చిత్రం : శీను (1999)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : పార్థసారధి, చిత్ర
అల్లో నేరేడు కళ్ళ దాన
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా
ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా
అల్లుకుంటూ ఒళ్ళో లేనా
అల్లో నేరేడు కళ్ళ దాన
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
దాయీ దాయీ అనగానే
చేతికందేనా చంద్రవదనా
కుంచై నువ్వే తాకగానే
పంచప్రాణాలు పొందినానా
బొమ్మో గుమ్మో తేలక
మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా
చేరువయ్యా నేనే చెలిగా
రెప్ప మూసినా తప్పుకోనని
కంటిపాప ఇంటిలోన ఏరికోరి
చేరుకున్న దీపమా
అల్లో నేరేడు కళ్ళ దాన
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
అన్నెం పున్నెం లేని వాడని
అనుకున్నాను ఇన్ని నాళ్ళు
అభం శుభం లేని వాడిని
అల్లుకున్నాయి కన్నెకళ్ళు
మైకం పెంచే మాయతో
మూగసైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో
తేనె రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండె గూటిలో
సంకురాత్రి పండగంటి సందడల్లే
చేరుకున్న రూపమా
అల్లో నేరేడు కళ్ళ దాన
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా
ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా
అల్లుకుంటూ ఒళ్ళో లేనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి