చిత్రం : శ్రీ కృష్ణసత్య (1971)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల రామానుజాచార్య
గానం : యస్.జానకి
జో అచ్యుతానంద జోజో ముకుందా !
లాలి పరమానంద లాలి గోవిందా జోజో
జో అచ్యుతానంద జోజో ముకుందా !
లాలి పరమానంద లాలి గోవిందా జోజో
వాడవాడల తిరిగి అలసినావేమో
వేడి కౌగిళ్ళలో వాడినావేమో
భక్తుల ఆర్తి విని బెంగపడినావేమో
నా ముద్దు లాలనలో నిదురపో స్వామీ
జోజో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి