15, జనవరి 2022, శనివారం

హే ఇది నిజమేనా పాట లిరిక్స్ - Hey Idi Nijamena Song Lyrics in Telugu - Solo Bathuke So Better (2020) Telugu Songs Lyrics
చిత్రం : సోలో బ్రతుకే సో బెటర్ (2020)

సంగీతం : ఎస్.ఎస్.థమన్

సాహిత్యం : రఘురామ్ 

గానం : సిద్ శ్రీరామ్  

 


ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్

ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్

గుండెల్లో మొదలయ్యిందే…

ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్

ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్

ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్

నన్నిట్టా చేరిందే… ధీమ్ ధీమ్ తననన థోమ్

 

కలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా 

పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా

నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా

అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా

 

నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట

ఈ అవకాశం చేజారిందంటే మల్లీ రాదంటా

అనుమతినిస్తే నీ పెనిమిటినై ఉంటానే నీ జంటా

ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కధ మనదేనంటా

 

హే ఇది నేనేనా..!

హే ఇది నిజమేనా..!!

ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా

ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే

నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

 

హే ఇది నేనేనా..!

హే ఇది నిజమేనా..!!

ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా 

 

మే నెల్లో మంచే పడినట్టు 

జరిగిందే ఏదో కనికట్టు

నమ్మేట్టుగానే లేనట్టు ఓ ఓ 

వింటర్ లో వర్షం పడినట్టు

వింతలు ఎన్నెన్నో జరిగేట్టు 

చేసేసావే నీమీదొట్టు ఓ ఓ…

 

ఖచ్చితంగా నాలోనే 

మోగిందేదో సన్నాయి

ఈ విధంగా ముందెపుడూ 

లేనే లేదే అమ్మాయి

 

హే ఇది నేనేనా..!

హే ఇది నిజమేనా..!!

ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా

ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే

నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

 

హే ఇది నేనేనా..!

హే ఇది నిజమేనా..!! 

 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి