చిత్రం: ఆత్మగౌరవం (1966)
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
గానం: పి.సుశీల, వసంత
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
పట్నాలలో ఉండు పెదబాబుగారు
పల్లెసీమకు నేడు వేంచేసినారు
కొండంత దేవుణ్ని కొలిచేది ఎలాగో
తెలియక మేమంత తికమక పడ్డాము
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
చరణం 1:
ముద్దపప్పే కలుపుకోండి
కొత్త ఆవకాయే నంచుకోండి
అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ...
అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ
మచ్చు చూశారంటే మళ్ళీ తెమ్మంటారు
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
చరణం 2:
బూరెలే వడ్డించ మంటారా... నేతిగారెలే వేయించుకుంటారా
బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే...
బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే
వైకుంఠమే వచ్చి వాకిట్లో దిగుతుంది
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
చరణం 3:
ఉన్నంతలో సేవలొనరించినాము
చిన్నారి మనసులే అర్పించినాము....
మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి...
మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి...
మీ చూపు నీడలో మేము జీవించాలి...
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి