శక్తికాంత్ కార్తీక్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శక్తికాంత్ కార్తీక్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, నవంబర్ 2021, ఆదివారం

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే పాట లిరిక్స్ - Vacchinde Mella Mellaga Vacchhinde Telugu Song Lyrics - Fida (2017) Telugu Songs Lyrics









చిత్రం : ఫిదా (2017)

సంగీతం : శక్తికాంత్ కార్తీక్

సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ

గానం: మధుప్రియ, రాంకీ, కోరస్

 


వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 

క్రీము బిస్కెటు ఏసిండే 

గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే

ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

 

హే.. పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే

డిన్నరన్నాడే డేటు అన్నాడే

ఏలు పట్టి పోలు తిరిగి

నిన్ను ఉల్టా సీదా చేసిండే హెయ్ హెయ్

 

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 

క్రీము బిస్కెటు ఏసిండే 

గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే

ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

 పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే..ఒచ్చిండే..ఏఏ..ఆఅ.

మగవాళ్లు మస్తు చాలు.. హొయ్ హొయ్ 

మగవాళ్ళు మస్తు చాలు..ఆహ 

మగవాళ్ళు మస్తు చాలు.. మస్కలు కొడతా ఉంటారే

నువ్వు వెన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే

ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటూ

మెయింటేను నువ్వు జేస్తే

లైఫ్ అంతా పడుంటాడే

 

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 

క్రీము బిస్కెటు ఏసిండే 

గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే

ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

 

అయ్ బాబోయ్ ఎంత పొడుగో 

అయ్ బాబోయ్ ఎంత పొడుగు

అయ్ బాబోయ్ ఎంత పొడుగు

ముద్దు లెట్టా ఇచ్చుడే

అయ్ బాబోయ్ ఎంత పొడుగు

ముద్దు లెట్టా ఇచ్చుడే

తన ముందో నిచ్చనేసి

ఎక్కితే కానీ అందడే

ఫరవాలే నడుము పట్టి

పైకెత్తి ముద్దే పెట్టే

టెక్నిక్సే నాకున్నాయిలే

పరేషానే నీకక్కర్లే

 

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 

క్రీము బిస్కెటు ఏసిండే 

గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే

ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

 

హేయ్ పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే..ఏఏ..

డిన్నరన్నాడే డేటు అన్నాడే అన్నాడే..ఏఏ..

ఏలు పట్టి పోలు తిరిగి

నిన్ను ఉల్టా సీదా చేసిండే

అరే ఓ పిల్లా ఇంకా నువ్వు

నేలనిడిచి గాలి మోటర్‌లో.. తుర్ర్.ర్.ర్.ర్.ర్

 

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 

క్రీము బిస్కెటు ఏసిండే 

గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే

ముద్దా నోటికి పోకుండామస్తు డిస్ట్రబ్ జేసిండే

 

 


 

30, అక్టోబర్ 2021, శనివారం

హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా పాట లిరిక్స్ - Hey Pillagaada Yendiro Pillagaada Telugu Song Lyrics - Fida (2017) Telugu Songs Lyrics










చిత్రం : ఫిదా (2017)

సంగీతం : శక్తికాంత్ కార్తీక్

సాహిత్యం : వనమాలి

గానం : సింధూరి, సినవ్ రాజ్


 

హే పిల్లగాడా

ఏందిరో పిల్లగాడా

నా గుండె కాడా లొల్లి

హే మొనగాడా

సంపకోయ్ మొరటోడా

నా మనసంతా గిల్లి

గిర గిర గిల్లే నీలోనా

బిర బిర సుడులై తిరిగేనా

నిలవద నువ్వేం చేస్తున్నా

దొరకను అందా నీకైనా

 

హే పిల్లగాడా

ఏందిరో పిల్లగాడా

నా గుండె కాడా లొల్లి

హే మొనగాడా

సంపకోయ్ మొరటోడా

నా మనసంతా గిల్లి

 

కదిలే కదిలేయ్

చినుకే కదిలే

ముసిరే ఒక ముసురేయ్

ఇలకాల యీకాకే

వురికే వురికే

జతగా వురికేయ్

మనసే నిను మరిచి

తనకాలా యీకాకే

ఓ ఓ ఓ ఓ

సోయ లేదే హయిలోన

కమ్ముతుంటె గాలి వాన

ఏమౌతుందో ఏమో లోన

నీకు తెలిసేన

నీలోన హైరాన

నన్ను ముంచేన

నాలోని జడివాన

 

హే పిల్లగాడా

ఏందిరో పిల్లగాడా

నా గుండె కాడా లొల్లి

హే మొనగాడా

సంపకోయ్ మొరటోడా

నా మనసంతా గిల్లి

గిర గిర గిల్లే నీలోనా

బిర బిర సుడులై తిరిగేనా

నిలవద నువ్వేం చేస్తున్నా

దొరకను అందా నీకైనా

 


13, జూన్ 2020, శనివారం

బంగారు కొండ సడి చెయ్యకుండా పాట లిరిక్స్ - Bangaru Konda Telugu Song Lyrics - Ko Ante Koti (2012) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : కో అంటే కోటి (2012)
సాహిత్యం : శ్రేష్ఠ
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
గానం : హరిణి

రిగ రిగ రిగ రిగ రిగ రిగ
గామ గామ గామ గామ

రిమగస

రిగ రిగ రిగ రిగ రిగ రిగ
గామ గామ గామ గామ గామ

గమపని

రిగ రిగ రిగ రిగ రిగ రిగ
గామ గామ గామ గామ

రిమగస

రిగ రిగ రిగ రిగ రిగ రిగ
గామ గామ గామ గామ

బంగారు కొండ సడి చెయ్యకుండా
ఎదలోని వెన్న దోచేనె

ఏ చోటు రానీ దోబుచులాడి
దరిచేరకుండా కాన్చనే

నీవెక్కడున్నా కనిపెట్టలేనే
కనిపించ వేళ కృష్ణా....

క్రీడలు నీవే లీలలు నీవే
మారాలు మానీ చేరవా ...

యదలో ఏదో గుబులే ఆరే

కృష్ణా ...

ఎదురై వచ్చి వేదన
కనరా కృష్ణా ...

ప్రారం నీవే ప్రార్ధన వినరా

కృష్ణా ..

మారం మానీ దరికే రారా

కృష్ణా..

వేణూది నా గుండెలోన
గిలిగింతలు పెడతావు ఎలా ?

వేణు నాధ నా విన్నపాలు వినీ
తరలి రారా త్వరగా

గరిగా గరిగా గరిగా
మగమా మగమా మగమా

సనిరి సనిరి సనిరి సనిరి సనిరి

నా ......... కన్నా ........

ఆ ... ఆ .... ఆ ..... ఆ ..... కన్నా .......

11, జూన్ 2020, గురువారం

ఓ మధురిమవే పాట లిరిక్స్ - Oh Madhurimave Telugu Song Lyrics - Ko Ante Koti (2012) Telugu Songs Lyrics







చిత్రం : కో అంటే కోటి (2012)
సాహిత్యం : శ్రేష్ఠ
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
గానం : నరేష్ అయ్యర్

ఓ .. ఓ ... ఓ ... ఓ ... ఓ .... ఓ ....
ఓ .. ఓ ... ఓ ... ఓ ... ఓ .... ఓ ....

ఓ మధురిమవే ఎందుకు వచ్చావే
నా మనసునీలా ముక్కలు చేసావే

నీ తలపులలో ముల్లే ఎన్నెన్నో
గాయం చేసే ఇలా ...

నీ కలవరమే వెల్లువల తాకే
ఈ కలయికలో వేదనలే చూపే

నా యద లయలో అలజడులే ఎన్నో
ప్రళయం రేపే ఇలా ....

ఆ .. ఆ.. ఆ.. ఆ..

నీవే.. కోరి వెళుతున్న తీరం ఇది ..
నన్నే కమ్ముకుంటున్న శూన్యం ఇది ...

కలలా కలిసి గతమయ్యేవే ....
జతగా నడిచి కథవయ్యావే ....

కలలా కలిసి గతమయ్యేవే ....
జతగా నడిచి కథవయ్యావే ....

నా ప్రాణం
నిన్నే కోరిందె చెలియా చెలియా
నిజమే కనదే

నీ వైపే అడుగులు వేస్తుందే
చెబితే వినదే ... యే ...

ఈ నిమిషాల్లో
నా లోకం మారిందని నమ్మాల

నా హృదయాల్లో నీ రూపం మరుగవదే
ఏమయినా ...

కలలా కలిసి గతమయ్యేవే ....
జతగా నడిచి కథవయ్యావే ....

కలలా కలిసి గతమయ్యేవే ....
జతగా నడిచి కథవయ్యావే ....