చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా... పూచినకొమ్మా
ఆ..ఆ..ఆ..ఆ...
పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక
పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక
ఎదకన్నాలోతుగా పదిలంగా దాచుకో
ఎదకన్నాలోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా.... పూచిన కొమ్మా
ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
పుత్తడి బొమ్మా... పూచిన కొమ్మా...
ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను....
ముందు జన్మవుంటే ఆ కాలి మువ్వనై పుడతాను....
పుత్తడి బొమ్మా... పూచిన కొమ్మా...
ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి