కె.జె.ఏసుదాసు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కె.జె.ఏసుదాసు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2022, మంగళవారం

ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే పాట లిరిక్స్ - Priye Charuseele Priye Charuseele Song Lyrics in Telugu - Megha Sandesam (1984) Telugu Songs Lyrics



























చిత్రం : మేఘసందేశం (1984)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : జయదేవుడు, పాలగుమ్మి పద్మరాజు
గానం : కె.జె.ఏసుదాసుపి.సుశీల 
 







ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
ముంచ మయి మానం అనిదానం ।
ప్రియే! చారు శీలే!
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానమ్‌॥


ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
 
 వదసి యది కించిదపి దంత రుచి కౌముదీ
హరతి దర తిమిరమతిఘోరం ।
పలికితే చాలు నీ పలువరుస వెన్నెలలు
కలికి నా ఎడద చీకటుల పో ద్రోలు
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
రోచయతు లోచన చకోరమ్‌ ॥
నీ మోము జాబిల్లి మోవి తేనియలు
నా నయనమ్ములు చకోరమ్ములై గ్రోలు

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!

నా పైని అలకేమి ఓ కామినీ 
నా పైని అలకేమి ఓ కామినీ
నా మేన నఖ ముద్ర కెంపులే వెలుగనీ
కౌగిలిని నలుగని పలుగాట్ల సిలుగనీ
కౌగిలిని నలుగని పలుగాట్ల సిలుగనీ
గాఢంపు సుఖము నా కటులైన కలుగనీ
ఓ... కామినీ... 

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
ముంచ మయి మానం అనిదానం ।
ప్రియే! చారు శీలే!
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానమ్‌॥

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!








3, మార్చి 2022, గురువారం

అభినందన మందార మాల పాట లిరిక్స్ - Abhinandana Mandara Maala Song Lyrics in Telugu - Taandra Paparaayudu (1986) Telugu Songs Lyrics




















చిత్రం : తాండ్ర పాపారాయుడు (1986)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : కె.జె.ఏసుదాసుపి.సుశీల




అభినందన మందార మాల..
అభినందన మందార మాల..
అభినందన మందార మాల.. 
అధినాయక స్వాగత వేళ..ఆ..
అభినందన మందార మాల..

స్త్రీజాతికీ.. ఏనాటికీ.. స్మరణీయ 
మహనీయ వీరాగ్రణికి..
అభినందన మందారమాల.. 
అధినాయక స్వాగత వేళ..ఆ..

వేయి వేణువులు నిన్నే పిలువగ.. 
నీ పిలుపు నావైపు పయనించెనా
వేయి వేణువులు నిన్నే పిలువగ.. 
నీ పిలుపు నావైపు పయనించెనా

వెన్నెల కన్నెలు నిన్నే చూడగ..
వెన్నెల కన్నెలు నిన్నే చూడగ.. 
నీ చూపు నారూపు వరియించెనా
నీ చూపు నారూపు వరియించెనా..

నా గుండె పై నీవుండగా.. 
దివి తానే భువిపైనే దిగివచ్చెనా
అభినందన మందారమాల.. 
అలివేణి స్వాగత వేళ..ఆ..
అభినందన మందారమాల..

సౌందర్యమూ సౌశీల్యమూ.. 
నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల..

వెండి కొండపై వెలసిన దేవర.. 
నెలవంక మెరిసింది నీ కరుణలో
వెండి కొండపై వెలసిన దేవర.. 
నెలవంక మెరిసింది నీ కరుణలో
 
సగము మేనిలో ఒదిగిన దేవత..
సగము మేనిలో ఒదిగిన దేవత.. 
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో..
ప్రియ భావమే లయ రూపమై.. 
అలలెత్తి ఆడింది అణువణువులో

అభినందన మందారమాల.. 
ఉభయాత్మల సంగమవేళ..ఆ..
అభినందన మందారమాల..








22, ఫిబ్రవరి 2022, మంగళవారం

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా పాట లిరిక్స్ - Vennelaina Cheekataina Cheruvaina Dooramaina Song Lyrics in Telugu - Pacchani Kaapuram (1985) Telugu Songs Lyrics


















చిత్రం : పచ్చని కాపురం (1985)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : కె.జె.ఏసుదాసు, యస్.జానకి






ఆ..ఆ..ఆ..
వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము

జ్ఞాపకమేదో.. నీడల్లె తారాడే..
స్వప్నాలేవో.. నీ కళ్ళ దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు..
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వమూ.. నాదైనదీ..
నేను దేహమల్లె.. నీవు ప్రాణమల్లె
ఏకమైన రాసలీలలోనా..

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

అంతంలేనీ.. నీ రాగ బంధంలో..
అంచున నిలిచీ.. నీ వైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూలడోలలు..
ఎన్నడింక చెప్పవమ్మ బాలసారలు
ఆ ముద్దులే.. మూడైనవీ..
బాలచంద్రుడొస్తే.. నూలుపోగులిస్తా..
ఇంటి దీపమయ్యేదింకా ప్రేమా

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు.. 





29, జనవరి 2022, శనివారం

కృష్ణకృపా సాగరం వేణు సుధాసేవనం పాట లిరిక్స్ - KrishnaKrupa Saagaram Venu Sudhasevanam Song Lyrics in Telugu - Sarigamalu (1994) Telugu Songs Lyrics

















చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బోంబే రవి 
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : కె.జె.ఏసుదాసు, చిత్ర
 





కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం
జయదేవ కృతం జననార్ధిహరం
జగదేక మతం జనమోక్షకరం.
కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం

మునిజన వందిత ముఖ చిత సోమం
పశుపరివేష్టిత గిరిధర నామం
యమునా తీరం సుమన కుటీరం
నారీ నారీ నడుమ విహారం
అనంతమనేకం అఖిలాధారం 
అకాలమశోకం జగదోద్ధారం
వందే మధుసూధనం

కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం

గమప పదని సరిసని సనిదప 
గమప పదని గరిసనిసా 

రాధా హృదయం రసమధునిలయం 
వాలే సమయం హరిరితి మధుపం 
అధరం శోణం మనసిజ వాణం 
మధురం మౌనం మమతల గానం
స్వరస ప్రయాణం సాప్తపదీనం
ఆఆఆఅ....ఆఆఆఆఆ...

అమలమనూనం 
ప్రణయాదీనం 
వందే నవమోహనం

కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం
జయదేవ కృతం జననార్ధిహరం
జగదేక మతం జనమోక్షకరం.
కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం

9, జనవరి 2022, ఆదివారం

అచ్చ తెనుగులా పదారణాల పాట లిరిక్స్ - Accha Tenugulaa Padahaaranala Song Lyrics in Telugu - Postman (2000) Telugu Songs Lyrics










చిత్రం : పోస్ట్ మాన్ (2000)

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ 

సాహిత్యం : ఘంటాడి కృష్ణ 

గానం : కె.జె.ఏసుదాసు, సుజాత మోహన్

 


అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

సాయంత్ర సంధ్య వేళ నీవే

నా ప్రేమ ముగ్గులోకి రావే

ఆనతివ్వగా నా మోహనా 

నీ హారతవ్వనా ప్రియా

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

 

ఆ ఛైత్ర మాసాలే మన ప్రేమ సాక్ష్యాలై

విడరాని బంధమై పోగా

నా తోడు నీడల్లే నా కంటి పాపల్లే

గుండెల్లో నిన్ను దాచుకోనా

నిన్నే చేరుకోనా ఒడిలొ వాలి పోనా

నా శ్వాసలో నిశ్వాస నీవై

నా జీవితాన ఆశ నీవై 

నా చేయినందుకో రావా

 

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

ఆనతివ్వగా నా మోహనా

నీ హారతవ్వనా ప్రియా

 

కార్తీక వెన్నెల్లో ఎకాంత వేళల్లో

నీడల్లె నిన్ను చేరుకోన

నీ రూపే కళ్ళల్లొ కదలాడె వేళల్లొ

నీ చంటి పాపనై పోన

జగమె మురిసిపోదా ఒకటై కలసి పోగా

ఆకాశమే అక్షింతలేయ

భూమాతయే దీవించ రాగా

ఆ మూడు ముళ్ళు వేసేనా

 

ఆనతివ్వగా నా మోహనా

నీ హారతవ్వనా ప్రియా

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

సాయంత్ర సంధ్య వేళ నీవే

నా ప్రేమ ముగ్గులోకి రావే

 

ఆనతివ్వగా నా మోహనా

నీ హారతవ్వనా ప్రియా

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

 


 

30, డిసెంబర్ 2021, గురువారం

మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న పాట లిరిక్స్ - Maanavaseva Drohama Kala Seva Song Lyrics in Telugu - Rudraveena (1988) Telugu Songs Lyrics









చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : కె.జె.ఏసుదాసు

 

 

ఆ.. ఆ.. ఆ.. ఆ..

పంజనదీశ పాహిమాం భవానీశ సర్వేశ

పంజనదీశ పాహిమాం భవానీశ సర్వేశ

పంజనదీశ పాహిమాం భవానీశ సర్వేశ

పంజనదీశ పాహిమాం భవానీశ సర్వేశ

పంజనదీశ పాహిమాం... ఆ... ఆ... ఆ...

 

 

మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న

మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న

మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న

మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న

మానవ సేవ ద్రోహమా... ఆ... ఆ... ఆ...  

 

 

కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా

కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా

కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా

కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా

 

 

మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న

మానవ సేవ ద్రోహమా ఆ.. ఆ.. ఆ..

 

 

గీష్మ తాటితవనాల సంతాపము కని గలిగి

గీష్మ తాటితవనాల సంతాపము కని గలిగి

జీవ ధారచిలుకు కార్యదీక్ష హేయమరచి

కాలమే కాల జలాలను లవణాబ్ది వివరించ

ఏముంది ఫలము దయలేని గుండె వృధా కాదా

కాలమే కాల జలాలను లవణాబ్ది వివరించ

ఏముంది ఫలము దయలేని గుండె వృధా కాదని

 

 

మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న

మానవ సేవ ద్రోహమా ఆ.. ఆ.. ఆ.. ఆ..

 


 

8, డిసెంబర్ 2021, బుధవారం

లలిత ప్రియ కమలం విరిసినది పాట లిరిక్స్ - Lalitha Priya Kamalam Virisinadhi Song Lyrics in Telugu - Rudraveena (1988) Telugu Songs Lyrics









చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : కె.జె.ఏసుదాసు, చిత్ర


 

లలిత ప్రియ కమలం విరిసినది

లలిత ప్రియ కమలం విరిసినది 

కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ...

ఉదయ రవి కిరణం మెరిసినది 

ఊహల జగతిని.. ఆఆఆ..ఆఆఅ..

ఉదయ రవి కిరణం మెరిసినది 

అమృత కలశముగ ప్రతి నిమిషం

అమృత కలశముగ ప్రతి నిమిషం

కలిమికి దొరకని..

చెలిమిని కురిసిన అరుదగు వరమిది

లలిత ప్రియ కమలం విరిసినది

 

రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం

కాదా నీలో నాలో పొంగే ప్రణయం

నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం

కాదా మన స్నేహం ముడివేసే పరువం

కలల విరుల వనం మన హృదయం

కలల విరుల వనం మన హృదయం

వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం

కోటి తలపుల చివురులు తొడిగెను

తేటి స్వరముల మధువులు చిలికెను

తీపి పలుకుల చిలుకల కిలకిల

తీగ సొగసుల తొణికిన మిలమిల

పాడుతున్నది ఎద మురళి

రాగ ఝరి తరగల మృదురవళి

తూగుతున్నది మరులవని

లేత విరి కులుకుల నటనగని

వేల మధుమాసముల 

పూల దరహాసముల మనసులు మురిసెను

 

లలిత ప్రియ కమలం విరిసినది 

కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ...

ఉదయ రవి కిరణం మెరిసినది 

 

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ

కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం

తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం

కాదా మమకారం నీ పూజాకుసుమం

మనసు హిమగిరిగ మారినది

మనసు హిమగిరిగ మారినది

కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ

మేని మలుపుల చెలువపు గమనము

వీణ పలికిన జిలిబిలి గమకము

కాలి మువ్వగ నిలిచెను కాలము

పూల పవనము వేసెను తాళము

గేయమైనది తొలి ప్రాయం

వ్రాయమని మాయని మధుకావ్యం

స్వాగతించెను ప్రేమ పథం

సాగినది ఇరువురి బ్రతుకు రథం

కోరికల తారకల సీమలకు చేరుకొనె

వడివడి పరువిడి

 

ఉదయ రవి కిరణం మెరిసినది 

ఊహల జగతిని.. ఆఆఆ..ఆఆఅ..

లలిత ప్రియ కమలం విరిసినది 

కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ..

లలిత ప్రియ కమలం విరిసినదీ...

 

 


 

30, అక్టోబర్ 2021, శనివారం

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి పాట లిరిక్స్ - Neethone Aagenaa Sangeetham Bilahari Telugu Song Lyrics - Rudraveena (1988) Telugu Songs Lyrics









చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం : ఇళయరాజా 

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : కె.జె.ఏసుదాసు 



 

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి

నీతోనే ఆగేనా సంగీతం

 

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి

నీతోనే ఆగేనా సంగీతం

 బిళహరీ అని పిలువకుంటే

స్వరవిలాసం మార్చుకుంటే

ఆరిపోదు గానజ్యోతినీతోనే ఆగేనా సంగీతం

 

సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన

సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన

యుగయుగాలుగా జగాన దారి చూపగ

అనంతమైన కాంతి ధారపోసిన

అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం

అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం

 

నీతోనే ఆగేనా సంగీతం 

  

విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది

తరంగ స్వరాల జనించు గీతం ఏది

విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది

తరంగ స్వరాల జనించు గీతం ఏది

గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది

ఏ జ్ఞానం ఆ నాదం

పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ

పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ

అహంకరించి సాగుతున్న వేళలో

ఎడారిపాలు కాదా గానవాహిని

వినమ్రతే త్యజించితే - విషాదమే ఫలం కదా

 

నీతోనే ఆగేనా సంగీతం 

 

మగపద నీ..తోనే 

సరీగ రిగాప గపాద నీ...తోనే

సరిగ రిగప మగపద మగ రిగప

గపద మగపదదరి నీ...తోనే

పాదమ గపద రిస రీగరి సనిదప ద 

దాసరిగ పాగసరి గాపదస రీగసరి  సరిగపదరి నీతోనే

సరిగ పమగ  రిగపమగరి సాస సాస రీరి రీరి

సని ద సని ద పమ గ పమ గ

రిగమప గరి సనిదప ద రిగరి సనిదప

మగపద గసనిదప దని సనిద

సరిగపద రిగపద దరి

నీతోనే ఆగేనా సంగీతం

బిలహరి అని పిలవకుంటే 

స్వర విలాసం మార్చుకుంటే

ఆరిపోదు గాన జ్యోతి

నీతోనే ఆగేనా సంగీతం