ఓ..ఓ..ఓ బిగువు చాలె నగిలా

ఓహో నగిల నగిల నగిల ఓ..ఓ..ఓ బిగువు చాలె నగిలా

ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడే పెంచే

పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే

 

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు







6, జూన్ 2020, శనివారం

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా పాట లిరిక్స్ - Oke Okkasari Nennuanantu Raava Song Lyrics in Telugu - Vidyardhi (2004) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి



సీనియర్ నిర్మాత ఆర్.బి చౌదరి గారి అబ్బాయి రమేష్ 
తెలుగులో పరిచయమై నటించిన మొదటి చిత్రం ఈ ' విద్యార్ధి ' సినిమా, 
ఇందులో ఎస్పీ చరణ్ గారు పాడిన ఒకే ఒక్కసారి పాట ఆరోజుల్లో నేను చాల సార్లు విన్న పాటల్లో ఒకటి , 
మణిశర్మ గారి సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది,
చాలా ఫీల్ తో ఉండే ఈ పాట సాహిత్యం  మీకోసం.









చిత్రం : విద్యార్థి (2004)
సాహిత్యం : ఎల్.నవీన్
సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి.చరణ్








ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా ...
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ...

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా ...
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ...

ఏమయినా నిజంగా నువ్వు నా శ్వాసనీ ..
నా ఆశ చూస్తుందే నువ్వు వస్తావని ..

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా ...
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ...


పగలు రేయి నీ ధ్యాసే ఉంటు
ఏమి తోచక ఉన్నది
పదే పదే నీ మాటలు వింటు
పరవశించాలనున్నది

పగలు రేయి నీ ధ్యాసే ఉంటు
ఏమి తోచక ఉన్నది
పదే పదే నీ మాటలు వింటు
పరవశించాలనున్నది

ఓ హృదయమా పలకరించుమా
మెరుపల్లే రాక తెలుపుమా 

నీ స్నేహమే అందించుమా
ఒక చూపుతో ఓదార్చుమా
తెలుసుకో నేస్తమా నాలోన ఉన్న స్వరమా ...

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా ...
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ...

ప్రతిక్షణం మది పద పదమంటు
నీ వెంట వస్తున్నది

ప్రతిదినం నువ్వు నేనే అంటు
నీ నీడ నాతో అంటున్నది

ప్రతిక్షణం మది పద పదమంటు
నీ వెంట వస్తున్నది

ప్రతిదినం నువ్వు నేనే అంటు
నీ నీడ నాతో అంటున్నది

ఓ మౌనమా మాటాడుమా
ఒక ఊసుతో శాసించుమా
ఏదలోని రూపమే సుమ
నీలువెల్లా చీల్చి చూడుమా

చేరుకో ప్రాణమ నువ్వు లేక
నేనుండతరమా

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా ...
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ...

ఏమయినా నిజంగా నువ్వు నా శ్వాసనీ
నా ఆశ చూస్తుందే నువ్వు వస్తావని

ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా ...
నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ...