17, జనవరి 2022, సోమవారం

ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంతా హాయి నింపుకో పాట లిరిక్స్ - Preminchi Pelli Chesuko Nee Manasantha Haayi Nimpuko Song Lyrics in Telugu - Athma Gouravam (1966) Telugu Songs Lyrics










చిత్రం : ఆత్మగౌరవం (1966)

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

సాహిత్యం :

గానం : ఘంటసాల

 



ఓ సోదరసోదరీమణులారా...

ఆదరించి నా మాట వింటారా...

వింటాం చెప్పు..

 

ప్రేమించి పెళ్ళి చేసుకో...

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...

 

ప్రేమించి పెళ్ళి చేసుకో...

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...

 

వరుని వలపేమిటో వధువు తలపేమిటో

తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా...

వరుని వలపేమిటో వధువు తలపేమిటో

తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా...

తెలిసి కట్నాలకై బతుకు బలి చేసినా

కడకు మిగిలేది ఎడమోము పెడమోములే....

 

ప్రేమించి పెళ్ళి చేసుకో...

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...

 

మనిషి తెలియాలిలే... మనసు కలవాలిలే

మరచిపోలేని స్నేహాన కరగాలిలే....

మనిషి తెలియాలిలే... మనసు కలవాలిలే

మరచిపోలేని స్నేహాన కరగాలిలే.

మధురప్రణయాలు మనువుగా మారాలిలే....

మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే....

 

ప్రేమించి పెళ్ళి చేసుకో...

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...

 

నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని

వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని...

నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని

వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని.....

తొలుత మనసిచ్చి మనువాడె దుష్యంతుడు....

పాత ఒరవళ్ళు దిద్దాలి మీరందరూ...

 

ప్రేమించి పెళ్ళి చేసుకో...

నీ మనసంతా హాయి నింపుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి