12, జనవరి 2022, బుధవారం

వే వేల గోపెమ్మల మువ్వగోపాలుడే పాట లిరిక్స్ - Ve Vela Gopemmala Muvvagopalude Song Lyrics in Telugu - Saagara Sangamam (1982) Telugu Songs Lyrics










చిత్రం : సాగర సంగమం (1982)

సంగీతం :  ఇళయరాజా

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం :  యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.పి.శైలజ

 


 

వే వేల గోపెమ్మల మువ్వగోపాలుడే.. మా ముద్దు గోవిందుడే

మువ్వగోపాలుడే... మా ముద్దు గోవిందుడే

అహ..అన్నుల మిన్నల కన్నుల వెన్నెల

వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే

 

 

అహహ వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే..

మా ముద్దు గోవిందుడే

 

మన్ను తిన్న చిన్నవాడే... 

మిన్ను కన్న వన్నెకాడె..

మన్ను తిన్న చిన్నవాడే... మిన్ను కన్న వన్నెకాడె..

 


కన్న తోడు లేనివాడే.... కన్నె తోడు వున్నవాడే

మోహనాల వేణువూదే... మోహనాంగుడితడేనే

మోహనాల వేణువూదే... మోహనాంగుడితడేనే ..

 


చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే

పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే...

మా మువ్వగోపాలుడే... మా ముద్దు గోవిందుడే

 


ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే...

మా ముద్దు గోవిందుడే...

 


వేయి పేరులున్నవాడే... 

వేల తీరులున్నవాడే..ఏ...

వేయి పేరులున్నవాడే... వేల తీరులున్నవాడే ...


రాస లీలలాడినాడే... రాయబారమేగినాడే ...

గీతార్థ సారమిచ్చి ...గీతలెన్నో మార్చేనే

గీతార్థ సారమిచ్చి ...గీతలెన్నో మార్చేనే


నీలమై.. నిఖిలమై... కాలమై... నిలిచాడే

వరదయ్య గానాల.. వరదలై పొంగాడే...

మా మువ్వగోపాలుడే...మా ముద్దు గోవిందుడే

 

ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే..

మా ముద్దు గోవిందుడే...

 

అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల...వేణువులూదాడే ...

మది వెన్నెలు దోచాడే...


అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల.. వేణువులూదాడే ...

మది వెన్నెలు దోచాడే

 

ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే ...


మా ముద్దు గోవిందుడే...

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి