గోపీ సుందర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గోపీ సుందర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో పాట లిరిక్స్ - Enno Enno Santhoshalenno Enno Song Lyrics in Telugu - Tej I Love You (2018) Telugu Songs Lyrics




















చిత్రం : తేజ్ ఐలవ్యూ (2018)
సంగీతం : గోపీసుందర్  
సాహిత్యం : రాంబాబు గోసల
గానం : సింహ 








ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే
ఎన్నో ఎన్నో ఎన్నో ఉల్లాసాలే ఎన్నో
ఊపేస్తుంటే అందే అంబరమే 
మనసంతా తుళ్ళేనూ ప్రతిక్షణమూ హాయిగా 
ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా 
గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా 
ఈ ఆటల పాటల ఆనందాలా

హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే

అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ
ఒకచోటే కలిసి మెలిసి సందడినే చేసేనా
చిలిపితనం చెలిమిగుణం చిరు జగడాలన్నీ
కనులెదుటే గంతులు వేసి గిలిగింతలు పెట్టేనా
సరదా దసరా రోజూ జరిగే బృందావనమిదిలే
దరికే రాదూ ఏ దిగులూ ఔనా 
అలుపు సొలుపు ఎపుడూ 
ఎరుగని అల్లరి చిందులివే 
అలకే లేదంటా ఎవ్వరిలోనా 

హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే

అతిథులుగా దేవతలే దిగివస్తారేమో
ఇలపైనే స్వర్గంలాంటి ఈ ఇల్లే చూశాక 
శతమానం భవతంటూ దీవిస్తారేమో
ఈ అనుబంధాలే సాక్ష్యం తడికంటికి శలవిక
అమ్మా నాన్నను మరిపిస్తారే ఈ ఐనోళ్ళంతా
ఇంతకు మించిన వరముండదు అంటా
జన్మకు సరిపడు ప్రేమను పంచేవాళ్ళే చుట్టూతా
ప్రాణం ఇంకేమీ కోరదు అంటా 

1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ







25, జనవరి 2022, మంగళవారం

యే జిందగీ ఇవ్వాళా పాట లిరిక్స్ - Ye Zindagi Ivvala Song Lyrics in Telugu - Most Eligible Bachelor (2021) Telugu Songs Lyrics









చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)

సంగీతం : గోపీ సుందర్ 

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

గానం : హనియా నఫీసా, గోపీసుందర్ 

 


ఆకాశమంతా ఆనందమై 

తెల్లారుతోందే నాకోసమై

ఆలోచనంతా ఆరాటమై 

అన్వేషిస్తోందే ఈ రోజుకై

 

యే జిందగీ ఇవ్వాళా 

కొంగొత్తగా నవ్వేలా

ఈ మాయాజాలమంతా 

తనదేగా..ఆఆఆఆ....

 

పాదాలు పరుగయ్యేలా 

ప్రాణాలు వెలుగయ్యేలా

ఓ తోడు దొరికే నేడు 

తనలాగా...ఆఆఆఆ..

 

ఆకాశమంతా ఆనందమై 

తెల్లారుతోందే నాకోసమై

 

నా పెదవంచుకు 

తన పేరు తోరణం

నా చిరునవ్వుకు 

తనేగ కారణం

దాయి దాయి దాయి 

దాయి దాయి దాయి

తనుంటే చాలు చాలు

 

హాయి హాయి హాయి 

హాయి హాయి హాయి

పరిమళాలూ పంచవా క్షణాలు

 

మొదలయ్యా నీవలన 

నీతోనే పూర్తవనా

 

ఆకాశమంతా ఆనందమై 

తెల్లారుతోందే నాకోసమై

ఆలోచనంతా ఆరాటమై 

అన్వేషిస్తోందే ఈ రోజుకై

యే జిందగీ ఇవ్వాళా

కొంగొత్తగా నవ్వేలా

ఈ మాయాజాలమంతా 

తనదేగా...ఆఆఅ...

 

పాదాలు పరుగయ్యేలా 

ప్రాణాలు వెలుగయ్యేలా

ఓ తోడు దొరికే నేడు 

తనలాగా...ఆఆఆ... 

 


 

19, జనవరి 2022, బుధవారం

అరె గుచ్చే గులాబి లాగా పాట లిరిక్స్ - Are Gucche Gulabilaaga Song Lyrics in Telugu - Most Eligible Bachelor (2021) Telugu Songs Lyrics









చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)

సంగీతం : గోపీ సుందర్ 

సాహిత్యం : అనంత శ్రీరామ్

గానం : అర్మాన్ మాలిక్

 


అరె గుచ్చే గులాబి లాగా 

నా గుండెలోతునే తాకినదే

వెలుగిచ్చే మతాబులాగా 

నా రెండు కళ్ళలో నిండినదే

హే..య్.. 

 

ఎవరే నువ్వే ఏం చేసినావే 

ఎటుగా నన్నే లాగేసినావే

చిటికే వేసే క్షణంలో 

నన్నే చదివేస్తున్నావే

ఎదురై వచ్చి ఆపేసి నువ్వే 

ఎదరేముందో దాచేసినావే

రెప్పల దుప్పటి లోపల 

గుప్పెడు ఊహలు నింపావే

కుదురే కదిపేస్తావులే 

నిదురే నిలిపేస్తావులే

కదిలే వీలే లేని 

వలలు వేస్తావులే

ఎపుడూ వెళ్ళే దారినే 

అపుడే మార్చేస్తావులే

నా తీరం మరిచి 

నేను నడిచానులే

 

అరె గుచ్చే గులాబి లాగా 

వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా 

నచ్చావులే భలేగా

 

అరె గుచ్చే గులాబి లాగా 

వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా 

నచ్చావులే భలేగా

 

ఎవరే నువ్వే ఏం చేసినావే 

ఎటుగా నన్నే లాగేసినావే

చిటికే వేసే క్షణంలో 

నన్నే చదివేస్తున్నావే

 

ఊపిరి పని ఊపిరి చేసే 

ఊహలు పని ఊహలు చేసే

నా ఆలోచనలోకొచ్చి 

నువ్వేం చేస్తున్నావే

నేనేం మాటాడాలన్నా 

నన్నడిగి కదిలే పెదవే

నా అనుమతి లేకుండానే 

నీ పలుకే పలికిందే

ఏమిటే ఈ వైఖరి 

ఊరికే ఉంచవుగా మరి

అయ్యా నేనే ఓ మాదిరీ

 

అరె గుచ్చే గులాబి లాగా 

వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా 

నచ్చావులే భలేగా

 

అరె గుచ్చే గులాబి లాగా 

వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా 

నచ్చావులే భలేగా

 

ఎవరే నువ్వే ఏం చేసినావే 

ఎటుగా నన్నే లాగేసినావే

చిటికే వేసే క్షణంలో 

నన్నే చదివేస్తున్నావే

 

నీకోసం వెతుకుతూ ఉంటే 

నే మాయం అవుతున్నానే

నను నాతో మళ్ళీ మళ్ళీ 

కొత్తగ వెతికిస్తావే

బదులిమ్మని ప్రశ్నిస్తావే 

నను పరుగులు పెట్టిస్తావే

నేనిచ్చిన బదులుని మళ్ళీ 

ప్రశ్నగ మారుస్తావే

హే పిల్లో..! నీతో కష్టమే

బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే 

నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే

 

ఎవరే నువ్వే ఏం చేసినావే 

ఎటుగా నన్నే లాగేసినావే

చిటికే వేసే క్షణంలో 

నన్నే చదివేస్తున్నావే 

 

గుప్పెడు ఊహలు నింపావే

కుదురే కదిపేస్తావులే 

నిదురే నిలిపేస్తావులే

కదిలే వీలే లేని 

వలలు వేస్తావులే

ఎపుడూ వెళ్ళే దారినే 

అపుడే మార్చేస్తావులే

నా తీరం మరిచి 

నేను నడిచానులే

 

అరె గుచ్చే గులాబి లాగా 

వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా 

నచ్చావులే భలేగా

 

అరె గుచ్చే గులాబి లాగా 

వెలుగిచ్చే మతాబులాగా

కళతెచ్చే కళ్ళాపిలాగా 

నచ్చావులే భలేగా

 


 

9, జనవరి 2022, ఆదివారం

నేడే నాకు నేను పరిచయమౌతున్నా పాట లిరిక్స్ - Nede Naku Nenu Parichayamouthunna Song Lyrics in Telugu - Choosi Choodamgane (2020) Telugu Songs Lyrics








చిత్రం : చూసీ చూడంగానే (2020)

సంగీతం : గోపీ సుందర్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 

గానం : గోపి సుందర్ 


 

నేడే నాకు నేను 

పరిచయమౌతున్నా

నీలో నన్ను చూసి 

పరవశమౌతున్నా

సెకనుకు పదిసార్లు

నీ పేరంటున్నా

నేనోసారైనా

నాకు గుర్తు రాకున్నా

కవినేమ్ కాకున్నా

కవితలు రాస్తున్నా

తెలియని రంగుల్లో

నీతో కలలుకంటున్నా

 

ఇన్ని నాళ్ళుగా

నిన్ను చూపని

నిన్న మొన్నపై 

కోపమున్నదే

నిన్ను చూడక

నిన్ను కలవక

తెల్లవారదే రోజు గడవదే

ప్రేమనూ మరోటనూ

నువ్వు నా నిజం

నిండుగా నువ్వై

మారనీ జగం

నా నిను విడిచి

నిమిషం కదలదుగా

 

ఎదుట నిలిచిన

కలిసి గడిపిన

ఎంతకీ చెలి తనివి తీరదే

తలపు తలపున

నిన్ను కోలిచినా

ఎందుకో మరి దాహం మారదే

నేలపై నేరుగా దేవతై నువ్వే

వాలినావిలా లాలి పాడగా

నీ కలయికలో

మనసే వెలిగినదే

ఏంటా కోపమంతా 

చూడలేను నీలోనా

నువ్వే దూరమైతే 

మనసిది నిలిచేనా

అలగకే నాపైనా

ఉరమకే ఏమైనా

 

నిన్ను వీడి క్షణమైనా

నేను ఉండలేనన్నా

ఎవరే నీ కన్నా

నిన్ను నమ్ముకుని నేనున్నా

మాటలాడి మన్నించి

మరల కలిసిపోమన్నా

 


 

11, అక్టోబర్ 2021, సోమవారం

ఇన్నాళ్లు గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా పాట లిరిక్స్ - Innaallu Gaalilone Teli Aade Chitti Adugaa Telugu Song Lyrics - Most Eligible Bachelor (2021) Telugu Songs Lyrics







చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 

సంగీతం : గోపీ సుందర్

గానం : జియా ఉల్ హక్ 



అరెరే ఎవ్వరూ ఎం చెప్పలేదా ఒక్కసారి 

ఇన్నాళ్లు గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా 


సర్లే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి 

ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక 


ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం 

తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం 


ఇన్నాళ్లు గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా 

ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక 


శిలలాంటి నిన్ను ఇలా శిల్పంగ మలిచింది 

ఆ నవ్వులో చురకలే 

నీ సొంత కలలాగ నీ కంట నిలిచింది 

ఆ దివ్వెలో మెరుపులే 


అచ్చంగా తనలా ఉందా అద్దం చూపే నీ రూపం 

నీ సొంత చిరునామాలా కనిపిస్తోందా ఈ మలుపు 


ఇన్నాళ్లు గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా 

ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక


ఎన్నెన్ని జన్మలైనా తెగిపోని బంధం 

ఏదో ఎదురైంది నీ దారిలో 


ఓ ఓ  మాటలకి అందని భావం 

మనసెలా గుర్తిస్తుందో తెలిసింది ఆ చెలిమితో 


ఇంకెవరి కళ్ళో చూసే కలవే నువ్వు ఇన్నాళ్లు 

ఎంత బాగుందో చూడు నీ తొలి వేకువ ఈనాడు 


ఇన్నాళ్లు గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా 

ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక


అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా 

ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే 

గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా 


సర్లే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి 

ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక 


ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం 

తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం 


ఇన్నాళ్లు గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా 

ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక 


ఇన్నాళ్లు గాలిలోనే తేలి ఆడే చిట్టి అడుగా 

ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక