చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఝణన ఝణన నాదంలో.. ఝుళిపించిన పాదంలో
జగము జలదరిస్తుంది.. పెదవి పలకరిస్తుంది
గజ్జెఘల్లుమంటుంటే... గుండె ఝల్లుమంటుంది
గజ్జెఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
గుండె ఝల్లుమంటుంటే... కవిత వెల్లువవుతుంది
గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి
అవి నీలో మిల మిల మెరిసే అరకన్నుల కలలైనాయి
అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి
అవి నీలో మిల మిల మెరిసే అరకన్నుల కలలైనాయి
నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి
నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి
నీ విరుపుల మెరుపులలో నీ పాదాల పారాణి
గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
గుండె ఝల్లుమంటుంటే... కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
తుంగభద్ర తరంగాలలో సంగీతం నీలో వుంది
రంగ రంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది
అచ్చ తెలుగు నుడికారంలా.. మచ్చలేని మమకారంలా
అచ్చ తెలుగు నుడికారంలా.. మచ్చలేని మమకారంలా
వచ్చినదీ కవితా గానం.. నీ విచ్చిన ఆరవ ప్రాణం
గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
గుండె ఝల్లుమంటుంటే... కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి