17, జనవరి 2022, సోమవారం

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక పాట లిరిక్స్ - Nee Jadakucchulu Naa Medakucchulu Song Lyrics in Telugu - Subhalekha (1982) Telugu Songs Lyrics










చిత్రం :  శుభలేఖ (1982)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం :  వేటూరి సుందరరామమూర్తి

గానం :  యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

 

 

 

గురుర్బ్రహ్మ గురుర్విష్ణూ గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

 

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక

నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక

ఓ..నవమి చిలుక.. నగవు చిలుక..

తగదు అలుక.. తగవు పడక

 

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక

నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక

ఓ..నవమి చిలుక.. నగవు చిలుక..

తగదు అలుక.. తగవు పడక

 


 

అడిగింది కన్నెయీడు శెలవింక.. 

నిన్నే శెలవింకా

ఇచ్చే కౌగిళ్ళల్లోనే తమకి నెలవింక..

ఇస్తా నెలవంకా

 

ఆపాలి అబ్బాయిగారు చొరవింక.. 

చిలిపి చొరవింకా

పచ్చ పచ్చని కాపురాలే మనవింక..

వింటే మనవింకా

 

అలగక తొలగక నను విడి కదలక

మనకిక కలదిక మరువక కలయిక

అలగక తొలగక నను విడి కదలక

మనకిక కలదిక మరువక కలయిక

పరువపు తెరవడి చలి చలి అలజడి చాలింకా

 

ఓ..నవమి చిలుక నగవు చి

లుక తగదు అలుక తగవు పడక

 

 

నీ చిరునవ్వులు నా సిగ పువ్వులు కనుక

నా వెనుక నీ నడక నాకెందుకులే కినుక

ఓ.. ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడక

 

 

 

తననం తననం తననం తననం తనన

దంద తన దం దం దం దం తందా..

తననం తననం తననం తననం తనన

తంద దం దా నా నా నా...

హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్..

గూడ్!

హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్?

యేవైందండీ?

ఆహా!

పపదని పపపప దని మమ

పద మమమమ పద

లా ల లా ల లా ల లా ల...

 

 

మనసైన మరునాడే త్వరపడక..

నువ్వు జొర పడక

పొద్దు వాలేటి వేళల్లోన చొరపడకా..

కొంగు ముడి పడక

 

ఆపాలి అమ్మయిగారు గొడవింకా..

మతులే పడవింకా

నీవు నేనైన రేవు చేరే పడవింకా..

సాగే గుడివంక

 

బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక

పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక

బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక

పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక

మనసుకు మమతకు మనువులు జరిగితే చాలింకా

 

ఓ..ఉలికి పడక.. కలికి పలుక..

కలత పడక.. కలత పడక

 

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక

నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక

ఓ..నవమి చిలుక.. నగవు చిలుక..

తగదు అలుక.. తగవు పడక

 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి