30, జూన్ 2020, మంగళవారం

నీ పాదం మీద పుట్టుమచ్చనై పాట లిరిక్స్ - Nee Padam Meeda Puttumacchanai Song Lyrics in Telugu - Orey Rikshaw (1995) Telugu Songs Lyrics





ఇక్కడ ఈ పాటని చూడండి











చిత్రం : ఒరేయ్ రిక్షా (1995)
సాహిత్యం : గద్దర్
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ 
గానం : వందేమాతరం శ్రీనివాస్







ఆ... ఆ .. ఆ .. ఆ...

మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా..

నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...

ముళ్ల తీగమ్మా కంచెమీద చీరావేస్తే రానేరాదమ్మా
ఆడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మా


పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు

పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు

అటువంటినే అన్ననుగాను చెల్లెమ్మా...
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా...

అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా...
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా...

మల్లెతీగకు పందిరివోలె 
మస్క సీకటిలో వెన్నెలవోలె చెల్లెమ్మా...

అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మా
ఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా 
ఆహుమ్ ఆహుమ్

అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మా
కన్నవాళ్లకే రోకలి పోటమ్మా 
ఆహుమ్ ఆహుమ్

సిన్నబోయి నువు కూసున్నవంటే 
ఎన్నుపూస నాదిరిగేనమ్మా

ఒక్కక్షణము నువు కనబడకుంటే 
నా కనుపాపలు కమిలిపోతయి

సిన్నబోయి నువు కూసున్నవంటే 
ఎన్నుపూస నాదిరిగేనమ్మా

ఒక్కక్షణము నువు కనబడకుంటే 
నా కనుపాపలు కమిలిపోతయి

ఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా....
నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా...

బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా...
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా...

మల్లెతీగకు పందిరివోలె 
మస్క సీకటిలో వెన్నెలవోలె చెల్లెమ్మా...

ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్లి
భుజం కట్టి చదువు చదివేదెందుకు

ఆ... కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు
ఆ... కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు

చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా

నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా
నా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా

రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా

మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా....

నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా....
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా....
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా...






29, జూన్ 2020, సోమవారం

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో పాట లిరిక్స్ - Ee Duroyodhana Dussasana Song Lyrics in Telugu - Prathighatana (1985) Telugu Song Lyrics


ఈ పాట అంటే నాకు చాల ఇష్టం 
వేటూరి గారి కలం నుంచి జారిన ఆణిముత్యాల్లో 
ఈ పాట ఒకటి. ప్రతిఘటన సినిమా ఆ రోజుల్లో 
ఎంతటి సంచలనం సృష్టించిందో మా నాన్నగారు చెప్పేవారు.
అప్పటికి నేను ఇంకా పుట్టలేదు అనుకోండి, 
కానీ ఈ పాట ఎప్పుడు విన్నా నరనరాల్లో 
రక్తం పొంగిపోర్లుతున్న భావన కలుగుతుంది 
జానకమ్మా గారి గాత్రం అయితే మాటలు లేవు
అంత అద్భుతంగా పాడారు.

ఈ రోజు ఈ పాట మన నేను నా పాట లో 

ఈ పాట ఇక్కడ చూడండి







చిత్రం : ప్రతిఘటన  (1985)
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : చక్రవర్తి
గానం : యస్.జానకి 


ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో

మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో...  
మాతృహృదయ నిర్వేదం.. నిర్వేదం...


పుడుతూనే పాలకేడ్చి...  పుట్టీ జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు


మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిలకామ మేచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే

మీ అమ్మల స్తన్యంతో...  మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం


మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో...  
మాతృహృదయ నిర్వేదం.. నిర్వేదం

కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి
మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురుచేసి
పెంచుకున్న తల్లీ ఒక ఆడదనీ మరిచారా


కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర


ప్రతి భారత సతి మానం చంద్రమతీ మాంగల్యం
మర్మస్థానం కాదది... మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం


శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే
మానవరూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే


కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో


నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే
ఏమైపోతుందీ సభ్యసమాజం
ఏమైపోతుందీ మానవధర్మం


ఏమైపోతుందీ ఈ భారతదేశం
మన భారతదేశం...  మన భారతదేశం... మన భారతదేశం 



28, జూన్ 2020, ఆదివారం

సిత్రమైనా భూమి సేసినాడ సామి పాట లిరిక్స్ - Sithramaina Bhoomi Song Lyrics in Telugu - Aakasam Nee Haddura (2020) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి














చిత్రం : ఆకాశం నీ హద్దురా (2020)
సాహిత్యం : రాకేందు మౌళి
సంగీతం : జీవి.ప్రకాష్ కుమార్
గానం : జీవి.ప్రకాష్ కూమార్, రేవంత్







సిత్రమైనా భూమి సేసినాడ సామి
మనుషులాడే ఆటే సూడు
ఆటే సూడు ఆటే సూడు ఆటే సూడు

ఆటే ఆట ఆడే ఆట ఆట ఆట ఆట

బుజ్జి మట్టి బంతి మీద
మనిషి వింత ఆటే సూడు

రెప్పవాలి రాలిపోతే
పాడే మనకు వచ్చే తోడు

సక్కగ ఎసుకోర కార సారా సుక్క
సుక్కల్లో కెక్కినోడి ఖాతాలో ఈ లెక్క

రాజు పేద హాయి బాధ బేదాలేవి లేవు
నూకలింక సెల్లిపోతే అందరిదోక్క సావు

రాజు పేద హాయి బాధ బేదాలేవి లేవు
నూకలింక సెల్లిపోతే అందరిదోక్క సావు


కోతి నుంచి మనిషైనా జాతి మారలేదు
రాతే సూడు నీతే సూడు
కోతే సూడు కోతే సూడు
కోతి జాతి కోతే నీతే
కోతే పాతే ఆడు

నీది నాది అన్న తీపి పోదు కదా పూడ్సేలోపు
సచ్చినోడైనా లేపి ఆడిస్తున్నా డబ్బే తోపు

మందు బాబులంత గంతులేస్తే లుంగీలూడే
ఆడాల్ల ఏడుపులే ఎలుగెత్తి పాడే

సుట్టాలేందరున్నా సీవరి 
నీ తోడెవడు రారులే
మేడ మీడ మిద్దెలెన్నున్నా
నీ సోటే ఆరు అడుగులే

సుట్టాలేందరున్నా సీవరి
నీ తోడెవడు రారులే
మేడ మీడ మిద్దెలెన్నున్నా
నీ సోటే ఆరు అడుగులే

కులం నాది తక్కువైతే
కులం నాది తక్కువైతే

రక్తం రంగు మారుతుందా ?
ఒంట్లో రక్తం రంగు మారుతుందా  ?

అరే నీ కులము ఎక్కువైతే .......
అరే నీ కులము ఎక్కువైతే .......

కొమ్మలుంటాయార ? ఉంటాయార ? 
కొమ్ములుంటే కొమ్ములుంటే
కొమ్ము కొమ్ము కొమ్ములుంటే
కుమ్మి కుమ్మి ఇరిసేయ్

కులాన తక్కువైతే ఒంట్లో బురద పారుతుందా
నీ కులం ఎక్కువైతే రక్తం రంగు మారుతుందా

కాయ కష్టాన్ని నమ్ముకున్న కులం మాది
మాయ మతలబులు నేర్చుకున్న కులం మీది

నిప్పెట్టెటి మతము ఇక కప్పెట్టాలి మనము
నిప్పెట్టెటి మతము ఇక కప్పెట్టాలి మనము

కలలు కన్న బతుకు చితి చేరేలోపు వెతుకు
కలలు కన్న బతుకు చితి చేరేలోపు వెతుకు







27, జూన్ 2020, శనివారం

ఆకాశం తస్సదియ్య అమ్మాకానికెడితే పాట లిరిక్స్ - Aakasam Thassadiyya Ammakaanikedithe Telugu Song Lyrics - Subramanyam For Sale (2015) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
సాహిత్యం : చంద్రబోస్
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : కృష్ణ చైతన్య, రమ్య బెహరా


ఆకాశం తస్సదియ్య అమ్మాకానికెడితే
ఆ రేట్ ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం 
భూగోళం ఎవ్వడైన వేలం వేస్తానంటే 
హైయ్యస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం 

కష్టాలు చూడగానే హయ్య బాబోయ్ అనక
గుండెల్లో దమ్ము ఉంటే అన్నీ గండీ పరక 
సక్సెస్ కున్న కిక్కు వీనికుంది గనక 
తెలిసాక ఆగలే నే ముందు వెనక 

ఏ పిచ్చిలో పీక్స్ ని చూద్దాం 
రచ్చ రంబోల చేద్దాం 
స్వర్గమే కనిపిస్తుంటే 
తాగూతు ఊగుతూ గాలిలో తేలుతూ 

యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 

క్యాలెండర్ మొత్తం వెతికి 
అన్ని పండగల్ని ఇప్పుడే చేద్దాం 
కంట్రోల్ లేని వాల్యూమ్ లాగ 
ఊరు వాడ మొత్తం ఉతికారేద్దాం 

కొలంబస్ నడవని దారిలో 
గూగుల్ మ్యాప్ దొరకని వే లో 
కన్నులకే తెలియని కలలో 
టన్నుల కొద్ది అల్లరి చేద్దాం 

ఏ పొంగుదాం షాంపేన్ లాగా 
ఉరుకుదాం సైక్లోన్ లాగా
అహా దిష్టి తగలేసే లాగా 
వాట్ వేర్ వేరెవర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ 

యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 

ఏ .. ఎవరెస్టు ఎత్తెంత్తంటే 
మనలో పిచ్చికి ఇంచు తక్కువందాం 
ఫసిఫిక్కు లోతెంతంటే 
మనలో డోసుకి సరిపోదందాం

జనమంతా జలసీ తోటి మన వంకె చూసే లాగా
సిగతరగ సితకేసేద్దాం 
జిందగీ మొత్తం జాతర చేద్దాం 

ఈ క్లాసులో మనమే మాసూ
నాటుగా కోడితే డాన్సూ 
బౌండరీలన్నీ స్మాషూ ఏక్ దం చల్ చల్ 
చేద్దాం హల్ చల్ 

యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 
యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే 


26, జూన్ 2020, శుక్రవారం

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో పాట లిరిక్స్ - Aalayana Harathilo Aakhari Chithi Mantalalo Song Lyrics in Telugu - Suswagatham (1997) Telugu Songs Lyrics


ఈ సినిమాని మా నాన్నగారు చాల ఇష్టపడతారు ఈటీవీ లో ఎప్పుడు టెలికాస్ట్ అయినా దీని గురించి మాట్లాడతారు. 
ఈ రోజు మళ్లీ ఈ చిత్రం బుల్లితెరలో ప్రసారం చేసారు , 
అప్పుడే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు.
ఈ పాటకు ముందు వచ్చే మాటలు 
మా నాన్నగారికి కళ్లనిండా నీళ్లు తెప్పించాయి అంటా, 
కేవలం ఈ పాట కోసమే మూడుసార్లు 
ఈ చిత్రాన్ని చూసానని చెప్పారు, వ్యక్తిగతంగా కూడా 
ఈ సినిమా, మరియు ఈ పాట నాకు చాల ఇష్టం.

మా నాన్నగారి కోసం 
ఈరోజు ఈ పాటని మన నేను నా పాట లో

ఇక్కడ ఈ పాటని చూడండి




చిత్రం : సుస్వాగతం (1997)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : ఎస్.ఏ.రాజ్ కుమార్
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం


ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం


దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం


ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం


ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా


ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా


నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం


ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం


సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం


ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా


పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం


ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం


దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం



పుడుతూనే ఉయ్యాల నువ్ పోతే మొయ్యాల పాట లిరిక్స్ - Puduthune Uyyala Telugu Song Lyrics - Neninthe (2008) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి








చిత్రం : నేనింతే (2008)
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : చక్రి
గానం : గీతా మాధురి


పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల
పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల...

ఈలోపే ఏదో చెయ్యాల
ఏలాల ఏలాల... దునియానే ఏలాల...
చకచకచక చెడుగుడు ఆడాల

తూగుంటే వస్తయా
మాపంటే వుంటయా

కొండంత ఆశయా
కూసింత లైఫ్ అయా

ఇరగేసేయ్ తిరగేసేయ్
దున్నేసేయ్ దులిపేసేయ్
అందంగా ఆనందంగా
ఇష్టంగా బతికేసేయ్

ఇరగేసేయ్ తిరగేసేయ్
దున్నేసేయ్ దులిపేసేయ్
అందంగా ఆనందంగా
ఇష్టంగా బతికేసేయ్

పుడుతూనే ఉయ్యాల... ఈలోపే ఏదో చెయ్యాల

అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడొద్దే
ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే

చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే
నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా

నీకై మిగిలివుంది ఇక ఈరోజే
టర్నే లేని దారులూ ట్విస్టే లేని గాథలూ
రిస్కే లేని లైఫులూ బోరు బోరే

నువ్వెంతో ఎత్తుకు ఎదిగినా 
బోల్డంత సంపాదించినా
ఒరే నాన్నా పొంగిపోకురా

గెలుపెవ్వడి సొత్తు కాదురా 
అది నీతో మొదలవ లేదురా
అది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సురా

పుడుతూనే ఉయ్యాల... 
నువ్ పోతే మొయ్యాల... 
ఈలోపే ఏదో చెయ్యాల

నిలుచుంటే బస్ స్టేషన్లో బస్ వస్తాది ఎక్కొచ్చే
పడిపోతే ఫ్రస్టేషన్లో ఏముంటాది ఎక్కేకే

ఇన్నేళ్లూ చేసిన పొరపాట్లూ సక్సెస్‌తో సర్దేయొచ్చులే

పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం
దాన్నే మరచిపోవడం వింతేగా

ఏది ఎంత అవసరం, ఇట్టే తెలుసుకోవటం 
అంతే మోసుకెల్లడం హ్యాపీ గా

నిన్ను బయపెట్టే పనులేమిటో 
అవి చేసేయ్ రోజుకొక్కటి, 
ఇక ఆపై జడుపే రాదు రా

నీ కోరే ఫుల్లై పోయినా, 
కర్మంతా కాలి పోయినా, 
ప్రేమిస్తేనే పని చెయ్యరా

పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల...
ఈలోపే ఏదో చెయ్యాల

ఏలాల ఏలాల... దునియానే ఏలాల...
చకచకచక చెడుగుడు ఆడాల 


25, జూన్ 2020, గురువారం

భయంగా భయంగా అయోమయంగా పాట లిరిక్స్ - Bhayamga Bhayamga Telugu Song Lyrics - Katha (2009) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : కధ (2009)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : ఎస్.కె.బాలచందర్
గానం : నిత్యశ్రీ

భయంగా భయంగా అయోమయంగా
క్షణం ఓ మృదంగా వరం ఆయేగా

శపించే కలైనా అదో నిజంగా
భరించే విధంగా గతం లేదుగా

చితికే బతుకే చిరాయువై
కధ చితికై వెతికి నిరాశ మిగిలి

సాయమడిగే భాష రాక
కంటి జడిలో తడిసా నేనికా

భయంగా భయంగా అయోమయంగా
క్షణం ఓ మృదంగా వరం ఆయేగా

శపించే కలైనా అదో నిజంగా
భరించే విధంగా గతం లేదుగా

సాస సాస రిరి సాస
సాస సాస రిరి సాస

ఏమో నేను చూసినదే చూపిస్తుంటే
ఈ లోకం నన్ను చూసి పడి నవ్విందింకా

మతి లేదని నన్నంది మనసేదని నేనంటే
బదులివ్వదు ఏ రోజునా తను మారాదు
ఏం చేసినా ....

ముల్లతోన అల్లుకున్న పంజరంలో ఉండన్నది ....

ఆ ... ఆ ... ఆ ... ఆ .... ఆ ...
ఆ ... ఆ ... ఆ ... ఆ .... ఆ ...
ఆ ... ఆ ... ఆ ... ఆ .... ఆ ...

పూచే పూలతోటలో నవ్వే నేను
వణికించే కాణా మద్యలో మానైయ్యాను

సిరివెన్నెల నిలయాన్ని విడిచి విష వలయంలో
నడిచింది నా పాదమే నరకానికి అనువాదమై
జ్వాలనైనా తాలలేని వేడి కాదా ఈ జీవితం

భయంగా భయంగా అయోమయంగా
క్షణం ఓ మృదంగా వరం ఆయేగా

శపించే కలైనా అదో నిజంగా
భరించే విధంగా గతం లేదుగా

చితికే బతుకే చిరాయువై
కధ చితికై వెతికి నిరాశ మిగిలి

సాయమడిగే భాష రాదా
కంటి జడిలో తడిచింది నా 

ఎమోష్నల్ పెగ్ - Emotional Peg Telugu Song Lyrics - Madhura Wines (2020)


ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : మధుర వైన్స్ (2020)
సాహిత్యం : శ్రీ సాయికిరణ్
సంగీతం : జయ్ క్రిష్
గానం : హేమచంద్ర

విడిగా వదలదు ఎటుగా నడపదు
ఉరిలా బిగిసిన చేదు గతం

వెనకే తరుముతు అలిసే పరుగెటు
అసలేం తెలియదు ఏది నిజం

నా ... వెలుగే ఏదనుకుంటే
ఈ కధలే ఎదురుపడి

ఆ నిమిషం రగిలే మనసుకి
ఓ చెలిమై కనుల తడి

నా చుట్టూ చుట్టూ
నువ్వే ఉన్నావంటు అనిపించే క్షణం
ఒక మాయ తెర

ఏమయ్యావంటు నిను చూడాలంటు
మిగిలున్నానిలా తెలుసా మధురా


మధురం మొదటి జ్ఞాపకం
జతగా కలిసి ఆ క్షణం

మధురం నువ్వున్న జీవితం తెలుసా నువ్వేగా కారణం
కలిసుంటూ అదే కలంటు విడిపోతే ఎలా మరీ
నిను కోరే ప్రతి క్షణాన బదులేది తెలుపదనీ

నా చుట్టూ చుట్టూ
నువ్వే ఉన్నావంటు కనిపించే క్షణం
నిజమా మధుర
నీ వెంటే ఉంటు నిను చేరాలంటు
బ్రతికున్నానిలా తెలుసా మధురా.
.

24, జూన్ 2020, బుధవారం

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ పాట లిరిక్స్ - Amma Ani Kothaga Telugu Song Lyrics - Life Is Beautiful (2012) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ (2012)
సాహిత్యం : వనమాలి
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : శ్రావణ భార్గవి, శశి కిరణ్

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ

నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ జోల పాటవై

ఆకలని అడగక ముందే నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా

రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

నీకు పసిపాపలమేగ ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మాజతలోనే ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ కొత్త జన్మ నివ్వడా

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా


ఏమ్ మనసే నీది పాట లిరిక్స్ - Yem Manase Neesi Song Lyrics in Telugu - Mister & Miss (2020) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి













చిత్రం : మిస్టర్ & మిస్ (2021)
సాహిత్యం : పవన్ రాచేపల్లి
సంగీతం : యశ్వంత్ నాగ్
గానం : అనురాగ్ కులకర్ణి , యశ్వంత్ నాగ్





ఏమ్ మనసే నీది 
విసిరేయ్ దాన్ని

ఏ మాత్రం జాలిలేనిది
నీ అందంతో ఉసురు తీసినా బుసలు కొట్టినా
చిరునవ్వేసుకోని ఏడ్చినా

నీ ..........
ఓడె........
ఉరై........ పోయెనే
వింతేం లేదే

నీ.......
జతే.......
కధై ........ ఆగెనే

రోజంతా కనుల కుస్తీలో
కలల దోస్తీ కడితే
మోజంతా తనువుదేనంటావ....

భూకంపం తరుముకోస్తున్నా
తమరి వెంటే నడిచే
ప్రేమంటే అలుసుగా చూస్తవా ......

న్యాయంగా తెగనీ తంటాల్లో తరుణి బెట్టే తప్ప
సాక్ష్యంగా ఎవరు నిలిచేరంటా .....


ఉద్దేశాలలో అదేదో పెద్ద త్యాగాల తోపులా
ఊరిస్తారులే అదంతా ఒట్టి నీళ్లల్లో బుడగే
ముంచేస్తారులే భరిస్తూ ఉంటు భేషుగ్గ చూస్తు
తేలేదారినే కన్నీళ్లతో నింపుతూ

అయ్యో పాపమే మగాడికి శాపమా
అంతా శూన్యమే తెలుసుకుంటే
జన్మే ధన్యమే

నీ ..........
ఓడె........
ఉరై........ పోయెనే
వింతేం లేదే

నీ.......
జతే.......
కధై ........ ఆగెనే

రోజంతా కనుల కుస్తీలో
కలల దోస్తీ కడితే
మోజంతా తనువుదేనంటావ....

భూకంపం తరుముకోస్తున్నా
తమరి వెంటే నడిచే
ప్రేమంటే అలుసుగా చూస్తవా ......

న్యాయంగా తెగనీ తంటాల్లో తరుణి బెట్టే తప్ప
సాక్ష్యంగా ఎవరు నిలిచేరంటా .....





23, జూన్ 2020, మంగళవారం

అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట లిరిక్స్ - Apuroopamainadamma Aadajanma Song Lyrics in Telugu - Pavitra Bandham (1996) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి








చిత్రం : పవిత్ర బంధం (1996)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కె.జె.ఏసుదాసు










కార్యేషుదాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు

ఏ పూజ చేసినా ఏ నోము నోచినా
ఏ స్వార్దము లేని త్యాగం
భార్యగా రూపమే పొందగా...

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

కలిమిలేములన్నీ ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసి రాని కాలం వెలే వేసినా
విడిచి పోని బంధం… తనై ఉండదా
సహధర్మచారిణి సరిలేని వరమని
సత్యాన్ని కనలేనినాడు
మోడుగా మిగలడా పురుషుడు


అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
కార్యేషుదాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ





లోకం పాట లిరిక్స్ - Lokam Song Lyrics in Telugu - Bobby (2002) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి













చిత్రం : బాబీ (2002)
సాహిత్యం : శక్తి
సంగీతం : మణిశర్మ
గానం : కల్పనా






లోకం పికే నరకాలి పెట్రోల్ ఏసీ కాల్చాలి
ఈ సృష్టికే ప్రతి సృష్టే చేయ్యాలి

మనుషుల బ్రెయినే వాష్ చేసి
మనసుల స్కానింగే తీసి
క్లొనింగ్ తో నవ లోకం చేయ్యాలి

ఓని తీసీ తగలెట్టేయి
నిప్పులోన ఈత కొట్టేయి
డబ్బులోన హార్ట్ వేసి సబ్బు రుద్దేయి

కలలుండి ఏం లాభం
కలలెప్పుడు కనకుంటే
కలగన్నా ఏం లాభం
కలలో భయము భీభత్సం

take it easy

యే స్వర్గం లాంటి ఇల్లు ఉన్నా
ఏం లాభం freedom లేకుంటే

లోకం పికే నరకాలి పెట్రోల్ ఏసీ కాల్చాలి
నవరత్నమే నరాల్లో నింపాలి
మనిషిగా పుట్టి ఏం లాభం
మనసులకుందా ఆనందం
ప్రతి మనిషిలో పగ ద్వేషం స్వార్థం

సరదాగా పోగ తాగేయ్ జలసాగ తేగ తాగేసేయ్
ఆకలేస్తే హత్య చేసేయ్ who cares
డబ్బు ఉంటే తప్పు పట్టదిలోకం

బతుకంటే చావడమే చస్తూనే బతకాలి
జగమంతా జగడాలే
మనిషికీ మనిషే విషమవుతుంటే

take it easy

యే యే చద్దమన్నా హే హే పుట్టడం మళ్లీ కాయం
మరి చావడమేందుకులే

ఎవరెస్ట్నే కోక్ టిన్ చేసి
రెయిన్ బో నేమో స్ర్టా చేసి

సూరీడికే తాగించేద్దాం ఫుల్ చేసి
చుక్కలు కోసి ఫ్రై చేసి
మెరుపులు నూడిల్సే చేసి
తినిపించుదాం చంద్రుడికే
యే యే ఆకేసి

గుండెలే బండవుతుంటే
మమతలే మసి అవుతుంటే
మనుషులే రాక్షససులయితే
నడిచే శవాలు బతికేమి లాభం

ఒంటిలో లావా పొంగి
ఊహలే నిప్పై మండి
నిలువునా కాల్చేస్తుంటే
ఎన్నాళ్ళు ఏడ్చినా ఏమి లాభం

take it easy
take it easy baby
take it easy
take it easy
take it easy
take it easy

లోకం పికే నరకాలి పెట్రోల్ ఏసీ కాల్చాలి
ఈ సృష్టికే ప్రతి సృష్టే చేయ్యాలి

డబ్బేంతుంటే ఏం లాభం
కొనడం కష్టం సంతోషం
ఈ హిస్టరీ తిరగేసి రాసేద్దాం

నలుగురి కోసం బతకోద్దు
పెద్దల మాటే వినవద్దు
పది మందికై నువు కారాదు ఖైదు

ఇండియన్ కల్చర్ వదిలేసి
వయసును కంప్యూటరైజ్ చేసి
కలలే కను కళ్లే కెమేరా చేసి





22, జూన్ 2020, సోమవారం

తకదిమి తోం తకదిమి తోం పాట లిరిక్స్ - Thakadimithom Thakadimithom Telugu Song Lyrics - Aarya (2004) Telugu Songs Lyrics





చిత్రం : ఆర్య (2004)
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
సంగీతం : దేవీశ్రీప్రసాద్
గానం : టిప్పు 

హేయ్ తకదిమి తోం తకదిమి తోం 
తరికిట తరికిట తకదిమి తోం 
చిందులు వేసే వయసుకు తకదిమి తోం 

తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని 
తకదిమి తోం ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం 

కష్టం నష్టం ఎదురైనా నచ్చినదె చేసేద్దాం 
అలవాటైతే చేదైనా తకదిమి తోం 

తప్పో ఓప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం 
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం 

కృషి ఉంటే నీవేంటేరా ఈ లోకం 

గాయేంగే జోష్ కెలియే 
జీయేంగే 
ప్యార్ కేలియే 

హేయ్ తకదిమి తోం తకదిమి తోం 
తరికిట తరికిట తకదిమి తోం 
చిందులు వేసే వయసుకు తకదిమి తోం 

తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని 
తకదిమి తోం ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం 

చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని 
తరిమేయ్యరా ఆ ఓర్పుకి తకదిమి తోం 

ఉల్లాసమే ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా
ఉరకాలిరా ఆ జోరుకి తకదిమి తోం 

పరిగెడదాం పరిగెడదాం 
గెలిచేవరకు పరిగెడదాం 

గురిచూసాక మనకింకా తిరుగేది 

గాయేంగే జోష్ కెలియే 

హేయ్ తకదిమి తోం తకదిమి తోం 
తరికిట తరికిట తకదిమి తోం 
చిందులు వేసే వయసుకు తకదిమి తోం 

నీ మాటతో అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం 
ఆగాలిరా ఆ నేర్పుకు తకదిమి తోం 

నీ ప్రేమతో ఆ శత్రువునే ఓ మిత్రునిగా మార్చాలిరా 
ఆ గెలుపుకి తకదిమి తోం 

ఒకటవుదాం ఒకటవుదాం 
ప్రేమను పంచగ ఒకటవుదాం 

ప్రేమించే మనసుంటే మహరాజే 

జీయేంగే 
ప్యార్ కేలియే 

హేయ్ తకదిమి తోం తకదిమి తోం 
తరికిట తరికిట తకదిమి తోం 
చిందులు వేసే వయసుకు తకదిమి తోం
తకదిమి తోం

కష్టం నష్టం ఎదురైనా నచ్చినదె చేసేద్దాం 
అలవాటైతే చేదైనా తకదిమి తోం 

కృషి ఉంటే నీవేంటేరా ఈ లోకం 

గాయేంగే జోష్ కెలియే 
జీయేంగే 
ప్యార్ కేలియే 

21, జూన్ 2020, ఆదివారం

కనలేదే నువ్వని పాట లిరిక్స్ - Kanalede Nuvvani Song Lyrics in Telugu - Kanalede Nuvvani (2020) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : కనలేదే నువ్వని (2021)
సాహిత్యం : లక్ష్మన్ గంగ
సంగీతం : జాదవ్ ఆయాన్
గానం : సిద్ శ్రీరామ్

కనలేదె నువ్వని
నిజమే ..

నీతోనే సాగాలి
ఈ క్షణమే ......

ఇది ప్రేమ.....

నిజమేన .....

గుండెకే .....

నీ పేరు రాసిన ఈ గాలిలో

ఈ మాయ తీరేమీటే

నీ మోము గీసిన మేఘాలలో

ఈ హాయి వెలుగేమిటే

వినదే మనసే తెలిసీ

అనుకోని వరసే నను కలిసీ

ఎదకే ఇపుడే కలలేవో మొలిచే .....

ఓ .. ఓ ...

కనలేదే నువ్వని
నిజమే ....
నీతోనే సాగాలి
ఈ క్షణమే .....

ఇది ప్రేమ.....
నిజమేన .....
గుండెకే .....

నేనన్న లోకమే విడిచానుగా

నీ మాటే వినిపించగా

నీవన్న వైనమే వలచానుగా

నీ చూపే నను తాకగా

అధరం చిలికే మధురం
నిదరే మరిచే నా నయనం

పవనం దూపం పలికెను రాగం

ఓ .. ఓ .... ఓహోహో

కనలేదే నువ్వని
నిజమే
నీతోనే సాగాలి

ఈ క్షణమే ......
ఇది ప్రేమ.....
నిజమేన .....
గుండెకే .....

20, జూన్ 2020, శనివారం

చిట్టి జాబిలి ఓ జాబిలి పాట లిరిక్స్ - Chitti Jabili O Jabili Song Lyrics in Telugu - Kadali (2013) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి


















చిత్రం : కడలి (2013)
సాహిత్యం : వనమాలి
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : విజయ్ ఏసుదాస్





చిట్టి జాబిలి ఓ జాబిలి
గగన వీధీ కాచు దేవుడు ...
ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నారో .....
నువ్ కూడా ఒంటరిగా ఉన్నావ్ రో

సాగిపో బిడ్డ సాగి నువ్వు ఆకాశం
అందుకో బిడ్డ

చిట్టి జాబిలి ఓ జాబిలి
గగన వీధీ కాచు దేవుడు ...
ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావిరో .....
నువ్ కూడా ఒంటరిగా ఉన్నావ్ రో

సాగిపో బిడ్డ సాగి నువ్వు ఆకాశం
అందుకో బిడ్డ

మనిషే కలిస్తే జరుగుతుందే
మనసులో....నే వెలుగోందే
నాటిన విత్తే చేమట చిందాకే
నేలే తాళం తీయునులే

సాగిపో బిడ్డ సాగి నువ్వు ఆకాశం
అందుకో బిడ్డ

దృశ్యం దోచును కన్నుల నుంచే
దేశం దోచును కధనం నుంచే
శ్లోకం తోచును శోకం నుంచే
జ్ఞానం తోచును ఓటమి నుంచే

సుడులే తిరిగితే నవ్వుతుందే దీపం ....
నావలే కుంగితే చిరు కొమ్మె ఊతం


చిట్టి జాబిలి ఓ జాబిలి
సాగిపో బిడ్డ సాగి నువ్వు ఆకాశం
అందుకో బిడ్డ

కూలిన మాను తొడుగును చిగురు
కుమిలే మనసుకు తోడిక ఎవరు

పుడమిని తెరువు నిధులను కొసరు
పూలను తెరువు తేనేలు జారు

కూలిన మాను తొడుగును చిగురు
కుమిలే మనసుకు తోడిక ఎవరు

పుడమిని తెరువు నిధులను కొసరు
పూలను తెరువు తేనేలు జారు

నదులను తెరువు తుల్లును పైరు
నమ్మకమేగ రేపుకి పేరు

నదులను తెరువు తుల్లును పైరు
నమ్మకమేగ రేపుకి పేరు

ఓ.. ఓ... ఓ... ఓ... ఓ...

చిట్టి జాబిలి ఓ జాబిలి
చిట్టి జాబిలి ఓ జాబిలి

నమ్మకమేగ రేపుకి పేరు
అదో అదో ఓ జాబిలి 




19, జూన్ 2020, శుక్రవారం

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ పాట లిరిక్స్ - Telugu Bengali English Marathi Telugu Song Lyrics - Dhada (2011) Telugu Songs Lyrics



దడ సినిమా పాటలకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది 

మొదటి సారిగా నేను బయటి నెట్ సెంటర్ కీ వెళ్లి డౌన్ లోడ్ చేసుకున్న పాటలు. 

అప్పటి వరకు వెబ్సైట్లు, ఇంటర్నెట్ అనే పదాలు వినటమే కానీ తెలీదు. 

వాటి గురించి తెలుసుకోవటం మాత్రం ఈ సినిమా పాటల ద్వారా మాత్రమే 

ఆ వెబ్సైట్ పేరు కూడా నాకు ఇప్పటికి గుర్తు ' సాంగ్స్ ఏపీ డాట్ కామ్ ' అనుకుంటా, 

సినిమా అంతగా ఆడకపోయినా పాటలు మాత్రం  ఒక రేంజ్ లో మార్మోమోగాయి ఆ రోజుల్లో 


ఈ సినిమాలోని తెలుగు బెంగాలీ పాట సాహిత్యం 

మీకోసం నేను నా పాటలో


ఈ పాటని ఇక్కడ చూడవచ్చు 








చిత్రం : దడ (2011)

సాహిత్యం : అనంత శ్రీరామ్

సంగీతం : దేవీశ్రీప్రసాద్

గానం : నీరజ్ శ్రీధర్




యే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని

యే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ

ఓ నిన్నని మొన్నని మరిచి దరువేయ్యనీ ...

యే తప్పు అని గిప్పు అని ఎవడేదైనా చెప్పనీ...


యే మేడ మీద బాల్కనీ ఇవ్వలేదు

ఈడ ఉన్న మజానీ

హే డోలే ఊహకందనీ ఉత్సాహాన్ని

కళ్లల్లో కాళ్లల్లో చెంపల్లో చేతుల్లో

రప్పించి స్టెప్ ఎయ్ హనీ ....


తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ

భాషే లేదంటే లైఫ్ అంతా హాట్ యే


జీన్స్ ట్రౌజర్ లుంగీ లంగోటి

తేడా లేదంటే లైఫ్ అంతా పార్టీ


యే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని ....

యే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ ...


డూ ఇట్ బెబే


ఎవ్రీబడీ సీ మీ టు ద మూన్

ఐ గాట్ ఇట్ గో వే

గ్రాంట్ ఇన్ త్రూ ద బీట్ గో

బూమ్ బూమ్

స్పీకర్స్ బ్లో వే


డిజె ప్లే ద గ్రూవ్ అన్ టిల్ ద మూన్

షైన్ ఇట్స్ గ్లోయుంగ్ డాన్స్ అండ్ కమాన్ కమాన్

స్టెప్ అప్ దిజ్ ఇజ్ ఆల్ వీ డూ యట్


యే డిజె బీటే అలా రోజు వింటే

చెవులు హీట్ హీటు

అడపాదడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే...


మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే

అసలు కిక్కు లేదోయ్

కొంచెం కొంచెం ఇలా షేరింగ్ చేస్తే ఫుల్ ఎక్కుతావు


చిల్లి చికెన్ చీకుతో

చిత్తుగా చిందులేస్తే చింత మాయం


ఓయ్ మిర్చి మటన్ ముక్కలే

మత్తులో అందిస్తాయి వింత సాయం


యే కోల్డ్ కాఫీ పక్కనెట్టు గరము చాయ్

ముందరుంది సిప్ ఏసి స్టెప్ ఏయ్ హనీ.....


తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ

భాషే లేదంటే లైఫ్ అంతా హాట్ యే


జీన్స్ ట్రౌజర్ లుంగీ లంగోటి

తేడా లేదంటే లైఫ్ అంతా పార్టీ


యే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని

యే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ


ఏమ్ మాయరో ఏమ్ మాయరో

ఏదో చేసేసావురో


సిండ్రెల్లా లాంటి అమ్మాయిలో

చిత్రంగా మత్తెదో నింపావురో


నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో

గోరంతటీ తన గుండెలో కొండంత కల్లోలం పంపావురో


తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ

భాషే లేదంటే లైఫ్ అంతా హాట్ యే


సోని సోని జర సోచో సోని నీకే అర్ధమవుద్ది 

సంతోషాన్ని ఇలా పంచుకుంటే ఇంకా పెరుగుతాది

కానీ కానీ అరే బాతాకానీ గుండె తెలీకవుద్ది

సుత్తి సోది అలా వేసేకొద్ది ఫ్రెండ్ షిప్ ఎక్కువవుద్ది


యే రచ్చే రచ్చే వయసులో రచ్చ రచ్చ

చేయాలని రూలు ఉంది

యే గిచ్చే గిచ్చే ఆశలే రచ్చి తీర్చుకోవాలని

రాసి ఉంది పిల్లా


సెంట్రల్ ఏసి ఆఫ్ చేసి చల్లగాలిలోన మనసు

విప్పెసి స్టెప్ ఏయ్ హనీ ......


తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ

భాషే లేదంటే లైఫ్ అంతా హాట్ యే


జీన్స్ ట్రౌజర్ లుంగీ లంగోటి

తేడా లేదంటే లైఫ్ అంతా పార్టీ