చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, పి.సుశీల
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే
ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే... నాలో వెలిగిందిలే...
అలనాటి కలలే ఫలియించే నేడే
అలనాటి కలలే ఫలియించే నేడే
మనసైన వాడే మనసిచ్చినాడే
ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి
ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి
వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి
ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే...
ఏ పూర్వబంధమో అనుబంధమాయే
ఏ పూర్వబంధమో అనుబంధమాయే..
అపురూపమైన అనురాగమాయె....
నీ కౌగిట హాయిగా సోలిపోయి...
నీ కౌగిట హాయిగా సోలిపోయి ...
సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా ఊగాలోయి
ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే...
నాలో వెలిగిందిలే...నాలో వెలిగిందిలే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి