23, జనవరి 2022, ఆదివారం

ఆ చింత నీకేలరా స్వామీ నీ చెంత నేనుండగా పాట లిరిక్స్ - Aa Chintha Neekelara Swamee Nee Chentha Nenundagaa Song Lyrics in Telugu - Subhodayam (1980) Telugu Songs Lyrics











చిత్రం : శుభోదయం (1980)

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి.సుశీల

 


మందార మకరంద మాధుర్యమునదేలు

మధుపంబు పోవునే మదనములకు

నిర్మల మందాకినీ వీచికల తూగు

రాయంచ చనునే తరంగిణులకూ...

 

ప్చ్.. అదిగాదు వాడక్కడ చేరి మొత్తం..

 

ఆ .. ఆ చింత నీకేలరా

ఆ చింత నీకేలరా

ఆ చింత నీకేలరా

స్వామీ నీ చెంత నేనుండగా

ఆ చింత నీకేలరా

 

సొంతమైన ఈ సొగసులేలక ..

పంతమేల పూబంతి వేడగ

సొంతమైన ఈ సొగసులేలక ..

పంతమేల పూబంతి వేడగ

ఆ చింత నీకేలరాఆఆ...

 

సరసాల మనుగడ సగపాలు చేసీ

వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ

సరసాల మనుగడ సగపాలు చేసీ

వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ

అరుదైన మురిపాల పెరుగు మీగడలన్ని

కరిగించి కౌగిళ్ళ తినిపించగా

 

ఆ .. ఆ చింత నీకేలరా

నీ చెంత నేనుండగా

ఆ చింత నీకేలరా

 

ఆవంక ఆ వెన్నెలమ్మ..

ఈ వంక ఈ వన్నెలమ్మా

ఆవంక ఆ వెన్నెలమ్మా..

ఈ వంక ఈ వన్నెలమ్మా

ఏ వంక లేని నెలవంక నేనమ్మ..

నీకింక అలకెందుకమ్మా !

 

చ్చ్.. చ్చ్.. చ్చ్.... అయ్యో !

లలిత రసాల పల్లవకారియైచొక్కు

కోయిల చేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరమరుగునే

సాంద్ర నిహారములకు..

వినుత గుణశీల మాటలు వేయునేలాఆఆ...

 

..ఆ చింత నీకేలరా

స్వామీ నీ చెంత నేనుండగా

ఆ చింత నీకేలరా


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి