హరిచరణ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హరిచరణ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జనవరి 2022, గురువారం

చిటికేసే ఆ చిరుగాలి పాట లిరిక్స్ - Chitikese Aa Chirugali Song Lyrics in Telugu - Aranya (2021) Telugu Songs Lyrics









చిత్రం : అరణ్య (2021)

సంగీతం : శంతను మొయిత్రా

సాహిత్యం : వనమాలి 

గానం : హరిచరణ్ 


 

చిటికేసే ఆ చిరుగాలి  

చిందేసి ఆడే నెమలి 

కిలకిలమని  కోకిల వాలి

పాడెనులె హాయిగ లాలి 

 

అడివంతా ఒకటై

ఆహ్వానమే పలికనీ

 

ఆడనీ! పాడనీ!

చిందులే వెయ్యనీ

ఆడనీ! పాడనీ!

చిందులే వెయ్యనీ

 

చిటికేసే ఆ చిరుగాలి

చిందేసి ఆడే నెమలి

అడివంతా ఒకటై

ఆహ్వానమే పలికనీ

 

ఆడనీ! పాడనీ!

చిందులే వెయ్యనీ

ఆడనీ! పాడనీ!

చిందులే వెయ్యనీ

 

చుక్కలేడి కూనల్లారా 

అడివమ్మ పాపల్లారా

అందమైన లోకం ఇదీ 

అందుకో మరి అంటున్నదీ 

హోయ్

 

కొమ్మల్లో పూచే పూలూ 

కురిపించెను అక్షింతల్లూ

అల్లరి చేసే తెమ్మెరలు 

పూసెనులే సుమగంధాలు

సాగే నీ దారుల్లో

హరివిల్లునే దించనీ 

 


 

27, అక్టోబర్ 2021, బుధవారం

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా పాట లిరిక్స్ - Manasa Nuvvunde Chote Cheppamma Song Lyrics in Telugu - Munna (2007) Telugu Songs Lyrics













చిత్రం : మున్నా (2007)

సంగీతం : హ్యారీస్ జయరాజ్

రచన : కందికొండ

గానం : సాధనా సర్గమ్ , నరేష్ అయ్యర్, క్రిష్ , హరిచరణ్


 






మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసే.. నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసే.. నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

 

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా

నీ రూపూ రేఖల్లోనా .. నేనుండీ వెలుగైపోనా

ఓ సోనా వెన్నెల సోనా.... నీ వాలే కన్నుల్లోనా

నా చిత్రం చిత్రించెయినా..కనుపాపైపోనా

 

నీవే తోడని నిజంగా..నీలో చేరితి క్రమంగా

నీవుంటే ఒక యుగమే..అయిపోయే ఇక క్షణమే

తెలుసా తెలుసా ఇది తెలుసా

మార్చేసావే నా ఈ వరసా

నువ్వు మార్చేసావే నా ఈ వరసా

 

ఓ సోనా వెన్నెల సోనా..రేపావే అల్లరి చానా

చెక్కిల్లో చుక్కైపోనా..చూపుల్తో చుట్టేసెయ్ నా

ఓ సోనా వెన్నెల సోనా..ముంగిట్లో ముగ్గైరానా

ముద్దుల్తో ముంచేసెయ్ నా..కౌగిలికే రానా

 

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా

మనసే.. నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

 

కూసే కోయిల స్వయంగా..వాలే వాకిట వరంగా

నీ ఊసే అది తెలిపే..మౌనంగా మది మురిసే

కలిసా కలిసా నీతో కలిసా

నీలో నిండీ అన్నీ మరిచా

హో నీలో నిండీ అన్నీ మరిచా

 

ఓ సోనా వెన్నెల సోనా..నీవైపే వచ్చానమ్మా

నీ ఊహే కన్నానమ్మా..నా ఊసే పంపానమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నీ గుండె చప్పుల్లోనా

నా ప్రాణం నింపానమ్మా....నిను చేరానమ్మా !

 

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా

ఓ మనసే.. నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా

ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

 

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా

ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా

 


 

26, అక్టోబర్ 2021, మంగళవారం

ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు పాట లిరిక్స్ - Oke Oka Jeevitham Idhi Cheyi Jaariponeeku Telugu Song Lyrics - Mister Nookayya (2012) Telugu Songs Lyrics









చిత్రం : మిస్టర్ నూకయ్య (2012)

సంగీతం : యువన్ శంకర్ రాజా

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

గానం : హరిచరణ్


 

ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు

మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు

కష్టమనేది లేని రోజంటూ లేదు కదా

కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా

 

హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు

హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు

హో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకు

హో ఓ ఓ చిరునవ్వు వదలకు

 

నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు

నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు

ఇది మంచి అని అది చెడ్డదని

తూకాలు వేయగల వారెవరు

అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు

అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు

దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా

తలో పాత్ర వేయకుంటే కాల యాత్ర కదిలేనా

 

హో ఓ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకా

హో ఓ ఓ ఎదురీదకుండ మునకేస్తావా

హో ఓ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని

హో ఓ ఓ అద్దరికి చేర్చవా

 

పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే

బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే

చీకటిలో నిశి రాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే

నీ వారను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే

చితి వరకు నీతో నువ్వే చివరంట నీతో నువ్వే

చుట్టూ ఉన్న లోకమంత నీతో లేనే లేదనుకో

నీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో

 

హో ఓ ఓ లోకాన నమ్మకం లేదసలే

హో ఓ ఓ దాని పేరు మోసమై మారేనులే

హో ఓ ఓ వేరెవరి సాయమో ఎందుకులే

హో ఓ ఓ నిన్ను నువ్వు నమ్ముకో


10, ఆగస్టు 2021, మంగళవారం

మొదలయ్యే హృదయం సవ్వడి పాట లిరిక్స్ - Modalayye Hrudayam Savvadi Song Lyrics in Telugu - Sarvam Thaalamayam (2019) Telugu Songs Lyrics






చిత్రం : సర్వం తాళమయం (2019)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : రాకేందు మౌళి

గానం : హరిచరణ్


 

మొదలయ్యే హృదయం సవ్వడి

గర్భాన తొలిగా

గర్వాల ఆటే ఆడి

ఆగేనే తుదిగా

గగనాలే ఘర్జించేనూ

తలబడితే మేఘాలే

సంద్రాలే హోరెత్తేనూ

కలబడితే అలలే

 

దేహం ప్రాణం ఆడే క్షణం

ఈ విశ్వం తాళ మయం

సర్వం సర్వం తాళ మయం

ఈ విశ్వం తాళ మయం

తాళం లేక ఏది జగం

 

మొలిచేటీ రెక్కల్లో

పిలిచేనీ తాళం

జలజలజల జారే కొండల

ధ్వనిలోని చలనం

గలగలగల పారే నదుల

ధ్వనిలోని గమనం

కుహుకుహు కూసే కోయిల

ధ్వనిలోని మధురం

కిలకిలకిల ఊగే కొమ్మల

ధ్వనిలోని తన్మయం

 

దేహం ప్రాణం ఆడే క్షణం

ఈ విశ్వం తాళ మయం

సర్వం సర్వం తాళ మయం

ఈ విశ్వం తాళ మయం

తాళం లేక ఏది జగం

 

పిపీలికం సరాల నడకే

వింటే స్వరతాళం కదా

మొగ్గే తుంచి తేనే జుర్రేసే

భ్రమరాల సడి తాళం వేయ్ రా

నేల మేళాన మోగించే వాన

నాట్యం చేసే చిటపట చినుకె

నీలో నిప్పు చప్పుళ్ళే అవి

నువ్వు నేనూ కాలాన్ని తాళం

జన్మించాం కలసిన లయలో

జీవించాం కల్లల లయలో

థై థై థై దిథై లయలో

తై తై తై.. తి త త

 

ఈ విశ్వం తాళ మయం

సర్వం సర్వం తాళ మయం

ఈ విశ్వం తాళ మయం

తాళం లేక ఏది జగం

 

మొదలయ్యే హృదయం సవ్వడి

గర్భాన తొలిగా

గర్వాల ఆటే ఆడి

ఆగేనే తుదిగా

గగనాలే ఘర్జించేనూ

తలబడితే మేఘాలే

సంద్రాలే హోరెత్తేనూ

కలబడితే అలలే

 

దేహం ప్రాణం ఆడే క్షణం

ఈ విశ్వం తాళ మయం

సర్వం సర్వం తాళ మయం

ఈ విశ్వం తాళ మయం

తాళం లేక ఏది జగం

 

మొలిచేటీ రెక్కల్లో

పిలిచేనీ తాళం

 

ఈ విశ్వం తాళ మయం

సర్వం సర్వం తాళ మయం

ఈ విశ్వం తాళ మయం

తాళం లేక ఏది జగం 



29, జులై 2021, గురువారం

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ హంసరో పాట లిరిక్స్ - Hamsaro Marry Me Marry Me Hamsaro Telugu Song Lyrics - Cheliya (2017) Telugu Songs Lyrics




చిత్రం : చెలియా (2017)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : సిరివెన్నెల 

గానం : అర్జున్, హరిచరణ్, జొనిత

 


చిటికెలు వినవే బేబీ…

కిలకిలమనవే బేబీ…

అకటా ఏమననే...

నిను చూసి కాస్త మతిచెడెనే…

జాలైనా చూపలేవా

బింకమా బిడియమా

ఓ లలనా నీ వలన

పిచ్చిపట్టి ఇలా తిరుగుతున్నా

ఈ నేరం నీదేనంటే

నిందిస్తున్నాననుకున్నావా…

 

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ హంసరో

ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో

ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ

హంసరో ఓహ్ హంసరో…

హంసరో ఓహ్ హంసరో…

 

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ హంసరో

ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ

హంసరో సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ

హంసరో ఓహ్ హంసరో ఓహ్

 

ఆశకొద్దే అడిగానే అనుకోవే ఆ టెక్కెందుకే

పిడివాదం మాని పోనీలే అంటే

పోయిందేముందే...

వెతకగనే కలిసొచ్చే వేళ

పిలిచిందే బాలా సందేహించాలా

మరుగెందుకే…

తగువేలనీ తెరదాటనీ దరిచేరనీ నీ నీ నీ నీ…

నీ నీ నీ నీ... నీ నీ నీ నీ...

 

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ

హంసరో

ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో

ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ

హంసరో ఓహ్ హంసరో…

హంసరో ఓహ్ హంసరో…

 

హంసరో మ్యారీ మీ మ్యారీ మీహంసరో

ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీహంసరో

సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ

హంసరో ఓహ్ హంసరో…