14, జనవరి 2022, శుక్రవారం

నీ నవ్వు చాలంటా పాట లిరిక్స్ - Nee Navvu Chaalanta Song Lyrics in Telugu - Ninnila Ninnila (2021) Telugu Songs Lyrics









చిత్రం : నిన్నిలా నిన్నిలా (2021)

సంగీతం : రాజేష్ మురుగేశన్  

సాహిత్యం : శ్రీమణి  

గానం : విజయ్ ఏసుదాస్, రాజేష్ మురుగేశన్


 

నీ నవ్వు చాలంటా 

నా కంటనీరు మాయం

నీ చూపు చాలంటా 

ఈ చీకటే మాయం

మాటలెన్నున్నా 

నచ్చే మౌనమే నువ్వూ

పాటలా నిన్నూ 

పలికే పెదవినే నేనూ

 

నీ నవ్వు చాలంటా 

నా కంటనీరు మాయం

నీ నవ్వు చాలంటా 

నీ నవ్వు చాలంటా 

 

తియ్యనీ నీ పిలుపులో 

నా అడుగుకెన్ని పరుగులో 

నువ్వు తాకి చూసే వేళలో

ఒక రంగుకెన్నీ రంగులో

క్షణముకెన్ని ఊహలో 

నీ ఊసులే విను మనసులో

ఈ కలలకెన్నీ కులుకులో

నా నిదురకెన్ని ఉలుకులో

 

నీ నవ్వు చాలంటా 

నా కంటనీరు మాయం

నీ నవ్వు చాలంటా 

నీ నవ్వు చాలంటా 

 

ఆఆ... అలసిపోయే వేళలో 

నువ్వు కలిసి ఉంటే చాలులే 

ఇక మాయమవదా అలసటే 

మటు మాయమవదా నిలకడే

ఊహలంటే తెలియదే 

నీ ఊసులే విను మనసుకే 

ఈ కలలు అంటే తెలియదే 

నా నిదుర నిండా నీ కథే 

 

మాయమవదా లోకమంతా

మెరిసిపోదా మనసిలా 

నీ మాయలో పడితే 

నీ మాయలో పడితే 

 

మారిపోదా కాలమంతా 

మరపు రానీ గురుతులా

నీ మాయలో పడితే 

నీ మాయలో పడితే 

 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి